కంటెంట్‌కు వెళ్లండి

Faith గురించి బైబిల్ వచనాలు

543 వచనాలు · 124 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఎత్తైనా లోతైనా, సృష్టిలో ఉన్న ఏదైనా మన ప్రభువైన క్రీస్తు యేసులో ఉన్న దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవని నేను ఒప్పుకుంటున్నాను.

  2. కాని నీతి మార్గంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన ఇశ్రాయేలు ప్రజలు తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు.

  3. వారెందుకు చేరుకోలేకపోయారు? వారు నీతిని విశ్వాసంతో కాకుండా క్రియలతో అనుసరించారు. ఆటంకంగా అడ్డురాయి ఎదురైనప్పుడు వారు తడబడ్డారు.

  4. దీని కోసం ఇలా వ్రాయబడి ఉంది: “ఇదిగో, నేను సీయోనులో ప్రజలు తడబడేలా చేసే అడ్డురాయిని, వారు పడిపోయేలా చేసే అడ్డుబండను వేశాను, ఆయనలో నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపరచబడరు.”

  5. అయితే విశ్వాసం ద్వారా వచ్చే నీతి ఇలా చెప్తుంది: “క్రీస్తును క్రిందకు తేవడానికే ‘పరలోకంలోకి ఎవరు ఎక్కి వెళ్తారు?’ అని మీ హృదయంలో అనుకోవద్దు.”

  6. “లేదా ‘క్రీస్తును మృతులలో నుండి పైకి తేవడానికే అగాధం లోనికి ఎవరు దిగి వెళ్తారు?’ ” అని మీ హృదయాల్లో అనుకోవద్దు.

  7. అయితే ఇది ఏమి చెప్తుంది? “వాక్యం మీకు దగ్గరగా ఉంది, అది మీ నోటిలో, మీ హృదయంలో ఉంది.” అది మేము ప్రకటిస్తున్న విశ్వాస వాక్యమే.

  8. మీరు మీ నోటితో “యేసు ప్రభువు” అని ఒప్పుకుని, మీ హృదయాల్లో “దేవుడు ఆయనను మరణం నుండి లేపాడు” అని నమ్మితే మీరు రక్షించబడతారు.

  9. అంటే, మీరు మీ హృదయంలో నమ్మినప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు. మీరు మీ నోటితో మీ విశ్వాసాన్ని ఒప్పుకున్నప్పుడు రక్షించబడతారు.

  10. ఒకే ఆత్మ ఒకరికి బుద్ధి సందేశాన్ని, మరొకరికి జ్ఞాన సందేశాన్ని,

  11. ఆ ఆత్మయే ఒకరికి విశ్వాసాన్ని, మరొకరికి స్వస్థత వరాన్ని ఇస్తున్నాడు.

  12. మేము అన్ని వైపుల నుండి తీవ్రమైన శ్రమలకు గురయ్యాం కాని నలిగిపోలేదు; ఆందోళన కలిగినా నిరాశ చెందలేదు;

  13. హింసించబడినా విడిచిపెట్టబడలేదు; పడత్రోయబడినా నాశనమవ్వలేదు.

  14. కాబట్టి మేము ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోము. మేము బాహ్యంగా క్షీణిస్తున్నా, అంతరంగంలో దినదినం నూతనపరచబడుతున్నాము.

  15. మేము అనుభవిస్తున్న ఈ క్షణికమైన తేలికైన కష్టాలు వాటికన్నా ఎంతో అధికమైన నిత్య మహిమను సంపాదిస్తున్నాయి.

  16. కాబట్టి కనిపించే వాటిపై కాక కనిపించని వాటిపై మా దృష్టిని నిలిపాము. ఎందుకంటే కనిపించేవి తాత్కాలికమైనవి, కనిపించనివి శాశ్వతమైనవి.

  17. అందుకు, “నా కృప నీకు చాలు, బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది” అని ఆయన నాతో చెప్పారు. అందువల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండేలా నా బలహీనతల్లోనే నేను గర్విస్తాను.

  18. అందుకే క్రీస్తు కోసం నాకు కలిగిన బలహీనతలు, అవమానాలు, కష్టాలు, హింసలు, బాధలు నాకు ఆనందాన్నే కలిగిస్తాయి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.

  19. అవివేకులైన గలతీయులారా! మిమ్మల్ని ఎవరు భ్రమపెట్టారు? యేసు క్రీస్తు మీ కళ్లముందే సిలువ వేయబడినంత స్పష్టంగా వివరించాము.

  20. ఒక్క విషయాన్ని నేను మీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను: మీరు ధర్మశాస్త్ర క్రియల వల్ల ఆత్మను పొందారా, లేక మీరు విన్న దాన్ని విశ్వసించడం వల్లనా?

  21. మీరు ఇంత అవివేకులా? ఆత్మతో ప్రారంభించి, ఇప్పుడు శరీరంతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారా?

  22. మీరు పొందిన శ్రమ వ్యర్థమేనా? అదంతా నిజంగా వ్యర్థమేనా?

  23. నేను మళ్ళీ అడుగుతున్నాను, దేవుడు మీకు తన ఆత్మను ఇచ్చి, మీ మధ్య అద్భుతాలు జరిగిస్తూ ఉన్నది ధర్మశాస్త్ర క్రియల వల్లనా, లేక మీరు విన్న దాన్ని విశ్వసించడం వల్లనా?

  24. అలాగే మన పూర్వికుడైన అబ్రాహాము కూడా, “దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది.”

  25. కాబట్టి మీరు అర్థం చేసుకోవలసింది ఏంటంటే విశ్వాసం కలిగినవారే అబ్రాహాముకు పిల్లలవుతారు.