- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Murder గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
“ ‘సాక్షుల నోటి మాటను బట్టి హంతకులు మరణశిక్ష పొందుతారు. అయితే ఒక్క సాక్షి సాక్ష్యాన్ని బట్టి ఏ ఒక్కరికీ మరణశిక్ష విధించబడకూడదు.
“ ‘శిక్ష పొందాల్సిన హంతకుల జీవితం కోసం విమోచన క్రయధనం స్వీకరించకూడదు. వారు మరణశిక్ష పొందాలి.
“ ‘ఆశ్రయపురానికి పారిపోయినవారి నుండి విమోచన క్రయధనం స్వీకరించకూడదు, ప్రధాన యాజకుడు చనిపోకముందు వారిని తమ స్వస్థలానికి పంపించవద్దు.
“ ‘మీరున్న భూమిని కలుషితం చేయకండి. రక్తపాతం దేశాన్ని కలుషితం చేస్తుంది రక్తపాతం చేసిన ఆ వ్యక్తి రక్తం ద్వారానే తప్ప ఆ భూమికి ప్రాయశ్చిత్తం చేయలేము.
మీరు హత్య చేయకూడదు.
కాని ఎవరైనా ద్వేషంతో ఎవరి కొరకైనా పొంచి ఉండి, అతని మీద పడి చంపితే అతడా పట్టణాల్లో ఒక దానిలోకి పారిపోయినా ఊరి పెద్దలు అతన్ని బయటకు రప్పించాలి.
హంతకుని పట్టణ పెద్దలు పిలిపించి, ప్రతీకారం చేయడానికి వచ్చిన వానికి అతన్ని అప్పగించాలి.
జాలి చూపవద్దు. నిర్దోషి రక్తాన్ని చిందించిన అపరాధాన్ని మీరు ఇశ్రాయేలు నుండి ప్రక్షాళన చేయాలి, తద్వారా మీరు బాగుంటారు.
ఒకడు చేసిన పాపం విషయంలో గాని అపరాధం విషయంలో గాని దాన్ని నిర్ధారించడానికి కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోకూడదు, ఇద్దరు లేదా ముగ్గురు సాక్ష్యాల మీద నేరం నిర్ధారణ చేయాలి.
మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలోని ఒక పొలంలో ఎవరైనా హత్యకు గురియై పడి ఉండడం కనబడి, ఆ హంతకుడు ఎవరో తెలియనప్పుడు,
మీ పెద్దలు, న్యాయాధిపతులు బయటకు వెళ్లి మృతదేహం నుండి దగ్గరలో ఉన్న పట్టణాలకు దూరం కొలుస్తారు.
తర్వాత మృతుడికి దగ్గరగా ఉన్న పట్టణ పెద్దలు ఎప్పుడూ పని చేయని, కాడి కట్టని ఓ దూడను తెచ్చి,
దానిని ప్రవహించే ప్రవాహం ఉండి, ఎన్నడు దున్నబడని నాటబడని లోయ దగ్గరకు తోలుకుపోవాలి. అక్కడ ఆ లోయలో పట్టణ పెద్దలు దూడ మెడను విరిచివేయాలి.
లేవీయ యాజకులు ముందుకు సాగాలి, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా వారిని పరిచర్య కోసం, యెహోవా పేరిట ఆశీర్వాదాలు పలకడానికి, వివాదాలు దాడులకు సంబంధించిన అన్ని దావాలను నిర్ణయించడానికి వారిని ఎన్నుకున్నారు.
మృతుడి గ్రామానికి చెందిన పట్టణ పెద్దలు లోయలో మెడ విరగదీసిన దూడ మీద చేతులు కడుక్కుని,
వారు ఇలా ప్రకటించాలి: “మా చేతులు రక్తపాతం చేయలేదు, మా కళ్లు అది చేయడం చూడలేదు.
యెహోవా, మీరు విమోచించిన మీ ప్రజలైన ఇశ్రాయేలు కోసం ఈ ప్రాయశ్చిత్తాన్ని అంగీకరించండి, నిర్దోషి యొక్క రక్తాన్ని బట్టి మీ ప్రజలను దోషులుగా పరిగణించవద్దు” అప్పుడు రక్తపాతం ప్రాయశ్చిత్తం చేయబడుతుంది,
యెహోవా దృష్టిలో మీరు సరియైనది చేశారు కాబట్టి, నిర్దోషి రక్తం చిందించిన అపరాధం మీ నుండి తొలగిపోతుంది.
జనులారా, ఆయన ప్రజలతో కూడా సంతోషించండి, ఎందుకంటే ఆయన తన సేవకుల రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటారు; ఆయన తన శత్రువుల మీద పగతీర్చుకుంటారు తన దేశం కోసం తన ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేస్తారు.
అతడు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్లి, తన అన్నదమ్ములైన డెబ్బైమంది యెరుబ్-బయలు కుమారులను ఒకే బండ మీద చంపాడు. అయితే యెరుబ్-బయలు చిన్న కుమారుడైన యోతాము తప్పించుకుని దాక్కున్నాడు.
యెరుబ్-బయలు డెబ్బైమంది కుమారులను చంపి వారికి చేసిన ద్రోహానికి, వారిని చంపిన వారి సోదరుడైన అబీమెలెకు మీదికి, తన సోదరులను చంపడానికి అతనికి సహాయం చేసిన షెకెము పౌరుల మీదికి ప్రతిఫలం వచ్చేలా దేవుడు చేశారు.
వెంటనే అతడు వాన్ని కొట్టి చంపాడు. ఎందుకంటే దావీదు ఆ యువకునితో, “ ‘నేను యెహోవా అభిషేకించినవాన్ని చంపాను’ అని నీ నోరే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది కాబట్టి నీ చావుకు నీవే బాధ్యుడవు” అన్నాడు.
బెయేరోతీయుడైన రిమ్మోను కుమారులైన రేకాబు, బయనా ఇష్-బోషెతు ఇంటికి బయలుదేరారు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో అతడు విశ్రాంతి తీసుకుంటుండగా వారు అక్కడికి వచ్చారు.
వారు గోధుమలు తెస్తున్నట్లు నటించి ఇంటి లోపలికి వెళ్లి పడుకున్న ఇష్-బోషెతు కడుపులో పొడిచారు. రేకాబు అతని సోదరుడు బయనా తప్పించుకుని పారిపోయారు.
అతడు తన మంచంపై పడుకుని నిద్రపోతున్నప్పుడు వారు ఇంటి లోపలికి వెళ్లారు. వారు అతన్ని పొడిచి చంపిన తర్వాత అతని తల నరికి తమతో తీసుకెళ్లి రాత్రంతా అరాబా గుండా ప్రయాణం చేశారు.