Skip to content

Haman

45 వచనాలు · 12 కుటుంబ సభ్యులు

Haman ను ప్రస్తావించే వచనాలు

  1. ఈ సంఘటనలు జరిగిన తర్వాత, రాజైన అహష్వేరోషు అగగీయుడైన హమ్మెదాతా కుమారుడైన హామానుకు ఇతర సంస్థానాధిపతులందరికన్నా ఉన్నత స్థానాన్ని ఇచ్చి అతన్ని గౌరవించాడు.

  2. రాజ ద్వారం దగ్గర ఉండే రాజ్యాధికారులంతా మోకరించి రాజాజ్ఞ ప్రకారం హామానుకు నమస్కరించారు. అయితే మొర్దెకై హామాను ముందు మోకరించి నమస్కరించలేదు.

  3. ప్రతిరోజు వారు అతన్ని అడుగుతున్నా అతడు ఖాతరు చేయలేదు. మొర్దెకై తాను యూదుడని వారికి చెప్పాడు కాబట్టి అతడు తాను చెప్పిన దానిపై నిలబడతాడో లేదో చూడాలని ఈ విషయం హామానుకు చెప్పారు.

  4. మొర్దెకై తన ఎదుట మోకరించడం లేదని, గౌరవించడం లేదని చూసి హామానుకు చాలా కోపం వచ్చింది.

  5. మొర్దెకై ఏ జాతివాడో తెలుసుకుని, అతన్ని ఒక్కడినే చంపితే సరిపోదు అని అతడు అనుకున్నాడు. బదులుగా హామాను, అహష్వేరోషు రాజ్యమంతటిలో ఉన్న మొర్దెకై ప్రజలను అనగా యూదులందరిని నాశనం చేసే మార్గం కోసం ఆలోచించాడు.

  6. రాజైన అహష్వేరోషు పరిపాలనలోని పన్నెండవ ఏట, మొదటి నెల అయిన నీసానులో హామాను సమక్షంలో ఏ నెల ఏ రోజున అలా చేయాలో అని పర్షియా భాషలో పూరు, అనగా చీటి వేశారు. ఆ చీటిలో అదారు అనే పన్నెండవ నెల వచ్చింది.

  7. అప్పుడు హామాను రాజైన అహష్వేరోషుతో ఇలా అన్నాడు, “మీ రాజ్యంలోని సంస్థానాలన్నిటిలో ఉండే ప్రజల్లో ఉన్న ఒక జాతి ప్రజలు వేరుగా ఉంటున్నారు. వారి చట్టాలు ఇతర ప్రజల చట్టాలకు వేరుగా ఉన్నాయి; వారు రాజు శాసనాలను పాటించరు; అలా వారిని సహించడం రాజుకు అంత మంచిది కాదు.

  8. కాబట్టి రాజు తన చేతికున్న ముద్ర ఉంగరం తీసి అగగీయుడైన హమ్మెదాతా కుమారుడైన హామానుకు ఇచ్చాడు, ఇతడు యూదులకు శత్రువు.

  9. రాజు హామానుతో, “డబ్బు నీ దగ్గర పెట్టుకో, నీకు ఏది ఇష్టమో, అది ప్రజలకు చేయి” అన్నాడు.

  10. తర్వాత మొదటి నెల పదమూడవ రోజున రాజ కార్యదర్శులను పిలిపించారు. వారు హామాను ఆజ్ఞలన్నిటిని రాజు సంస్థానాధిపతులకు, సంస్థానాధికారులకు, ఆ సంస్థానాల్లోని ప్రజల అధిపతులకు, అధికారులకు వారి వారి లిపిలో వారి భాషలో వ్రాసి పంపాలని ఆజ్ఞాపించారు. వాటిని రాజైన అహష్వేరోషు పేరిట వ్రాసి వాటిపై రాజు ఉంగరంతో ముద్ర వేశారు.

  11. అది రాజాజ్ఞ కాబట్టి వార్తాహరులు వెంటనే బయలుదేరి వెళ్లారు. ఆ ఆజ్ఞ షూషను కోటలో అందించడం జరిగింది. రాజు, హామాను త్రాగడానికి కూర్చుకున్నారు, కాని షూషను పట్టణం ఆందోళనగా ఉంది.

  12. మొర్దెకై తనకు జరిగిందంతా చెప్పాడు, యూదులను నాశనం చేయడానికి హామాను రాజు ఖజానాకు ఇస్తానన్న డబ్బు మొత్తం ఎంతో అతనికి తెలిపాడు.

  13. ఎస్తేరు జవాబిస్తూ, “రాజుకు ఇష్టమైతే, ఈ రోజు నేను రాజు కోసం సిద్ధం చేయించిన విందుకు మీరు హామానుతో పాటు రావాలి” అన్నది.

  14. రాజు తన సేవకులతో, “ఎస్తేరు అడిగింది జరిగేలా వెంటనే హామానును తీసుకురండి” అన్నాడు. కాబట్టి రాజు, హామాను, ఎస్తేరు చేయించిన విందుకు వెళ్లారు.

  15. రాజుకు నాపై దయ కలిగి, నా అభ్యర్థనను మన్నించి నా మనవిని నెరవేరుస్తానంటే, నేను మీకోసం రేపు ఏర్పాటు చేసే విందుకు రాజైన మీరు, హామాను రావాలి. అప్పుడు నేను రాజు ప్రశ్నకు జవాబిస్తాను” అన్నది.

  16. హామాను ఆ రోజు మహానందంతో బయటకు వెళ్లాడు. కాని, రాజభవన ద్వారం దగ్గర ఉన్న మొర్దెకై తనను చూసి కూడా లేచి నిలబడలేదని తన ఎదుట ఎలాంటి భయం చూపించలేదని చూసి అతనికి మొర్దెకై మీద తీవ్రమైన కోపం వచ్చింది.

  17. అయినా హామాను తనను తాను నిగ్రహించుకొని ఇంటికి వెళ్లాడు. తన స్నేహితులను, తన భార్యయైన జెరెషును పిలిచి,

  18. హామాను గర్వంగా తనకున్న విస్తారమైన ఐశ్వర్యం గురించి, తనకున్న ఎంతోమంది కుమారుల గురించి, రాజు తనను ఎన్ని విధాలుగా ఘనపరిచాడో, ఎలా తనను ఇతర సంస్థానాధిపతుల ఎదుట గౌరవించాడో వారికి గొప్పగా చెప్పుకున్నాడు.

  19. హామాను ఇంకా మాట్లాడుతూ, “అంతేకాదు, ఎస్తేరు రాణి, తాను ఇస్తున్న విందుకు రాజుతో పాటు రమ్మని నన్ను మాత్రమే పిలిచింది. రేపు విందుకు రాజుతో రమ్మని నన్ను ఆహ్వానించింది.

  20. అతని భార్య జెరెషు, అతని స్నేహితులందరు, “యాభై మూరల ఎత్తుగల ఉరికంబం చేయించు. రేపు ఉదయం మొర్దెకైను దాని మీద ఉరి తీయమని రాజుకు చెప్పు. తర్వాత రాజుతో పాటు విందుకు వెళ్లి ఆనందించు” అని అతనికి చెప్పారు. ఈ సలహా హామానుకు నచ్చింది, కాబట్టి అతడు ఉరికంబం చేయించాడు.

  21. రాజు, “ఆవరణంలో ఉన్నది ఎవరు?” అని అడిగాడు. అప్పుడే హామాను, తాను సిద్ధపరచిన ఉరికంబం మీద మొర్దెకైను ఉరితీయడం గురించి రాజుతో మాట్లాడడానికి బయట ఆవరణంలోకి ప్రవేశించాడు.

  22. రాజు సేవకులు, “హామాను ఆవరణంలో నిలబడ్డాడు” అని చెప్పారు. వెంటనే, “అతన్ని లోనికి తీసుకురండి” అని రాజు ఆదేశించాడు.

  23. హామాను లోపలికి వచ్చినప్పుడు, “రాజు ఒకరిని సన్మానం చేయాలని ఇష్టపడితే ఆ మనిషికి ఏమి చేయాలి?” అని రాజు అతన్ని అడిగాడు. హామాను, “నన్ను కాకుండా రాజు ఇంకెవరిని సన్మానిస్తాడు?” అని తనలో తాను అనుకున్నాడు.

  24. కాబట్టి హామాను రాజుతో, “రాజు సన్మానించాలని అనుకునే వ్యక్తి కోసం,

  25. అందుకు రాజు, “త్వరగా వెళ్లు, నీవు చెప్పినట్టే రాజ వస్త్రం, గుర్రం తీసుకుని, రాజ ద్వారం దగ్గర కూర్చుని ఉండే యూదుడైన మొర్దెకైకి చేయి. నీవు చెప్పింది ఏదైన మానకు” అని హామానుకు ఆజ్ఞాపించాడు.