Skip to content

Prudence గురించి బైబిల్ వచనాలు

192 వచనాలు · 40 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఎవరైతే అపరిచితునికి భద్రత కల్పిస్తారో వారు ఖచ్చితంగా నష్టపోతారు, కాని ప్రతిజ్ఞలో చేతులు దులుపుకునేవాడు క్షేమంగా ఉంటాడు.

  2. తన ఇంటివారిని బాధపెట్టేవారు ఏమీ సంపాదించుకోలేరు, మూర్ఖులు జ్ఞానంగలవారికి దాసులుగా ఉంటారు.

  3. మనుష్యులు తన వివేకాన్ని బట్టి పొగడబడతాడు, అలాగే వికృతమైన మనస్సు కలవారు తిరస్కరించబడతారు.

  4. మూర్ఖులు తమ కోపాన్ని వెంటనే చూపిస్తారు, కాని వివేకంగలవారు తమకు కలిగిన అవమానాన్ని మౌనంగా భరిస్తారు.

  5. వివేకంగల మనుష్యులు తమ తెలివిని దాచిపెడతారు కానీ మూర్ఖులు తమ మూర్ఖత్వాన్ని ప్రచారం చేసుకుంటారు.

  6. వివేకులైనవారందరు తెలివితో వ్యవహరిస్తారు, కాని మూర్ఖులు వారి మూర్ఖత్వాన్ని బహిర్గతం చేస్తారు.

  7. వివేకవంతుల జ్ఞానం వారి మార్గాలను ఆలోచించడం, కానీ మూర్ఖుల మూర్ఖత్వం మోసము.

  8. బుద్ధిహీనులు దేన్నైనా నమ్ముతారు, కానీ వివేకం కలవారు తన నడవడికను బాగుగా కనిపెడతారు.

  9. జ్ఞాని యెహోవాకు భయపడి చెడు నుండి తప్పుకుంటాడు, మూర్ఖులు కోపిష్ఠులై కూడా భద్రంగా ఉన్నట్లు భావిస్తారు.

  10. జ్ఞానం లేనివారికి వారి మూర్ఖత్వమే ఆస్తి. వివేకంగలవారు తెలివిని కిరీటంగా ధరించుకుంటారు.

  11. మూర్ఖుడు తన తండ్రి క్రమశిక్షణను తృణీకరిస్తాడు కాని దిద్దుబాటును స్వీకరించేవాడు వివేకాన్ని కనుపరచుతాడు.

  12. ఆలోచనలు చెప్పువారు లేనిచోట తలంపులు వృధాయగును, ఆలోచన చెప్పువారు ఎక్కువ మంది ఉన్న ఎడల తలంపులు బలపడును.

  13. ఉపదేశాన్ని పాటించేలా జాగ్రత్తవహించేవాడు వర్ధిల్లుతాడు, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు.

  14. జ్ఞానంగల హృదయం గలవారు వివేకులు అని పిలువబడతారు, దయగల మాటలు ఒప్పింపజేస్తాయి.

  15. వివేకంగల దాసుడు అవమానం తెచ్చే కుమారుని ఏలుతాడు కుటుంబంలో ఒకనిగా వారసత్వ సంపదను పంచుకుంటాడు.

  16. బుద్ధిలేని మనుష్యుడు చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేస్తాడు పొరుగువానికి హామీగా ఉంటాడు.

  17. వివేచన గలవారి హృదయం తెలివిని సంపాదిస్తుంది, జ్ఞానం గలవారి చెవులు దాన్ని తెరుచుకుంటాయి.

  18. ఒక బహుమతి మార్గం తెరుస్తుంది అది ఇచ్చిన వ్యక్తిని గొప్పవారి ఎదుటకు రప్పిస్తుంది.

  19. ఒక వ్యక్తి తెలివిలేనివాడుగా ఉండడం మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును.

  20. ఒక వ్యక్తి తెలివి వానికి ఓర్పును కలిగిస్తుంది; ఒక నేరాన్ని పట్టించుకోకపోవడం ఒక వ్యక్తికి ఘనత కలిగిస్తుంది.

  21. మనిషి హృదయంలోని ఆలోచన లోతైన నీళ్ల వంటిది, వివేకం గలవాడు దాన్ని పైకి చేదుకుంటాడు.

  22. అపరిచితునికి భద్రత కల్పించే వ్యక్తి యొక్క వస్త్రాన్ని తీసుకోండి; ఒకవేళ అది బయటి వ్యక్తి కోసం చేస్తే దానిని ప్రతిజ్ఞలో ఉంచండి.

  23. ప్రణాళికలు ఆలోచనచేత బలపరచబడతాయి, మంచిచెడులనెరిగిన నాయకుడవై పోరాడాలి.

  24. శ్రద్ధగలవారి ప్రణాళికలు లాభాన్ని కలిగిస్తాయి, తొందరపాటుతనం దారిద్ర్యానికి దారితీస్తుంది.

  25. జ్ఞానుల నివాసంలో కోరదగిన నిధి ఒలీవనూనె ఉంటాయి, కానీ బుద్ధిలేని మనుష్యులు తాము పొందుకున్నదంతా ఖర్చు చేస్తారు.