కంటెంట్‌కు వెళ్లండి

Gospel గురించి బైబిల్ వచనాలు

110 వచనాలు · 2 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న మంచి విషయాల యొక్క ప్రధాన యాజకునిగా క్రీస్తు వచ్చినప్పుడు, మానవుల చేతితో చేయబడని గొప్పదైన పరిపూర్ణమైన గుడారం గుండా ఆయన వెళ్లాడు, అంటే అది ఈ సృష్టిలో ఒక భాగం కాదు.

  2. ఆయన మేకల దూడల రక్తాన్ని తీసుకుని ప్రవేశించలేదు; కాని శాశ్వత విమోచన సంపాదించడానికి స్వరక్తంతో అతి పరిశుద్ధ స్థలంలోకి ఆయన ఒక్కసారే ప్రవేశించాడు.

  3. ఆచారపరంగా అపవిత్రులైనవారు బాహ్యంగా పవిత్రులయ్యేలా మేకల ఎడ్ల రక్తంను దహించబడిన దూడ బూడిదను వారిపై చల్లి వారిని పవిత్రులుగా చేస్తాడు.

  4. నిత్యమైన ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొన్న క్రీస్తు రక్తం, మనం జీవంగల దేవుని సేవించేలా, మరణానికి నడిపించే వ్యర్థమైన క్రియల నుండి మన మనస్సాక్షిని ఇంకెంత ఎక్కువగా పవిత్రపరుస్తుంది!

  5. ఈ కారణంవల్లనే, పిలువబడిన వారు వాగ్దానం చేయబడిన శాశ్వత వారసత్వాన్ని పొందడానికి క్రొత్త నిబంధనకు క్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. మొదటి నిబంధన ప్రకారం చేసిన పాపాల నుండి వారిని విడిపించడానికి ఆయన మరణించి క్రయధనం చెల్లించాడు.

  6. అయితే మీరు సీయోను పర్వతానికి, సజీవ దేవుని పట్టణమైన పరలోకపు యెరూషలేముకు వచ్చారు. మీరు సంతోషకరమైన సభలో వేలాదిమంది దేవదూతల దగ్గరకు వచ్చారు.

  7. పరలోకంలో పేర్లు వ్రాయబడి ఉన్న దేవుని జ్యేష్ఠ సంతానమనే సంఘానికి మీరు వచ్చారు. మనుష్యులందరికి న్యాయాధిపతియైన దేవుని దగ్గరకు, నిర్దోషులుగా తీర్చబడిన నీతిమంతుల్లా పరిపూర్ణత పొందిన ఆత్మల దగ్గరకు మీరు వచ్చారు.

  8. క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసు దగ్గరకు, హేబెలు రక్తంకంటే ఉత్తమంగా మాట్లాడే చిందించబడిన రక్తం దగ్గరకు మీరు వచ్చారు.

  9. ఆ తర్వాత నేను ఇంకొక దేవదూత ఆకాశం మధ్య ఎగిరివెళ్తూ భూమి మీద జీవిస్తున్న ప్రతి దేశానికి, ప్రతి జాతి వారికి, ప్రతి భాష మాట్లాడేవారికి, ప్రతి జనులకు శాశ్వతమైన సువార్తను ప్రకటించడాన్ని చూశాను.

  10. అతడు పెద్ద స్వరంతో, “దేవునికి భయపడి ఆయనకు మహిమ చెల్లించండి! ఎందుకంటే ఆయన తీర్పు తీర్చే గడియ వచ్చింది! ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని నీటి ఊటలను సృష్టించిన దేవుని ఆరాధించండి!” అని చెప్పాడు.