కంటెంట్‌కు వెళ్లండి

Riches గురించి బైబిల్ వచనాలు

225 వచనాలు · 107 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నేను గమనించిన వాటిలో మంచిది ఏదనగా: దేవుడు తనకిచ్చిన రోజులన్నిటిలో ఒక వ్యక్తి తిని, త్రాగుతూ సూర్యుని క్రింద తాను చేసిన శ్రమతో సంతృప్తి చెందాలి. ఎందుకంటే ఇదే వారు చేయవలసింది.

  2. అంతేకాక, దేవుడు ఒక వ్యక్తికి సంపదను ఆస్తులను వాటిని అనుభవించగల సామర్థ్యాన్ని ఇచ్చినప్పుడు, వారు తమ భాగాన్ని తీసుకుని వారి కష్టార్జితంలో వారు ఆనందంగా ఉండాలి; ఇది దేవుని వరము.

  3. దేవుడతనికి హృదయంలో ఆనందం కలిగిస్తారు కాబట్టి అతడు తన గతాన్ని సులభంగా మరిచిపోగలుగుతాడు. వారు వారి జీవితపు రోజులను చాలా అరుదుగా ప్రతిబింబిస్తారు.

  4. నేను సూర్యుని క్రింద మరొక చెడు చూశాను, అది మనుష్యజాతి మీద ఎంతో భారంగా ఉంది.

  5. దేవుడు కొందరికి ధనం, ఆస్తి, గౌరవం ఇస్తారు, తద్వార వారి హృదయాలు కోరుకున్నవేవి వారికి కొదువగా ఉండవు. కాని వాటిని అనుభవించే సామర్థ్యాన్ని వారికి దేవుడు ఇవ్వరు, అపరిచితులు వాటిని అనుభవిస్తారు. ఇదంతా అర్థరహితమే, చెడ్డ విషయమే.

  6. జ్ఞానం ఒక వారసత్వంలా ఒక మంచి విషయమే అది సూర్యుని క్రింద బ్రతికి ఉన్నవారికి ప్రయోజనం కలిగిస్తుంది.

  7. డబ్బుతో భద్రత లభించినట్లే, జ్ఞానంతో కూడా భద్రత లభిస్తుంది, ప్రయోజనం ఏంటంటే: జ్ఞానం తనను కలిగినవారిని కాపాడుతుంది.

  8. నవ్వడం కోసం విందు చేస్తారు, ద్రాక్షరసం జీవితానికి సంతోషం కలిగిస్తుంది, డబ్బు ప్రతిదానికీ సమాధానం.

  9. చోటు మిగులకుండ మీరు మాత్రమే దేశంలో నివసించేలా ఇంటికి ఇల్లు, పొలానికి పొలం కలుపుకునేవారికి శ్రమ.

  10. యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: “జ్ఞానులు తమ జ్ఞానాన్ని గురించి గొప్పలు చెప్పుకోకూడదు బలవంతులు తమ బలం గురించి గొప్పలు చెప్పుకోకూడదు ధనవంతులు తమ ఐశ్వర్యం గురించి గొప్పలు చెప్పుకోకూడదు,

  11. అన్యాయంగా ధనాన్ని సంపాదించేవారు పెట్టని గుడ్ల మీద పొదిగిన కౌజుపిట్టలాంటి వారు. వారి జీవితం సగం ముగిసినప్పటికే సంపద వారిని వదిలివేస్తుంది, చివరికి వారు మూర్ఖులు అని నిరూపించబడతారు.

  12. “కాబట్టి నా హృదయం మోయాబు గురించి పిల్లనగ్రోవిలా విలపిస్తుంది; అది కీర్ హరెశెతు ప్రజలకు పిల్లనగ్రోవిలా విలపిస్తుంది. వారు సంపాదించిన సంపద పోయింది.

  13. మీ లోయలు చాలా ఫలవంతమైనవి, అని మీరు మీ లోయల గురించి ఎందుకు గొప్పలు చెప్పుకుంటారు? అమ్మోనూ, నమ్మకద్రోహియైన కుమార్తె, నీవు నీ సంపదపై నమ్మకం ఉంచి, ‘నాపై ఎవరు దాడి చేస్తారు?’ అని అంటున్నావు.

  14. నీకున్న జ్ఞానంతో వివేకంతో నీకోసం సంపద సంపాదించుకుని నీ ఖజానాలో వెండి బంగారాలను పోగు చేసుకున్నావు.

  15. వ్యాపారంలో నీకున్న గొప్ప నైపుణ్యంతో నీ సంపదను వృద్ధి చేసుకున్నావు, నీ సంపదను బట్టి నీవు హృదయంలో గర్వించావు.

  16. వారు నిన్ను పాతాళంలో పడవేస్తారు. సముద్రం మధ్యలో భయంకరంగా చనిపోతావు.

  17. “నేను చాలా ధనవంతుడను; నాకున్న ధనాన్ని బట్టి వారు నాలో ఏ తప్పును కాని పాపాన్ని కాని చూపించలేరు” అని ఎఫ్రాయిం అతిశయిస్తున్నాడు.

  18. వారు భూములను ఆశించి ఆక్రమించుకుంటారు, ఇళ్ళను ఆశించి తీసుకుంటారు. వారు ప్రజలను మోసం చేసి వారి ఇళ్ళను లాక్కుంటారు, ప్రజల నుండి వారి స్వాస్థ్యాన్ని దోచుకుంటారు.

  19. కాబట్టి యెహోవా చెప్పే మాట ఇదే: “నేను ఈ వంశం మీదికి విపత్తు రప్పించబోతున్నాను, దాని నుండి మీరు మిమ్మల్ని కాపాడుకోలేరు. అది విపత్తు కాలం కాబట్టి మీరు ఇక ఎన్నడు గర్వంగా నడవలేరు.

  20. మీ ధనవంతులు దౌర్జన్యం చేస్తున్నారు; మీ నివాసులు అబద్ధికులు వారి నాలుకలు కపటంగా మాట్లాడతాయి.

  21. “అయితే వారందరూ అతన్ని ఎగతాళి చేస్తూ ఈ సామెత చెబుతారు, “ ‘దొంగిలించిన వస్తువులను పోగుచేసి బలత్కారంతో ధనవంతునిగా మారిన వారికి శ్రమ! ఇలా ఎంతకాలం కొనసాగుతుంది?’

  22. అప్పు ఇచ్చినవారు నీ మీద అకస్మాత్తుగా పడరా? వారు లేచి నీకు వణుకు పుట్టించరా? అప్పుడు వారు నిన్ను దోచుకుంటారు.

  23. నీవు అనేక దేశాలను దోచుకున్నావు కాబట్టి, మిగిలి ఉన్న ప్రజలంతా నిన్ను దోచుకుంటారు. నీవు నరహత్యలు చేసినందుకు, భూములను పట్టణాలను వాటిలోని వారందరినీ నాశనం చేసినందుకు ప్రజలు నిన్ను దోచుకుంటారు.

  24. యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని తప్పించలేవు.” ఆయన రోషాగ్ని చేత లోకమంతా దగ్దమవుతుంది, ఆయన హఠాత్తుగా భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోతున్నారు.

  25. వెండి నాది, బంగారం నాది; ఇదే సైన్యాల యెహోవా మాట.