కంటెంట్‌కు వెళ్లండి

Haman

45 వచనాలు · 12 కుటుంబ సభ్యులు

Haman ను ప్రస్తావించే వచనాలు

  1. కాబట్టి హామాను రాజవస్త్రాలు, గుర్రం తీసుకువచ్చి మొర్దెకైకు ఆ వస్త్రాలు ధరింపజేసి గుర్రం మీద అతన్ని కూర్చోబెట్టి నగర వీధుల్లో వెళ్తూ, “రాజు ఓ వ్యక్తిని సన్మానించాలని ఇష్టపడితే ఇలా అతనికి చేయబడుతుంది!” అని అంటూ ఊరేగింపు చేశాడు.

  2. తర్వాత మొర్దెకై రాజ ద్వారం దగ్గరకు తిరిగి వచ్చాడు. కాని హామాను దుఃఖంతో తల కప్పుకుని వేగంగా ఇంటికి వెళ్లి,

  3. హామాను తనకు జరిగిందంతా తన భార్య జెరషుకు, తన స్నేహితులందరికి తెలియజేశాడు. అతని సలహాదారులు, అతని భార్య జెరెషు అతనితో అన్నారు, “ఎవరి ఎదుట నీ పతనం ప్రారంభమైందో, ఆ మొర్దెకై యూదుడు కాబట్టి, అతని ఎదుట నీవు నిలబడలేవు, నీవు ఖచ్చితంగా పడిపోతావు.”

  4. వారింకా మాట్లాడుకుంటున్నప్పుడు, రాజు యొక్క నపుంసకులు వచ్చి, ఎస్తేరు రాణి చేయించిన విందుకు రమ్మని హామానును తొందరపెట్టారు.

  5. కాబట్టి రాజు హామాను ఇద్దరూ కలిసి, ఎస్తేరు రాణి యొక్క విందుకు వెళ్లారు.

  6. అందుకు ఎస్తేరు అన్నది, “ఆ విరోధి, శత్రువు, ఈ దుష్టుడైన హామానే!” అప్పుడు హామాను, రాజు రాణి ముందు భయంతో వణికిపోయాడు.

  7. రాజు ఆవేశంతో లేచి, ద్రాక్షరసం వదిలి రాజభవన తోటలోకి వెళ్లాడు. అయితే రాజు తనకు హాని చేయాలని నిర్ణయించాడని గ్రహించిన హామాను తన ప్రాణాల కోసం ఎస్తేరు రాణిని బ్రతిమాలడానికి అక్కడే ఉండిపోయాడు.

  8. తోటలో నుండి రాజు విందుశాలకు వచ్చాడు, ఆ సమయంలో హామాను ఎస్తేరు రాణి కూర్చున్న మంచం పైన పడి ఉండడం చూశాడు. రాజు ఆవేశంతో, “ఇంట్లో రాణి నాతో ఉండగానే వీడు రాణి మీద అత్యాచారం చేస్తాడా?” అని అన్నాడు. రాజు నోటి నుండి ఆ మాట రావడంతోనే సైనికులు హామాను ముఖానికి ముసుగు వేశారు.

  9. రాజు సేవచేసే నపుంసకులలో హర్బోనా అనే ఒకడు, “నిజానికి, రాజు తరపున మాట్లాడిన మొర్దెకైని చంపించడానికి హామాను తన ఇంటి వద్ద యాభై మూరల ఒక ఉరికంబాన్ని చేయించాడు” అని చెప్పాడు. వెంటనే రాజు, “దానిమీదే అతన్ని ఉరితీయండి” అని అన్నాడు.

  10. మొర్దెకై కోసం హామాను చేయించిన ఉరికంబం మీద హామానును ఉరితీశారు. అప్పుడు రాజు కోపం చల్లారింది.

  11. అదే రోజు రాజైన అహష్వేరోషు యూదుల శత్రువైన హామాను ఇంటిని ఎస్తేరు రాణికి ఇచ్చాడు. మొర్దెకైతో తనకున్న బంధుత్వం గురించి ఎస్తేరు రాజుకు చెప్పింది. మొర్దెకై రాజు సముఖంలోకి వచ్చాడు.

  12. రాజు హామాను నుండి తిరిగి తీసుకున్న తన ముద్ర ఉగరం తీసి మొర్దెకైకి ఇచ్చాడు. ఎస్తేరు అతన్ని హామాను ఆస్తుల మీద అధికారిగా నియమించింది.

  13. ఎస్తేరు రాజు పాదాల మీద పడి ఏడుస్తూ, తిరిగి మనవి చేసింది. అగగీయుడైన హామాను యూదులకు విరుద్ధంగా చేసిన కీడు ప్రణాళికను భంగం చేయాలని వేడుకొంది.

  14. ఆమె, “ఒకవేళ రాజుకు ఇష్టమైతే, నాపై దయ కలిగితే, అలా చేయడం సరియైనదని రాజు అనుకుంటే, అగగీయుడు, హమ్మెదాతా కుమారుడైన హామాను కుట్రపన్ని, రాజు సంస్థానాలలో ఉన్న యూదులను నిర్మూలం చేయాలని వ్రాయించిన తాకీదులను రద్దు చేయడానికి ఆజ్ఞ ఇవ్వండి.

  15. రాజైన అహష్వేరోషు ఎస్తేరు రాణికి, యూదుడైన మొర్దెకైకి జవాబిస్తూ అన్నాడు, “హామాను యూదులపై దాడి చేసినందుకు నేను అతని ఆస్తిని ఎస్తేరుకు ఇచ్చాను. అతడు సిద్ధం చేసిన స్తంభానికి అతన్ని వ్రేలాడదీశారు.

  16. ఈ పదిమంది యూదుల శత్రువైన హమ్మెదాతా కుమారుడైన హామాను కుమారులు. అయితే వారు వారి దోపుడుసొమ్మును ముట్టలేదు.

  17. రాజు ఎస్తేరు రాణితో, “యూదులు షూషను కోటలో అయిదువందల మందిని హామాను పదిమంది కుమారులను చంపారు. రాజు యొక్క ఇతర సంస్థానాలలో ఏమి జరిగింది? ఇప్పుడు నీ మనవి ఏంటి? అది నీకు ఇస్తాను. నీ కోరిక ఏంటి? అది కూడా చేస్తాను” అన్నాడు.

  18. ఎస్తేరు జవాబిస్తూ, “ఒకవేళ రాజుకు ఇష్టమైతే, ఈ శాసనం రేపు కూడా షూషనులో ఉన్న యూదులు చేసేలా అనుమతి ఇచ్చి హామాను పదిమంది కుమారులు ఉరికంబం మీద వ్రేలాడదీయబడేలా చేయండి” అని చెప్పింది.

  19. కాబట్టి అలా చేయమని రాజు ఆజ్ఞాపించాడు. షూషనులో ఆజ్ఞ జారీ చేయబడింది, వారు హామాను యొక్క పదిమంది కుమారులను ఉరితీశారు.

  20. యూదులందరికి శత్రువైన అగగీయుడు హమ్మెదాతా కుమారుడైన హామాను యూదులను నాశనం చేయడానికి కుట్రపన్ని, వారిని నాశనం చేసి, నిర్మూలించడానికి పూరు (అనగా, చీట్లు) వేశాడు.