కంటెంట్‌కు వెళ్లండి

Egypt గురించి బైబిల్ వచనాలు

328 వచనాలు · 105 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కాబట్టి వారిని అణచివేయాలని వారితో వెట్టిచాకిరి చేయించడానికి వారిపై బానిస యజమానులను నియమించారు, ఫరో కోసం పీతోము రామెసేసు అనే రెండు పట్టణాలను గిడ్డంగులుగా కట్టారు.

  2. అయితే వారు ఎంతగా అణచివేయబడ్డారో, అంతకన్నా ఎక్కువ విస్తరించి వారు వ్యాపించారు; కాబట్టి ఈజిప్టు ప్రజలు ఇశ్రాయేలీయులను బట్టి భయపడి,

  3. వారి చేత వెట్టిచాకిరి చేయించారు.

  4. మట్టి పనిలో, ఇటుకల పనిలో, పొలంలో చేసే ప్రతి పనిలో వారిచేత కఠిన సేవ చేయిస్తూ వారి జీవితాలను దుర్భరంగా మార్చారు. ఈజిప్టు ప్రజలు వారితో కఠినంగా పని చేయించారు.

  5. ఈజిప్టు రాజు, షిఫ్రా పూయా అనే హెబ్రీ మంత్రసానులతో మాట్లాడుతూ,

  6. “హెబ్రీ స్త్రీలకు ప్రసవ సమయంలో కాన్పుపీట దగ్గర మీరు వారికి సహాయం చేస్తున్నప్పుడు పుట్టింది మగపిల్లవాడైతే వానిని చంపెయ్యండి, ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వండి” అని అన్నాడు.

  7. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఈజిప్టు రాజు తమతో చెప్పింది చేయకుండా మగపిల్లలను బ్రతకనిచ్చారు.

  8. ఈజిప్టు రాజు ఆ స్త్రీలను పిలిపించి, “మీరెందుకు ఇలా చేశారు? మగపిల్లలను ఎందుకు బ్రతకనిచ్చారు?” అని వారిని అడిగాడు.

  9. అందుకు ఆ మంత్రసానులు, “హెబ్రీ స్త్రీలు ఈజిప్టు స్త్రీల వంటివారు కారు; వారు బలం గలవారు, మంత్రసానులు వారి దగ్గరకు రావడానికి ముందే ప్రసవిస్తున్నారు” అని ఫరోతో చెప్పారు.

  10. కాబట్టి దేవుడు ఆ మంత్రసానుల పట్ల దయ చూపించారు, ప్రజలు మరింత ఎక్కువగా విస్తరించారు.

  11. ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు, కాబట్టి ఆయన వారి సొంత కుటుంబాలను వృద్ధిచేశారు.

  12. అప్పుడు ఫరో, “హెబ్రీయులకు పుట్టిన ప్రతి మగపిల్లవాన్ని నైలు నదిలో పడవేసి, ఒకవేళ ఆడపిల్లను అయితే బ్రతకనివ్వాలి” అని ఆజ్ఞాపించాడు.

  13. ఫరో కుమార్తె స్నానం చేయడానికి నైలు నదికి రాగా ఆమె పనికత్తెలు నది ఒడ్డున నడుస్తున్నారు. ఆమె జమ్ము మధ్యలో ఉన్న పెట్టెను చూసి దానిని తీసుకురావడానికి తన దాసిని పంపించింది.

  14. దానిని తెరిచి ఆ పిల్లవాన్ని చూసింది. ఆ పిల్లవాడు ఏడ్వడం చూసిన ఆమె అతనిపై కనికరపడి, “వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడు” అన్నది.

  15. అప్పుడు ఆ పిల్లవాని అక్క ఫరో కుమార్తెతో, “ఈ పిల్లవాన్ని నీకోసం పెంచడానికి నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒకరిని పిలుచుకొని రమ్మంటారా?” అని అడిగింది.

  16. అందుకు ఆమె, “సరే, వెళ్లు” అన్నది. కాబట్టి ఆ అమ్మాయి వెళ్లి ఆ బిడ్డ తల్లిని తీసుకువచ్చింది.

  17. ఫరో కుమార్తె ఆమెతో, “నీవు ఈ బిడ్డను తీసుకెళ్లి నా కోసం పాలిచ్చి పెంచు, నేను నీకు జీతమిస్తాను” అని చెప్పింది. ఆమె ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచింది.

  18. పిల్లవాడు పెద్దయ్యాక, ఆమె అతన్ని ఫరో కుమార్తె దగ్గరకు తీసుకెళ్లింది, అతడు ఆమె కుమారుడయ్యాడు. “నేను అతన్ని నీటి నుండి బయటకు తీశాను” అని ఆమె అతనికి మోషే అని పేరు పెట్టింది.

  19. అక్కడ ఒక పొదలో మండుతున్న అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆ పొద అగ్నితో మండుతూ ఉన్నప్పటికీ అది కాలిపోకపోవడం మోషే చూశాడు.

  20. అప్పుడు మోషే, “నేను అక్కడికి వెళ్లి ఆ పొద ఎందుకు కాలిపోవడం లేదనే ఆ గొప్ప అద్భుతాన్ని చూస్తాను” అని అనుకున్నాడు.

  21. దానిని చూడడానికి అతడు అక్కడికి రావడం యెహోవా చూసినప్పుడు, ఆ పొద మధ్యలో నుండి దేవుడు, “మోషే! మోషే!” అని అతన్ని పిలిచారు. అందుకు మోషే, “నేను ఇక్కడ ఉన్నాను” అన్నాడు.

  22. అందుకు దేవుడు, “దగ్గరకు రావద్దు, నీవు నిలబడిన స్థలం పరిశుద్ధస్థలం కాబట్టి నీ చెప్పులు విప్పు” అన్నారు.

  23. ఇంకా ఆయన, “నేను నీ తండ్రి దేవుడను, అనగా అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను” అన్నారు. అప్పుడు మోషే దేవుని వైపు చూడడానికి భయపడి, తన ముఖాన్ని దాచుకున్నాడు.

  24. అప్పుడు యెహోవా, “నేను ఈజిప్టులో ఉన్న నా ప్రజల బాధను చూశాను. వారిచేత వెట్టిచాకిరి చేయిస్తున్న అధికారులను గురించి వారు నాకు చేసిన మొరను నేను విన్నాను, వారి శ్రమల గురించి నాకు తెలుసు.

  25. కాబట్టి ఈజిప్టువారి చేతిలో నుండి వారిని విడిపించడానికి ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలోనికి, అనగా కనానీయుల, హిత్తీయుల, అమోరీయుల, పెరిజ్జీయుల, హివ్వీయుల, యెబూసీయుల దేశమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని తీసుకెళ్లడానికి నేను దిగి వచ్చాను.