Riches గురించి బైబిల్ వచనాలు: The true riches
The true riches గురించి వచనాలు
దేవుడు చేసిన కార్యాలను బట్టి మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. ఇప్పుడు క్రీస్తే దేవుని ద్వారా మనకు జ్ఞానంగా ఉన్నారు అనగా ఆయనే మన నీతిగా, పరిశుద్ధతగా, విమోచనగా ఉన్నారు.
పరిశుద్ధులలో నేను అత్యంత అల్పున్ని కానీ లెక్కించలేని ఆశీర్వాదాలు క్రీస్తు యేసులో ఉన్నాయని యూదేతరులకు ప్రకటించడానికి దేవుడు తన దయతో నన్ను ఏర్పరచుకున్నారు.
బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలోనే దాచబడి ఉన్నాయి.
ఇప్పుడు విశ్వసించేవారికి ఈ రాయి అమూల్యమైనది. కాని విశ్వసించని వారికి, “ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది.”