కంటెంట్‌కు వెళ్లండి

Faith గురించి బైబిల్ వచనాలు

543 వచనాలు · 124 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఎందుకంటే, మీ ప్రార్థన వలన, యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా అనుగ్రహించబడుట వలన, నాకు ఏమి జరిగినా అది నాకు రక్షణగానే మారుతుందని నాకు తెలుసు.

  2. నేను ఏ విషయంలోను సిగ్గుపడకుండా ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా పూర్ణధైర్యంతో బోధించడం వలన నేను జీవించినా లేదా మరణించినా సరే, నా శరీరంలో ఎప్పుడూ క్రీస్తు ఘనపరచబడాలని నేను ఆసక్తితో ఆశించి నిరీక్షిస్తున్నాను.

  3. నాకైతే జీవించడం క్రీస్తు కొరకే, మరణమైతే లాభము.

  4. అయితే దైవజనుడవైన నీవు, వీటి నుండి పారిపోయి నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనం, మంచితనం అనే వాటిని వెంబడించు.

  5. విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడు. అనేకమంది సాక్షిసమూహం ఎదుట నీవు చేసిన మంచి ఒప్పుకోలును బట్టి నీవు పిలువబడిన నిత్యజీవాన్ని చేపట్టు.

  6. ఈ మాట నమ్మదగింది: మనం ఆయనతో పాటు చనిపోతే, ఆయనతో పాటు మనం కూడా జీవిస్తాము;

  7. మనం భరిస్తే, ఆయనతో పాటు మనం కూడా ఏలుతాము. మనం ఆయనను తిరస్కరిస్తే, ఆయన కూడా మనల్ని తిరస్కరిస్తారు;

  8. మనం నమ్మకంగా లేకపోయినా, ఆయన నమ్మకంగానే ఉంటారు, ఎందుకంటే ఆయన తనను తాను తిరస్కరించుకోలేరు.

  9. నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు పందాన్ని ముగించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను.

  10. కాబట్టి నీతిమంతుడు న్యాయాధిపతియైన ప్రభువు ఆ రోజున నాకు బహుమతిగా ఇవ్వబోయే నీతి కిరీటం నా కోసం దాచబడి ఉంది. ఈ బహుమానం నాకు మాత్రమే కాదు ఆయన ప్రత్యక్షత కోసం ప్రేమతో ఎదురు చూస్తున్న వారందరికి అనుగ్రహిస్తారు.

  11. అందువల్ల, ఆయన విశ్రాంతిలోకి ప్రవేశిస్తామన్న వాగ్దానం ఇప్పటికీ ఉంది కాబట్టి, మీలో ఎవరూ దాన్ని పొందలేని పరిస్థితిలో లేకుండా జాగ్రత్తపడదాము.

  12. ఎందుకంటే సువార్త వారికి ప్రకటించబడిన విధంగానే మనకు ప్రకటించబడింది; అయితే సువార్తకు విధేయత చూపించినవారితో వారు విశ్వాసంతో కలిసి ఉండలేదు కాబట్టి విన్న సువార్త వారికి ప్రయోజనంగా లేదు.

  13. అయితే విశ్వసించిన మనం ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తాము. అయితే దేవుడు ఇలా అన్నారు, “ ‘కాబట్టి వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు’ అని నేను కోపంలో ప్రమాణం చేశాను.” ఆయన తన కార్యాలన్ని లోకాన్ని సృష్టించినప్పుడే పూర్తి చేశారు.

  14. దేవుడు ఏడవ దినాన్ని గురించి ఇంకొక చోట ఇలా అన్నారు: “దేవుడు ఏడవ రోజున తన పనులన్నిటిని నుండి విశ్రాంతి తీసుకున్నారు.”

  15. పై వచనంలో ఆయన, “వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు” అని అన్నారు.

  16. అయితే కొందరు ఆ విశ్రాంతిని గురించిన సువార్తను విన్నా కూడ తాము విన్నవాటిని వారు నమ్మలేదు కాబట్టి ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయారు.

  17. మరల దేవుడు ఒక దినాన్ని సిద్ధపరచి దాన్ని “నేడు” అని పిలిచారు. వాక్యంలో వ్రాయబడిన ప్రకారం చాలా కాలం తర్వాత ఆయన దావీదు ద్వారా కూడా ఇదే మాటను మాట్లాడారు: “నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే, మీ హృదయాలను కఠినం చేసుకోకండి.”

  18. ఒకవేళ యెహోషువ వారికి విశ్రాంతి ఇచ్చి ఉంటే, దేవుడు మరొక దినాన్ని గురించి మాట్లాడి ఉండేవాడు కాడు.

  19. కాబట్టి దేవుని ప్రజలకు ఏడవ రోజు సబ్బాతు దినం;

  20. ఎవరైనా దేవుని విశ్రాంతిలోకి ప్రవేశిస్తే, దేవుడు తన పనుల నుండి విశ్రాంతి పొందినట్లే, వారు కూడా తమ పనుల నుండి విశ్రాంతి పొందుతారు.

  21. కాబట్టి, వారి అవిధేయత మాదిరిని అనుసరించి ఎవరూ నశించిపోకుండా ప్రతి ప్రయత్నాన్ని చేసి దేవుని విశ్రాంతిలో ప్రవేశిద్దాము.

  22. ఇంకా, “నా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. అయితే వెనుతిరిగే వానిని బట్టి నా హృదయం ఏమాత్రం ఆనందించదు.”

  23. అయితే మనం వెనుతిరిగి నశించేవారితో లేము, కానీ విశ్వాసం కలిగి, తమ ఆత్మలను కాపాడుకునేవారితో ఉన్నాము.

  24. విశ్వాసమనేది మనం ఎదురు చూసే వాటిని గురించిన నమ్మకం, మన కళ్లముందు లేనివాటిని గురించిన నిశ్చయత.

  25. దీనిని బట్టి పూర్వికులు మెప్పుపొందారు.