Skip to content

Levites గురించి బైబిల్ వచనాలు

186 వచనాలు · 17 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కాసిప్యా ప్రాంతంలో నాయకుడైన ఇద్దో దగ్గరకు వెళ్లమని ఆదేశించాను. వారు మా దేవుని మందిర సేవకులను మా దగ్గరకు తీసుకువచ్చేలా ఇద్దో అతని తోటి లేవీయులైన ఆలయ సేవకులకు ఏమి చెప్పాలో వారికి చెప్పాను.

  2. మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందుకు, వారు ఇశ్రాయేలు కుమారుడైన లేవీకి పుట్టిన మహలి వారసుడు, సమర్థుడైన షేరేబ్యాను, అతని కుమారులు, సహోదరులతో కలిపి మొత్తం 18 మందిని తీసుకువచ్చారు;

  3. హషబ్యాను, అతనితో మెరారి వారసుడైన యెషయాను, అతని సోదరులను, వారి కుమారులను మొత్తం 20 మందిని తీసుకువచ్చారు.

  4. వారితో పాటు లేవీయులకు సహాయంగా దావీదు అతని అధికారులు నిర్ణయించిన ఆలయ సేవకులలో నుండి 220 మందిని తీసుకువచ్చారు. వారందరి పేర్లు నమోదు చేయబడి ఉన్నాయి.

  5. ఈ విషయాలన్ని జరిగిన తర్వాత నాయకులు నా దగ్గరకు వచ్చి, “ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, అందరు తమ పొరుగువారైన కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఈజిప్టువారు, అమోరీయుల నుండి వేరుగా ఉండకుండా వారితో కలిసిపోయి, వారు చేసే అసహ్యకరమైన ఆచారాలను పాటించారు.

  6. వారి కుమార్తెలను తమకు, తమ కుమారులకు భార్యలుగా చేసుకుంటూ, పరిశుద్ధజాతిగా ఉండకుండా తమ చుట్టూ ఉన్నవారితో కలిసిపోయారు. నాయకులు అధికారులు ఈ విషయంలో అపనమ్మకంగా ఉన్నారు” అని చెప్పారు.

  7. లేవీయుల నుండి: యోజాబాదు, షిమీ, కెలిథా అనే కెలాయా, పెతహయా, యూదా, ఎలీయెజెరు.

  8. సంగీతకారుల నుండి: ఎల్యాషీబు. ద్వారపాలకుల నుండి: షల్లూము, తెలెము, ఊరి.

  9. లేవీయులు: యెషూవ వారసులు (హోదవ్యా కుటుంబం, కద్మీయేలు కుటుంబం నుండి) 74.

  10. సంగీతకారులు: ఆసాపు వారసులు 148.

  11. ఆలయ ద్వారపాలకులు: షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనేవారి వారసులు 138.

  12. ఆలయ సేవకులు: జీహా, హశూఫా, టబ్బాయోతు వారసులు,

  13. కేరోసు, సీయహా, పాదోను వారసులు,

  14. లెబానా, హగాబా, షల్మయి వారసులు,

  15. హానాను, గిద్దేలు, గహరు వారసులు,

  16. రెవాయా, రెజీను, నెకోదా వారసులు,

  17. గజ్జాము, ఉజ్జా, పాసెయ వారసులు,

  18. బేసాయి, మెహూనీము, నెఫూసీము వారసులు,

  19. బక్బూకు, హకూపా, హర్హూరు వారసులు,

  20. బజ్లూతు, మెహీదా, హర్షా వారసులు,

  21. బర్కోసు, సీసెరా, తెమహు వారసులు,

  22. నెజీయహు, హటీపా వారసులు.

  23. సొలొమోను సేవకుల వారసులు: సొటయి, సోఫెరెతు, పెరీదా వారసులు

  24. యహలా, దర్కోను, గిద్దేలు వారసులు,

  25. షెఫట్యా, హట్టీలు, పొకెరెత్-హజెబయీము, ఆమోను వారసులు.