కంటెంట్‌కు వెళ్లండి

Gospel గురించి బైబిల్ వచనాలు

110 వచనాలు · 2 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యూదేతరులంతా విశ్వాసానికి విధేయులు కావాలని, అనాది కాలం నుండి రహస్యంగా దాచబడి, ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం, నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం వ్రాయబడిన ప్రవచనాత్మక లేఖనాల ద్వారా ఇప్పుడు వారికి తెలియపరచబడింది. ఆ మర్మానికి అనుగుణంగా నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు గురించిన సువార్త ప్రకారం మిమ్మల్ని స్థిరపరచగల సమర్థుడును ఏకైక జ్ఞానవంతుడునైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా శాశ్వత మహిమ కలుగును గాక! ఆమేన్.

  2. But now is made manifest, and by the scriptures of the prophets, according to the commandment of the everlasting God, made known to all nations for the obedience of faith:

  3. అయితే యూదులలో గ్రీసు దేశస్థులలో దేవునిచే పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిగా, దేవుని జ్ఞానంగా ఉన్నారు.

  4. ఎందుకంటే, దేవుని వెర్రితనం మనుష్యుల జ్ఞానం కంటే జ్ఞానవంతమైనది, దేవుని బలహీనత మనుష్యుల బలం కంటే బలమైనది.

  5. మీ విశ్వాసం మనుష్యల జ్ఞానం మీద కాకుండా దేవుని శక్తి మీదే ఆధారపడాలని, నా మాటలు నా బోధలు జ్ఞానంతో వాక్చాతుర్యంతో కాకుండా పరిశుద్ధాత్మ శక్తితో నిండి ఉన్నాయి.

  6. That your faith should not stand in the wisdom of men, but in the power of God.

  7. అయితే పరిపూర్ణులైనవారి మధ్యలో మేము జ్ఞానాన్ని బోధిస్తున్నాము. అది ఈ యుగసంబంధమైన జ్ఞానం కాదు, వ్యర్థమైపోయే ఈ లోక అధికారుల జ్ఞానం కాదు.

  8. అయితే, మేము దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాము. అది ఈ లోకం ఉనికిలోనికి రాకముందే, దేవుడు రహస్యంగా మన ఘనత కోసం దాచియుంచిన మర్మం.

  9. సువార్త ప్రకటించడం నాకు తప్పనిసరి బాధ్యత కాబట్టి నేను సువార్త ప్రకటిస్తున్నానని గొప్ప చెప్పుకోలేను. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ!

  10. నేను ఇష్టపూర్వకంగా ప్రకటిస్తే నాకు బహుమానం దొరుకుతుంది. నాకు నేనుగా కాకపోయినా నామీద నమ్మకంతో నాకు అప్పగించబడిన పనిని మాత్రమే నేను చేస్తున్నాను.

  11. అప్పుడు నా బహుమానం ఏంటి? సువార్తను ప్రకటించేవానిగా నాకున్న అధికారాన్ని పూర్తిగా ఉపయోగించుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడమే నా బహుమానము.

  12. సహోదరీ సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీరు అంగీకరించి దానిలో నిలిచి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.

  13. నేను మీకు బోధించిన విధంగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకుని ఉంటే ఈ సువార్తను బట్టి మీరు రక్షించబడతారు. లేకపోతే మీరు నమ్మడం వ్యర్థమే.

  14. వ్రాతపూర్వకమైన నియమాలను కాక, ఆత్మతో కూడిన క్రొత్త నిబంధనను సేవించగల సామర్ధ్యాన్ని ఆయనే మాకు ఇచ్చారు. అక్షరం చంపుతుంది కాని ఆత్మ జీవం ఇస్తాడు.

  15. మరణాన్ని తెచ్చే పరిచర్య రాళ్లమీద అక్షరాలలో చెక్కబడినా, అది మహిమతో వచ్చింది. మోషే ముఖంపై ప్రకాశించిన మహిమ శాశ్వతమైనది కాకపోయినా ఇశ్రాయేలీయులు దాన్ని నేరుగా చూడలేకపోయారు.

  16. అయితే ఆత్మ సంబంధమైన పరిచర్య మరి ఎంత మహిమకరంగా ఉంటుంది?

  17. శిక్షను తెచ్చే పరిచర్య మహిమ కలిగి ఉంటే, నీతిమంతులుగా చేసే పరిచర్య ఇంకా ఎంత అధిక మహిమ కలిగి ఉంటుందో!

  18. అందుకే, ఇప్పటి అత్యున్నతమైన మహిమతో పోల్చినప్పుడు ఇప్పటివరకు మహిమకరంగా ఉన్నవేవి మహిమగా ఉండవు.

  19. ఎందుకంటే, గతించిపోయే దానిలోనే మహిమ ఉంటే, ఎల్లప్పుడు నిలిచి ఉండే దానిలో ఇంకెంత మహిమ ఉంటుందో కదా!

  20. ఒకవేళ మేము బోధించే సువార్త ఎవరికైనా మురుగు చేయబడి ఉంటే అది నశించేవారికి మాత్రమే.

  21. దేవుని స్వరూపియైన క్రీస్తు మహిమను తెలియజేసే సువార్త వెలుగును వారు చూడకుండ ఈ యుగసంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనస్సుకు గ్రుడ్డితనం కలుగజేసింది.

  22. మా పోరాటంలో మేము ఉపయోగించే ఆయుధాలు ఈ లోకసంబంధమైన ఆయుధాలు కావు. కోటలను కూడ ధ్వంసం చేయగల దైవశక్తిగల ఆయుధాలు.

  23. వితండ వాదాలను, దేవుని జ్ఞానానికి అడ్డునిలిచే ప్రతి ఆటంకాన్ని మేము ధ్వంసం చేస్తాము. ప్రతి ఆలోచనను వశపరచుకొని క్రీస్తుకు లోబడేలా చేస్తాము.

  24. మీరు కూడా సత్య వాక్యాన్ని అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తులో విశ్వాసం ఉంచినప్పుడు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మచేత ముద్రించబడి ఉన్నారు.

  25. దేవుని మహిమను స్తుతించడానికి ఆయన స్వాస్థ్యమైన వారికి విడుదల కలిగే వరకు ఈ ఆత్మ మన వారసత్వానికి హామీగా ఉన్నాడు.