Skip to content

Levites గురించి బైబిల్ వచనాలు

186 వచనాలు · 17 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆలయ సేవకులు, సొలొమోను సేవకుల వారసులు అందరు కలిసి మొత్తం 392.

  2. తేల్ మెలహు, తేల్ హర్షా, కెరూబు, అద్దోను, ఇమ్మేరు అనే పట్టణాల నుండి కొందరు వచ్చారు, అయితే వీరు తమ కుటుంబాలు ఇశ్రాయేలు నుండి వచ్చినట్లు రుజువు చూపలేకపోయారు:

  3. దెలాయ్యా, టోబీయా, నెకోదా వారసులు మొత్తం 642.

  4. యాజకుల వారసులు: హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి (ఇతడు గిలాదీయుడైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకరిని పెళ్ళి చేసుకుని ఆ పేరుతో పిలువబడ్డాడు) వారసులు.

  5. వీరు తమ వంశావళి వివరాల కోసం వెదికారు కాని అవి వారికి దొరకలేదు. అందుకే వారిని అపవిత్రులుగా ఎంచి యాజకుల నుండి వేరుచేశారు.

  6. కాబట్టి ఊరీము, తుమ్మీము ధరించే యాజకుని నియామకం జరిగే వరకు వారు అతిపరిశుద్ధమైన దేన్ని తినకూడదని అధిపతి వారిని ఆదేశించాడు.

  7. సమూహం మొత్తం సంఖ్య 42,360,

  8. వీరు కాకుండా వీరి దాసదాసీలు 7,337; గాయనీ గాయకులు 245 మంది.

  9. వారి గుర్రాలు 736, కంచరగాడిదలు 245,

  10. ఒంటెలు 435, గాడిదలు 6,720.

  11. కుటుంబ పెద్దలలో కొందరు పనికి సహాయపడ్డారు. అధిపతి ఖజానాకు 1,000 డారిక్కుల బంగారం, 50 పళ్లాలు, 530 యాజక వస్త్రాలు ఇచ్చాడు.

  12. కుటుంబ పెద్దలలో కొంతమంది పని కోసం ఖజానాకు 20,000 డారిక్కుల బంగారం, 2,200 మీనాల వెండి ఇచ్చారు.

  13. మిగిలినవారంతా కలిసి 20,000 డారిక్కుల బంగారం 2,000 మీనాల వెండి, 67 యాజక వస్త్రాలు ఇచ్చారు.

  14. యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, సంగీతకారులు, ఆలయ సేవకులు, కొంతమంది ప్రజలతో పాటు మిగిలిన ఇశ్రాయేలీయులు తమ సొంత పట్టణాల్లో స్థిరపడ్డారు. ఇశ్రాయేలీయులంతా ఏడవ నెల రాగానే తమ తమ పట్టణాల్లో స్థిరపడ్డారు,

  15. లేవీయులు: అజన్యా కుమారుడైన యెషూవ, హేనాదాదు కుమారులు బిన్నూయి, కద్మీయేలు,

  16. వారి బంధువులు షెబన్యా, హోదీయా, కెలిథా, పెలాయా, హానాను,

  17. మీకా, రెహోబు, హషబ్యా,

  18. జక్కూరు, షేరేబ్యా, షెబన్యా,

  19. హోదీయా, బానీ, బెనీను.

  20. ప్రజల నాయకుల నుండి: పరోషు, పహత్-మోయాబు, ఏలాము, జత్తూ, బానీ,

  21. బున్నీ, అజ్గాదు, బేబై,

  22. అదోనియా, బిగ్వయి, ఆదీను,

  23. అటేరు, హిజ్కియా, అజ్జూరు,

  24. హోదీయా, హాషుము, బేజయి,

  25. హారీపు, అనాతోతు, నేబై,