- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 95
The Revelation
John's vision on Patmos unveils the cosmic victory of the Lamb over evil and the final restoration of all creation.
ఈ కాలపు వచనాలు
- ప్రకటన 2:6సుమారు క్రీ.శ. 96
అయితే నేను నీకొలాయితు పద్ధతులను ద్వేషించినట్లు నీవు కూడా ద్వేషిస్తున్నావు కాబట్టి అది నీకు అనుకూలంగా ఉన్న మంచి విషయము.
- ప్రకటన 2:7సుమారు క్రీ.శ. 96
ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు వినాలి! వీటిని జయించినవారికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలను తినడానికి అనుమతిస్తాను.
- ప్రకటన 2:8సుమారు క్రీ.శ. 96
“స్ముర్నలో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: మొదటి వాడును చివరి వాడునై మరణించి తిరిగి లేచినవాడు ఈ మాటలు చెప్తున్నాడు.
- ప్రకటన 2:9సుమారు క్రీ.శ. 96
నీ శ్రమలు, నీ పేదరికం నాకు తెలుసు అయినా నీవు ధనవంతుడవే! యూదులు కాకుండానే తాము యూదులమని చెప్పుకొనే సాతాను సమాజమందిరానికి చెందినవారు నీపై చేసే దూషణ నాకు తెలుసు.
- ప్రకటన 2:10సుమారు క్రీ.శ. 96
నీకు కలుగబోయే కష్టాలను గురించి భయపడవద్దు. నిన్ను శోధించడానికి అపవాది మీలో కొందరిని చెరసాలలో వేస్తాడు, కాబట్టి పది రోజులు హింస పొందుతారు అని తెలియజేస్తున్నాను. అయినా మరణం వరకు నమ్మకంగా ఉండండి. అప్పుడు నేను మీకు జీవాన్ని మీ విజయ కిరీటంగా బహూకరిస్తాను.
- ప్రకటన 2:11సుమారు క్రీ.శ. 96
ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు వినాలి! జయించినవారికి రెండవ మరణం హాని చేయదు.
- ప్రకటన 2:12సుమారు క్రీ.శ. 96
“పెర్గములో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: పదునైన రెండు అంచులు గల ఖడ్గం కలవాడు ఈ మాటలు చెప్తున్నాడు.
- ప్రకటన 2:13సుమారు క్రీ.శ. 96
సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు నివసిస్తున్నావని నాకు తెలుసు. అయినా నా నామానికి నిజంగా కట్టుబడి ఉన్నావు. సాతాను నివసించే నీ పట్టణంలో నాకు నమ్మకమైన సాక్షిగా ఉన్న అంతిప అనేవాడు హతసాక్షిగా చంపబడిన దినాల్లో కూడ నాలో నీ విశ్వాసాన్ని వదలకుండా ఉన్నావు.
- ప్రకటన 2:14సుమారు క్రీ.శ. 96
అయినా, నేను నీ మీద కొన్ని తప్పులు మోపవలసి ఉంది: అవేమనగా విగ్రహాలకు అర్పించిన ఆహారం తినేలా, లైంగిక దుర్నీతి జరిగించేలా ఇశ్రాయేలీయులను వేధించమని బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు.
- ప్రకటన 2:15సుమారు క్రీ.శ. 96
అలాగే నీకొలాయితు చేసే బోధలను అనుసరించేవారు కూడా నీలో ఉన్నారు.
- ప్రకటన 2:16సుమారు క్రీ.శ. 96
కాబట్టి పశ్చాత్తాపపడు! లేకపోతే నేను త్వరలో నీ దగ్గరకు వచ్చినా నోటినుండి వచ్చే ఖడ్గంతో వారితో యుద్ధం చేస్తాను.
- ప్రకటన 2:17సుమారు క్రీ.శ. 96
ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు వినాలి! వీటిని జయించినవారికి నేను దాచి ఉంచిన మన్నాను ఇస్తాను. నేను వారికి తెల్లని రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును ఇస్తాను. దాన్ని పొందినవారికి మాత్రమే ఆ పేరు తెలుస్తుంది.
- ప్రకటన 2:18సుమారు క్రీ.శ. 96
“తుయతైరలో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: అగ్ని జ్వాలల్లాంటి కళ్లు, తళతళ మెరుస్తున్న కంచును పోలిన పాదాలు గల దేవుని కుమారుడు ఈ మాటలు చెప్తున్నాడు:
- ప్రకటన 2:19సుమారు క్రీ.శ. 96
నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ సేవ, నీ పట్టుదల, నాకు తెలుసు. నీవు ఇప్పుడు చేసే క్రియలు ముందు చేసిన క్రియల కంటే గొప్పవని నాకు తెలుసు.
- ప్రకటన 2:20సుమారు క్రీ.శ. 96
అయినా నేను నీ మీద తప్పు మోపవలసివున్నది: తాను ప్రవక్తిని అని చెప్పుకొనే యెజెబెలును మీరు సహిస్తున్నారు. లైంగిక దుర్నీతి, విగ్రహాలకు అర్పించిన ఆహారం తినాలని నా సేవకులకు బోధిస్తూ ఆమె వారిని మోసం చేస్తుంది.
- ప్రకటన 2:21సుమారు క్రీ.శ. 96
ఆమె లైంగిక దుర్నీతి గురించి పశ్చాత్తాపపడడానికి నేను సమయం ఇచ్చాను కాని ఆమె దానికి ఇష్టపడలేదు.
- ప్రకటన 2:22సుమారు క్రీ.శ. 96
కాబట్టి నేను ఆమెను శ్రమల పడకపై పడవేస్తాను. అలాగే ఆమెతో వ్యభిచరించిన వారు పశ్చాత్తాపపడకపోతే వారిని కూడా తీవ్రమైన బాధలకు గురిచేస్తాను.
- ప్రకటన 2:23సుమారు క్రీ.శ. 96
ఆమె పిల్లలను నేను మరణానికి అప్పగిస్తాను. అప్పుడు సంఘాలన్ని నేను అంతరంగాలను, హృదయాలను పరిశోధిస్తానని, మీలో అందరికి మీ క్రియలకు తగిన ప్రతిఫలం ఇస్తానని తెలుసుకుంటాయి.
- ప్రకటన 2:24సుమారు క్రీ.శ. 96
అయితే తుయతైరలో యెజెబెలు బోధను అంగీకరించకుండా, సాతాను లోతైన మర్మాలను నేర్చుకోకుండా ఉన్న తక్కిన వారందరికి, ‘నేను ఇక ఏ భారం నీమీద మోపనని చెప్తున్నాను.
- ప్రకటన 2:25సుమారు క్రీ.శ. 96
కాని నేను వచ్చేవరకు నీవు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో.’
- ప్రకటన 2:26సుమారు క్రీ.శ. 96
అంతం వరకు నా చిత్తాన్ని నెరవేరుస్తూ జయించినవారికి నా తండ్రి నుండి నేను అధికారం పొందినట్లే రాజ్యాల మీద వారికి అధికారం ఇస్తాను.
- ప్రకటన 2:27సుమారు క్రీ.శ. 96
‘వారు ఇనుపదండంతో రాజ్యాలను పరిపాలిస్తారు, వారిని మట్టి కుండలను పగలగొట్టినట్లు పగలగొడతారు.’
- ప్రకటన 2:28సుమారు క్రీ.శ. 96
నేను వారికి వేకువ చుక్కను కూడా ఇస్తాను.
- ప్రకటన 2:29సుమారు క్రీ.శ. 96
ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు వినాలి.
- ప్రకటన 3:1సుమారు క్రీ.శ. 96
“సార్దీసులో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: దేవుని ఏడు ఆత్మలు, ఏడు నక్షత్రాలు కలవాడు ఈ మాటలు చెప్తున్నాడు. నీ క్రియలు నాకు తెలుసు; నీవు బ్రతికున్నావని పేరు ఉంది కాని నీవు చచ్చిన దానివే.