కంటెంట్‌కు వెళ్లండి

Gospel గురించి బైబిల్ వచనాలు: Called The New Covenant

23 వచనాలు · 2 కోణాలు

"Gospel" కోసం వెతకండి

Called The New Covenant గురించి వచనాలు

  1. యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “నేను ఇశ్రాయేలు ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ క్రొత్త నిబంధన చేసే రోజులు వస్తున్నాయి.

  2. ఆ నిబంధన, ఈజిప్టు నుండి నేను వారి పూర్వికుల చేయి పట్టుకుని బయటకు నడిపించినపుడు నేను వారితో చేసిన నిబంధనలా ఉండదు, ఎందుకంటే నేను వారికి ఒక భర్తగా ఉన్నా, వారితో చేసిన నా నిబంధనను వారు ఉల్లంఘించారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  3. “ఆ కాలం తర్వాత, ఇశ్రాయేలు ప్రజలతో నేను చేసే నిబంధన ఇదే” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నేను నా ధర్మశాస్త్రాన్ని వారి మనస్సుల్లో ఉంచి, దాన్ని వారి హృదయాల మీద వ్రాస్తాను. నేను వారి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు.

  4. ఇకపై వారిలో ఎవ్వరూ తమ పొరుగువారికి బోధించరు, ‘యెహోవాను తెలుసుకోండి’ అని ఒకరికొకరు చెప్పుకోరు, ఎందుకంటే వారిలో, సామాన్యులు మొదలుకొని గొప్పవారి వరకు అందరు నన్ను తెలుసుకుంటారు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “ఎందుకంటే నేను వారి దుష్టత్వాన్ని క్షమించి వారి పాపాలను ఇక ఎన్నడు జ్ఞాపకం చేసుకోను.”

  5. అయితే నిజానికి నూతన నిబంధన మరింత గొప్ప వాగ్దానాలపై స్థాపించబడింది కాబట్టి, యేసు మధ్యవర్తిగా ఉన్న ఈ నిబంధన గత నిబంధన కన్న శ్రేష్ఠమైనదైనట్లే ఆయనకు అప్పగించబడిన పరిచర్య కూడా శ్రేష్ఠమైనదే.

  6. అయితే మొదటి నిబంధన లోపం లేనిదైతే, రెండవ దాని కోసం వెదకాల్సిన అవసరమే లేదు.

  7. అయితే దేవుడు ప్రజల్లో దోషాన్ని కనుగొని ఇలా చెప్పారు: “ప్రభువు ఇలా ప్రకటిస్తున్నారు, ఆ రోజులు వస్తున్నాయి, అప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ క్రొత్త నిబంధన చేస్తాను.

  8. ఆ నిబంధన, ఈజిప్టు దేశం నుండి నేను వారి పూర్వికుల చేయి పట్టుకొని బయటకు నడిపించినపుడు నేను వారితో చేసిన నిబంధనలా ఉండదు, ఎందుకంటే వారు నా నిబంధనకు నమ్మకంగా నిలబడలేదు, అందుకే నేను వారి నుండి దూరమయ్యాను, అని ప్రభువు చెప్తున్నారు.

  9. ఆ కాలం తర్వాత, ఇశ్రాయేలు ప్రజలతో నేను స్థాపించే నిబంధన ఇదే అని ప్రభువు ప్రకటిస్తున్నారు. వారి మనస్సులో నా న్యాయవిధులను ఉంచుతాను వారి హృదయాల మీద వాటిని వ్రాస్తాను. నేను వారి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు.

  10. ఇకపై వారిలో ఎవ్వరూ తమ పొరుగువారికి బోధించరు, ‘ప్రభువును తెలుసుకోండి’ అని ఒకరికొకరు చెప్పుకోరు, ఎందుకంటే వారిలో సామాన్యులు మొదలుకొని గొప్పవారి వరకు అందరు నన్ను తెలుసుకుంటారు.

  11. ఎందుకంటే నేను దయతో వారి దుష్టత్వాన్ని క్షమించి వారి పాపాలను ఇక ఎన్నడు జ్ఞాపకం చేసుకోను.”

  12. ఆయన ఈ నిబంధనను, “క్రొత్త” అని పిలువడం చేత మొదటి దాన్ని వాడుకలో లేకుండ చేశారు; వాడుకలో లేనివి పాతవి త్వరలో అదృశ్యమవుతాయి.

  13. అంటే మొదటి గుడారం నిలిచి ఉన్నంత కాలం అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లే మార్గం ఇంకా తెరవబడలేదని పరిశుద్ధాత్మ దీని ద్వారా చూపిస్తున్నాడు.

  14. ఇది ప్రస్తుత కాలాన్ని సూచించే ఒక ఉపమానం, దేవునికి అర్పించబడే కానుకలు, బలులు ఆరాధించేవారి మనస్సాక్షిని శుధ్ధిచేయలేవని తెలియజేస్తుంది.

  15. అవి కేవలం తినడం త్రాగడం, వివిధ శుద్ధీకరణ ఆచారాలకు సంబంధించిన బాహ్య నియమాలు క్రొత్త క్రమం వచ్చేవరకు వర్తిస్తాయి.

  16. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న మంచి విషయాల యొక్క ప్రధాన యాజకునిగా క్రీస్తు వచ్చినప్పుడు, మానవుల చేతితో చేయబడని గొప్పదైన పరిపూర్ణమైన గుడారం గుండా ఆయన వెళ్లాడు, అంటే అది ఈ సృష్టిలో ఒక భాగం కాదు.

  17. ఆయన మేకల దూడల రక్తాన్ని తీసుకుని ప్రవేశించలేదు; కాని శాశ్వత విమోచన సంపాదించడానికి స్వరక్తంతో అతి పరిశుద్ధ స్థలంలోకి ఆయన ఒక్కసారే ప్రవేశించాడు.

  18. ఆచారపరంగా అపవిత్రులైనవారు బాహ్యంగా పవిత్రులయ్యేలా మేకల ఎడ్ల రక్తంను దహించబడిన దూడ బూడిదను వారిపై చల్లి వారిని పవిత్రులుగా చేస్తాడు.

  19. నిత్యమైన ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొన్న క్రీస్తు రక్తం, మనం జీవంగల దేవుని సేవించేలా, మరణానికి నడిపించే వ్యర్థమైన క్రియల నుండి మన మనస్సాక్షిని ఇంకెంత ఎక్కువగా పవిత్రపరుస్తుంది!

  20. ఈ కారణంవల్లనే, పిలువబడిన వారు వాగ్దానం చేయబడిన శాశ్వత వారసత్వాన్ని పొందడానికి క్రొత్త నిబంధనకు క్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. మొదటి నిబంధన ప్రకారం చేసిన పాపాల నుండి వారిని విడిపించడానికి ఆయన మరణించి క్రయధనం చెల్లించాడు.

  21. అయితే మీరు సీయోను పర్వతానికి, సజీవ దేవుని పట్టణమైన పరలోకపు యెరూషలేముకు వచ్చారు. మీరు సంతోషకరమైన సభలో వేలాదిమంది దేవదూతల దగ్గరకు వచ్చారు.

  22. పరలోకంలో పేర్లు వ్రాయబడి ఉన్న దేవుని జ్యేష్ఠ సంతానమనే సంఘానికి మీరు వచ్చారు. మనుష్యులందరికి న్యాయాధిపతియైన దేవుని దగ్గరకు, నిర్దోషులుగా తీర్చబడిన నీతిమంతుల్లా పరిపూర్ణత పొందిన ఆత్మల దగ్గరకు మీరు వచ్చారు.

  23. క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసు దగ్గరకు, హేబెలు రక్తంకంటే ఉత్తమంగా మాట్లాడే చిందించబడిన రక్తం దగ్గరకు మీరు వచ్చారు.