Skip to content

Levites గురించి బైబిల్ వచనాలు

186 వచనాలు · 17 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. లేవీయులు: యెషూవ కద్మీయేలు వారసులు (హోదవ్యా కుటుంబం నుండి) 74.

  2. సంగీతకారులు: ఆసాపు వారసులు 128.

  3. ఆలయ ద్వారపాలకులు: షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనేవారి వారసులు 139.

  4. ఆలయ సేవకులు: జీహా, హశూఫా, టబ్బాయోతు వారసులు,

  5. కేరోసు, సీయహా, పాదోను వారసులు,

  6. లెబానా, హగాబా, అక్కూబు వారసులు,

  7. హాగాబు, షల్మయి, హానాను వారసులు,

  8. గిద్దేలు, గహరు, రెవాయా వారసులు,

  9. రెజీను, నెకోదా, గజ్జాము వారసులు,

  10. ఉజ్జా, పాసెయ, బేసాయి వారసులు,

  11. అస్నా, మెహూనీము, నెఫూసీము వారసులు,

  12. బక్బూకు, హకూపా, హర్హూరు వారసులు,

  13. బజ్లూతు, మెహీదా, హర్షా వారసులు,

  14. బర్కోసు, సీసెరా, తెమహు వారసులు,

  15. నెజీయహు, హటీపా వారసులు.

  16. సొలొమోను సేవకుల వారసులు: సొటయి, హస్సోఫెరెతు, పెరూదా వారసులు,

  17. యహలా, దర్కోను, గిద్దేలు వారసులు,

  18. షెఫట్యా, హట్టీలు, పొకెరెత్-హజెబయీము, అమీ వారసులు.

  19. ఆలయ సేవకులు, సొలొమోను సేవకుల వారసులు అందరు కలిసి మొత్తం 392.

  20. తేల్ మెలహు, తేల్ హర్షా, కెరూబు, అద్దోను, ఇమ్మేరు అనే పట్టణాల నుండి కొందరు వచ్చారు. అయితే వీరు తమ కుటుంబాలు ఇశ్రాయేలు నుండి వచ్చినట్లు రుజువు చూపలేకపోయారు:

  21. దెలాయ్యా, టోబీయా, నెకోదా వారసులు, మొత్తం 652.

  22. యాజకుల వారసులు: హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి వారసులు (ఇతడు గిలాదీయుడైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకరిని పెళ్ళి చేసుకుని ఆ పేరుతో పిలువబడ్డాడు).

  23. వీరు వంశావళి వివరాల కోసం వెదికారు కాని అవి వారికి దొరకలేదు. అందుకే వారిని అపవిత్రులుగా ఎంచి యాజకుల నుండి వేరుచేశారు.

  24. ఊరీము, తుమ్మీము ధరించే యాజకుని నియామకం జరిగే వరకు వారు అతిపరిశుద్ధమైన దేన్ని తినకూడదని అధిపతి వారిని ఆదేశించాడు.

  25. కాబట్టి నేను నాయకులైన ఎలీయెజెరు, అరీయేలు, షెమయా, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జెకర్యా, మెషుల్లాము అనే వారిని, అలాగే వివేచన కలిగిన యోయారీబు ఎల్నాతానులను పిలిపించి,