కంటెంట్‌కు వెళ్లండి

Prophets గురించి బైబిల్ వచనాలు

655 వచనాలు · 128 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “మనుష్యకుమారుడా, ఒక మట్టి ఇటుకను తీసుకుని, నీ ముందు పెట్టుకుని, దాని మీద యెరూషలేము పట్టణ నమూనాను గీయి.

  2. తర్వాత అది ముట్టడి వేయబడినట్లుగా దాని ఎదురుగా ముట్టడి దిబ్బలు, బురుజు కట్టినట్లు, దానికి ఎదురుగా సైనిక శిబిరాలు, గోడలను పడగొట్టే యంత్రాలు ఉన్నట్లు గీయి.

  3. తర్వాత ఒక ఇనుప రేకును తీసుకుని, దాన్ని నీకు, పట్టణానికి మధ్య ఇనుప గోడలా ఉంచి, నీ ముఖాన్ని దాని వైపుకు త్రిప్పి నిలబడు. నీవు పట్టణాన్ని ముట్టడి చేస్తున్నట్లుగా ఉంటావు. ఇది ఇశ్రాయేలు ప్రజలకు ఒక సూచనగా ఉంటుంది.

  4. “అప్పుడు నీవు నీ ఎడమవైపుకు పడుకుని ఇశ్రాయేలు ప్రజల పాపాన్ని నీ మీద వేసుకో. నీవు నీవైపు పడుకుని ఉన్న అన్ని రోజులు వారి పాపాన్ని నీవు భరించాలి.

  5. ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు పాపం చేశారో అన్ని రోజులు నేను నీకు నిర్ణయిస్తాను. దాని ప్రకారం 390 రోజులు నీవు వారి పాపాన్ని భరించాలి.

  6. “నీవు ఇది పూర్తి చేసిన తర్వాత, ఈసారి నీ కుడి వైపుకు తిరిగి పడుకుని యూదా ప్రజల పాపాన్ని భరించు. నేను నీకు 40 రోజులు, ప్రతి సంవత్సరానికి ఒక రోజు నియమించాను.

  7. ముట్టడిలో ఉన్న యెరూషలేము వైపు నీ ముఖాన్ని త్రిప్పి చొక్కా తీసివేసి చేయి ఎత్తి, దానికి వ్యతిరేకంగా ప్రవచించు.

  8. నీ ముట్టడి రోజులు పూర్తయ్యే వరకు నీవు ఒకవైపు నుండి మరోవైపుకు తిరగకుండా నిన్ను త్రాళ్లతో బంధిస్తాను.

  9. “గోధుమలు, యవలు, చిక్కుడు కాయలు, అలచందలు, జొన్నలు తీసుకోండి; వాటిని ఒక పాత్రలో నిల్వ ఉంచి వాటితో రొట్టెలు చేసుకుని నీవు ఒకవైపు పడుకున్న 390 రోజులు వాటిని తినాలి.

  10. ప్రతిరోజు తినడానికి ఇరవై షెకెళ్ళ ఆహారాన్ని తూకం వేసి, నిర్ణీత సమయాల్లో తినాలి.

  11. అలాగే ఒక హిన్ లో ఆరవ వంతు నీరు కొలిచి నిర్ణీత సమయాల్లో త్రాగాలి.

  12. యవలతో రొట్టెలు చేసుకుని ప్రజలంతా చూస్తుండగా మానవ మలంతో వాటిని కాల్చుకుని తినాలి.

  13. నేను వారిని ఏ జాతుల మధ్యకు వెళ్లగొడతానో వారి మధ్య ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా అపవిత్రమైన ఆహారం తింటారు” అని యెహోవా నాకు చెప్పారు.

  14. “మనుష్యకుమారుడా, పదునైన కత్తిని తీసుకుని దానిని మంగలి కత్తిలా ఉపయోగించి నీ తలను, గడ్డాన్నీ క్షౌరం చేసుకో. ఒక త్రాసు తెచ్చి ఆ వెంట్రుకలను తూచి భాగాలుగా చేయి.

  15. నీ ముట్టడి రోజులు పూర్తి కాగానే ఈ వెంట్రుకలలో మూడవ భాగాన్ని పట్టణం లోపల కాల్చివేయాలి. మూడవ భాగాన్ని తీసుకుని ఖడ్గంతో పట్టణం చుట్టూ చెదరగొట్టాలి. మిగిలిన మూడవ భాగాన్ని గాలికి ఎగిరిపోనివ్వాలి. ఎందుకంటే నేను ఖడ్గంతో వారిని వెంటాడతాను.

  16. అయితే కొన్ని వెంట్రుకలు తీసుకుని నీ బట్టల అంచుకు కట్టుకో.

  17. మరికొన్నిటిని తీసుకుని అగ్నిలో వేసి కాల్చు, అందులో నుండి అగ్ని వచ్చి ఇశ్రాయేలంతా వ్యాపిస్తుంది.

  18. “ ‘దేశమంతా రక్తంతో పట్టణమంతా హింసతో నిండిపోయింది కాబట్టి సంకెళ్ళు సిద్ధం చేయండి.

  19. నాశనం వెంబడి నాశనం వస్తుంది, పుకార్ల మీద పుకార్లు పుట్టుకొస్తాయి. వారు ప్రవక్త దగ్గరకి దర్శనం కోసం వెళ్తారు ధర్మశాస్త్ర జ్ఞానం యాజకులకు ఉండదు. పెద్దలు ఆలోచన చేయరు.

  20. ఆరవ సంవత్సరం ఆరవ నెల అయిదవ రోజున నా ఇంట్లో నేను, యూదా పెద్దలు కూర్చుని ఉన్నప్పుడు, ప్రభువైన యెహోవా చేయి నా మీదికి వచ్చింది.

  21. అప్పుడు ఆత్మ నన్ను పైకి లేపి తూర్పు వైపున ఉన్న యెహోవా మందిరపు ద్వారం దగ్గరకు తీసుకువచ్చాడు. ద్వారం దగ్గర ఇరవై అయిదుగురు మనుష్యులు ఉన్నారు, వారిలో ప్రజల నాయకులైన అజ్జూరు కుమారుడైన యాజన్యా, బెనాయా కుమారుడైన పెలట్యా నాకు కనిపించారు.

  22. కాబట్టి వారికి వ్యతిరేకంగా ప్రవచించు; మనుష్యకుమారుడా, ప్రవచించు.”

  23. అప్పుడు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఇలా చెప్పమని నాతో చెప్పారు: “యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలు నాయకులారా, మీరు చెప్పేది అదే కాని మీ మనస్సులో వచ్చే ఆలోచనలు నాకు తెలుసు.

  24. దేవుని ఆత్మ వలన వచ్చిన దర్శనంలో ఆత్మ నన్ను పైకి ఎత్తి బబులోనీయుల దేశంలో బందీలుగా ఉన్న వారి దగ్గరకు తీసుకువచ్చింది. అంతలో నాకు కనబడిన దర్శనం నన్ను విడిచి వెళ్లిపోయింది.

  25. “కాబట్టి మనుష్యకుమారుడా, దేశాంతరం వెళ్లడానికి నీ వస్తువులను సర్దుకుని, పగటివేళ వారు చూస్తుండగానే బయలుదేరి నీవు ఉన్న చోటు నుండి వేరొక ప్రదేశానికి వెళ్లు. వారు తిరుగుబాటుదారులే అయినా బహుశా వారు అర్థం చేసుకోవచ్చు.