Prudence గురించి బైబిల్ వచనాలు: General references
General references గురించి వచనాలు
నాలుక ఆహారాన్ని రుచి చూసినట్లు. చెవి మాటలను పరిశీలిస్తుంది.
మనకు న్యాయమైన దానిని వివేచిద్దాం; మనకు మేలైన దానిని తెలుసుకుందాము.
సంగీత దర్శకుడైన యెదూతూనుకు. దావీదు కీర్తన. నేను, “నేను నా నాలుకతో పాపం చేయకుండా ఉండడానికి నా మార్గాలను సరిచూసుకుంటాను; దుష్టులు నా దగ్గర ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుంటాను” అని అన్నాను.
దయతో అప్పు ఇచ్చేవారికి, తమ వ్యాపారాన్ని న్యాయంగా నిర్వహించే వారికి మేలు కలుగుతుంది.
నా కుమారుడా, నీవు నీ పొరుగువాని రుణానికి భద్రత ఇచ్చివుంటే, చేతిలో చేయి వేసి అపరిచితునికి హామీ ఇచ్చివుంటే,
నీవు పలికిన దాని వలన చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టుబడి ఉన్నావు.
“నేను, జ్ఞానం, వివేకంతో కలిసి నివసిస్తాను; నాకు జ్ఞానం, విచక్షణ ఉన్నాయి.
పుకారు ఆత్మవిశ్వాసాన్ని మోసం చేస్తుంది, కాని నమ్మదగినవారు రహస్యాలను దాస్తారు.
ఎవరైతే అపరిచితునికి భద్రత కల్పిస్తారో వారు ఖచ్చితంగా నష్టపోతారు, కాని ప్రతిజ్ఞలో చేతులు దులుపుకునేవాడు క్షేమంగా ఉంటాడు.
తన ఇంటివారిని బాధపెట్టేవారు ఏమీ సంపాదించుకోలేరు, మూర్ఖులు జ్ఞానంగలవారికి దాసులుగా ఉంటారు.
మనుష్యులు తన వివేకాన్ని బట్టి పొగడబడతాడు, అలాగే వికృతమైన మనస్సు కలవారు తిరస్కరించబడతారు.
మూర్ఖులు తమ కోపాన్ని వెంటనే చూపిస్తారు, కాని వివేకంగలవారు తమకు కలిగిన అవమానాన్ని మౌనంగా భరిస్తారు.
వివేకంగల మనుష్యులు తమ తెలివిని దాచిపెడతారు కానీ మూర్ఖులు తమ మూర్ఖత్వాన్ని ప్రచారం చేసుకుంటారు.
వివేకులైనవారందరు తెలివితో వ్యవహరిస్తారు, కాని మూర్ఖులు వారి మూర్ఖత్వాన్ని బహిర్గతం చేస్తారు.
వివేకవంతుల జ్ఞానం వారి మార్గాలను ఆలోచించడం, కానీ మూర్ఖుల మూర్ఖత్వం మోసము.
బుద్ధిహీనులు దేన్నైనా నమ్ముతారు, కానీ వివేకం కలవారు తన నడవడికను బాగుగా కనిపెడతారు.
జ్ఞాని యెహోవాకు భయపడి చెడు నుండి తప్పుకుంటాడు, మూర్ఖులు కోపిష్ఠులై కూడా భద్రంగా ఉన్నట్లు భావిస్తారు.
జ్ఞానం లేనివారికి వారి మూర్ఖత్వమే ఆస్తి. వివేకంగలవారు తెలివిని కిరీటంగా ధరించుకుంటారు.
మూర్ఖుడు తన తండ్రి క్రమశిక్షణను తృణీకరిస్తాడు కాని దిద్దుబాటును స్వీకరించేవాడు వివేకాన్ని కనుపరచుతాడు.
ఆలోచనలు చెప్పువారు లేనిచోట తలంపులు వృధాయగును, ఆలోచన చెప్పువారు ఎక్కువ మంది ఉన్న ఎడల తలంపులు బలపడును.
ఉపదేశాన్ని పాటించేలా జాగ్రత్తవహించేవాడు వర్ధిల్లుతాడు, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు.
జ్ఞానంగల హృదయం గలవారు వివేకులు అని పిలువబడతారు, దయగల మాటలు ఒప్పింపజేస్తాయి.
వివేకంగల దాసుడు అవమానం తెచ్చే కుమారుని ఏలుతాడు కుటుంబంలో ఒకనిగా వారసత్వ సంపదను పంచుకుంటాడు.
బుద్ధిలేని మనుష్యుడు చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేస్తాడు పొరుగువానికి హామీగా ఉంటాడు.
వివేచన గలవారి హృదయం తెలివిని సంపాదిస్తుంది, జ్ఞానం గలవారి చెవులు దాన్ని తెరుచుకుంటాయి.