కంటెంట్‌కు వెళ్లండి

Egypt గురించి బైబిల్ వచనాలు

328 వచనాలు · 105 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు వారు, “మీరు మా జీవితాలను కాపాడారు. ప్రభువా, మామీద మీ దయ ఉంచండి; మేము ఫరోకు బానిసలుగా ఉంటాం” అని అన్నారు.

  2. కాబట్టి యోసేపు ఈజిప్టు దేశాన్ని ఉద్దేశించి శాసనం నియమించాడు. అది నేటి వరకు ఉంది. పంటంతటిలో అయిదవ వంతు ఫరోకు చెందుతుంది. అయితే యాజకుల స్థలం మాత్రం ఫరోకు చెందలేదు.

  3. యోసేపు తన తండ్రి మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడు.

  4. తర్వాత తన తండ్రి ఇశ్రాయేలు శవాన్ని సుగంధ ద్రవ్యాలతో భద్రపరచమని వైద్యులకు ఆదేశించాడు.

  5. కాబట్టి వైద్యులు పూర్తి నలభై రోజులు తీసుకుని భద్రపరిచారు, ఎందుకంటే భద్రపరచడానికి అవసరమయ్యే సమయం అది. ఈజిప్టువారు అతని కోసం డెబ్బై రోజులు దుఃఖించారు.

  6. సంతాప దినాలు గడిచాక, యోసేపు ఫరో ఇంటివారితో, “నేను మీ దృష్టిలో దయ పొందితే, నా పక్షాన ఫరోతో మాట్లాడండి. అతనితో,

  7. ‘నా తండ్రి నా చేత ప్రమాణం చేయించుకుని, “నేను చనిపోబోతున్నాను; కనాను దేశంలో నా కోసం నేను త్రవ్వించుకున్న సమాధిలో నన్ను పాతిపెట్టండి” అని చెప్పాడు. కాబట్టి నాకు సెలవిస్తే నేను వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి తిరిగి వస్తాను’ అని చెప్పండి” అని అన్నాడు.

  8. అప్పుడు ఫరో, “నీవు వెళ్లి, అతడు నీతో ప్రమాణం చేయించినట్టు నీ తండ్రిని పాతిపెట్టు” అన్నాడు.

  9. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టడానికి వెళ్లినప్పుడు అతనితో ఫరో అధికారులందరు, అతని ఇంటి పెద్దలు, ఈజిప్టు ఉన్నతాధికారులందరు,

  10. యోసేపు ఇంటివారందరు, అతని సోదరులు, అతని తండ్రి ఇంటివారితో వెళ్లారు. కేవలం వారి పిల్లలను, వారి మందలను, పశువులను గోషేనులో విడిచిపెట్టారు.

  11. రథాలు, రథసారధులు కూడా అతనితో వెళ్లారు. అది చాలా పెద్ద గుంపు.

  12. వారు యొర్దాను దగ్గర ఉన్న ఆటదు నూర్పిడి కళ్లం దగ్గర చేరినప్పుడు, వారు బిగ్గరగా, ఘోరంగా ఏడ్చారు; అక్కడ తన తండ్రి కోసం యోసేపు ఏడు రోజుల సంతాప కాలం పాటించాడు.

  13. అక్కడ నివసించే కనానీయులు ఆటదు నూర్పిడి కళ్లం దగ్గర ఏడ్వడం చూసి, “ఈజిప్టువారు శోకంతో సంతాప వేడుకను జరుపుకుంటున్నారు” అని అన్నారు. అందుకే యొర్దాను దగ్గర ఉన్న ఆ స్థలం ఆబేల్-మిస్రాయిము అని పిలువబడింది.

  14. కాబట్టి యాకోబు ఆజ్ఞాపించినట్టు అతని కుమారులు చేశారు:

  15. అతన్ని కనాను దేశానికి మోసుకెళ్లి, అబ్రాహాము సమాధి స్థలంగా హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర పొలంతో పాటు కొన్న మమ్రే దగ్గర ఉన్న మక్పేలా పొలంలో ఉన్న గుహలో సమాధి చేశారు.

  16. తమ కుటుంబాలతో యాకోబు వెంట ఈజిప్టుకు వెళ్లిన ఇశ్రాయేలు కుమారుల పేర్లు:

  17. రూబేను, షిమ్యోను, లేవీ, యూదా;

  18. ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను;

  19. దాను, నఫ్తాలి; గాదు, ఆషేరు.

  20. యాకోబు సంతతివారందరు డెబ్బైమంది; అప్పటికే యోసేపు ఈజిప్టులో ఉన్నాడు.

  21. కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు, అతని అన్నదమ్ములు ఆ తరం వారందరు చనిపోయారు,

  22. అయితే ఇశ్రాయేలీయులు అత్యధికంగా ఫలించారు; వారు గొప్పగా విస్తరించారు, అభివృద్ధి చెందారు, వారి సంఖ్య అంతకంతకు అభివృద్ధి పొంది వారున్న ప్రదేశం వారితోనే నిండిపోయింది.

  23. కొంతకాలం తర్వాత, యోసేపు గురించి తెలియని ఒక క్రొత్త రాజు ఈజిప్టులో అధికారంలోకి వచ్చాడు.

  24. అతడు తన ప్రజలతో, “చూడండి, ఈ ఇశ్రాయేలీయులు సంఖ్యలో, బలంలో మనలను అధిగమించారు.

  25. మనం వారితో యుక్తిగా నడుచుకోవాలి, లేకపోతే వారి సంఖ్య ఇంకా అధికమవుతుంది. ఒకవేళ యుద్ధం వస్తే వారు మన శత్రువులతో చేరి మనకు వ్యతిరేకంగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్లిపోతారేమో” అన్నాడు.