- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Kings గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
అందువల్ల యెహోవా అష్షూరు రాజు సైన్యాధిపతులను వారి మీదికి రప్పించారు. వారు మనష్షేను బందీగా పట్టుకుని, అతని ముక్కుకు గాలం తగిలించి, ఇత్తడి గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకెళ్లారు.
బాధలో అతడు తన పూర్వికుల దేవుని ఎదుట తనను తాను చాలా తగ్గించుకుని తన దేవుడైన యెహోవాను దయచూపమని ప్రాధేయపడ్డాడు.
అతడు ప్రార్థించినప్పుడు యెహోవా అతని విన్నపం ఆలకించి అతని ప్రార్థన అంగీకరించారు. అతడు యెరూషలేముకు అతని రాజ్యానికి తిరిగి వచ్చేలా చేశాడు. అప్పుడు యెహోవాయే దేవుడు అని మనష్షే తెలుసుకున్నాడు.
ఇది జరిగిన తర్వాత మనష్షే లోయలోని గిహోను ఊటకు పడమరగా ఉన్న దావీదు నగర ప్రాకారాన్ని చేప ద్వారం వరకు, ఓఫెలు కొండ చుట్టూ కట్టించాడు. దానిని చాలా ఎత్తు చేయించాడు. యూదాలో కోటగోడలు గల ప్రతి పట్టణంలో అతడు సేనాధిపతులను నియమించాడు.
అతడు యెహోవా మందిరంలో నుండి ఇతర దేవుళ్ళ విగ్రహాలను తొలగించాడు. యెరూషలేములో, యెహోవా మందిర కొండమీద తాను కట్టించిన బలిపీఠాలు తీసివేసి పట్టణం బయట వాటిని పారవేయించాడు.
అప్పుడతడు యెహోవా బలిపీఠాలన్ని మరమ్మత్తు చేయించి, వాటి మీద సమాధానబలులు కృతజ్ఞతార్పణలు అర్పించాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించమని యూదా వారికి ఆజ్ఞాపించాడు.
అయినా ప్రజలు ఇంకా క్షేత్రాల్లో బలులు అర్పిస్తూనే ఉన్నారు అయితే అవి వారి దేవుడైన యెహోవాకే అర్పించారు.
మనష్షే పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు తన దేవునికి చేసిన ప్రార్థన, ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా పేరున అతనితో మాట్లాడిన దీర్ఘదర్శి మాటలు, అవన్నీ ఇశ్రాయేలు రాజు గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.
అతడు చేసిన ప్రార్థన, దేవుడు అతని విన్నపం ఎలా ఆలకించింది, తనను తగ్గించుకోక ముందు అతడు చేసిన పాపాలు, అతడు చేసిన నమ్మకద్రోహం, కట్టించిన క్షేత్రాలను, అషేరా స్తంభాలను, చెక్కిన విగ్రహాలను గురించి దీర్ఘదర్శులు వ్రాసిన గ్రంథాల్లో ఉన్నాయి.
మనష్షే నిద్రపోయి (చనిపోయి) తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతని పట్టణంలోనే అతన్ని సమాధి చేశారు. అతని స్థానంలో అతని కుమారుడు ఆమోను రాజయ్యాడు.
ఆమోను రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు. అతడు యెరూషలేములో రెండేళ్ళు పరిపాలించాడు.
అతడు తన తండ్రి మనష్షేలా యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. తన తండ్రి మనష్షే చేయించిన విగ్రహాలన్నిటికి ఆమోను బలులు అర్పిస్తూ పూజిస్తూ ఉండేవాడు.
తన తండ్రి మనష్షేలా ఆమోను యెహోవా ఎదుట తనను తగ్గించుకోలేదు. పైగా అతడు తన దోషాన్ని పెంచుకున్నాడు.
ఆమోను సేవకులు అతని మీద కుట్రపన్ని, తన సొంత భవనంలోనే అతన్ని చంపారు.
అప్పుడు యూదా దేశ ప్రజలు ఆమోను రాజు మీద కుట్రపన్నిన వారినందరిని చంపేశారు, అతని స్థానంలో అతని కుమారుడైన యోషీయాను రాజుగా చేశారు.
అప్పుడు దేశ ప్రజలు యోషీయా కుమారుడైన యెహోయాహాజును అతని తండ్రి స్థానంలో యెరూషలేములో రాజుగా చేశారు.
యెహోయాహాజు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు, అతడు యెరూషలేములో మూడు నెలలు పరిపాలించాడు.
తర్వాత ఈజిప్టు రాజు యెరూషలేములో అతన్ని పదవి నుండి తొలగించి, యూదాపై వంద తలాంతుల వెండిని, ఒక తలాంతు బంగారాన్ని పన్నుగా విధించాడు.
ఈజిప్టు రాజు యెహోయాహాజు సోదరుడైన ఎల్యాకీమును యూదా యెరూషలేము మీద రాజుగా చేసి, అతని పేరును యెహోయాకీముగా మార్చాడు. అయితే నెకో ఎల్యాకీము సోదరుడైన యెహోయాహాజును ఈజిప్టుకు తీసుకెళ్లాడు.
యెహోయాకీము రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.
బబులోను రాజైన నెబుకద్నెజరు అతని మీద దాడి చేసి అతన్ని ఇత్తడి సంకెళ్ళతో బంధించి బబులోనుకు తీసుకెళ్లాడు.
అంతేకాక యెహోవా మందిరంలో ఉన్న వస్తువులను నెబుకద్నెజరు బబులోనుకు తీసుకెళ్లి అక్కడున్న తన దేవుని క్షేత్రంలో పెట్టాడు.
యెహోయాకీము పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసిన అసహ్యకరమైనవి, అతనికి వ్యతిరేకంగా కనిపించినవన్నీ ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. అతని తర్వాత అతని కుమారుడైన యెహోయాకీను రాజయ్యాడు.
సిద్కియా రాజైనప్పుడు అతనికి ఇరవై ఒక్క సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు.
అతడు తన దేవుడైన యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. యెహోవా వాక్కు పలికిన యిర్మీయా ప్రవక్త ముందు అతడు తగ్గించుకోలేదు.