Skip to content

Murder గురించి బైబిల్ వచనాలు

131 వచనాలు · 88 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఒకవేళ మీరు శ్రమపడినా, హంతకునిగా దొంగగా దోషిగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకొన్న వారిగా ఆ శ్రమ ఉండకూడదు.

  2. తన సహోదరిని, సహోదరుని ద్వేషించేవారు నరహంతకులు, ఏ నరహంతకునిలో నిత్యజీవం ఉండదని మీకు తెలుసు.

  3. వారు పెద్ద స్వరంతో, “ఓ సర్వశక్తిగల ప్రభువా! పరిశుద్ధుడా, సత్యవంతుడా, మా రక్తానికి ప్రతిగా భూనివాసులను తీర్పు తీర్చడానికి ఇంకా ఎంతకాలం?” అని కేకలు వేశారు.

  4. “పరలోకమా ఆమెను బట్టి ఆనందించండి. దేవుని ప్రజలారా, ఆనందించండి. అపొస్తలులారా, ప్రవక్తలారా ఆనందించండి. ఎందుకంటే, ఆమె మీకు విధించిన తీర్పును బట్టి దేవుడు ఆమెకు తీర్పు తీర్చారు.”

  5. ప్రవక్తల రక్తం దేవుని పరిశుద్ధ ప్రజల రక్తం, భూమి మీద వధించబడిన వారందరి రక్తం ఆమెలో కనిపిస్తుంది.”

  6. అయితే మాంత్రికులు, వ్యభిచారులు, హంతకులు, విగ్రహాలను పూజించే వారు, అబద్ధాలు చెప్తూ వాటిని ప్రేమించే వారందరు ఆ పట్టణానికి బయట ఉండే కుక్కలు.