కంటెంట్‌కు వెళ్లండి

circa AD 95

The Revelation

John's vision on Patmos unveils the cosmic victory of the Lamb over evil and the final restoration of all creation.

404 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. ప్రకటన 15:2సుమారు క్రీ.శ. 96

    నేను అగ్నితో కలిసి ఉన్న గాజు సముద్రంలాంటి దాన్ని చూశాను. ఆ గాజు సముద్రపు ఒడ్డున ఆ మృగాన్ని, దాని విగ్రహాన్ని, ఆ మృగం పేరుగల సంఖ్యను జయించినవారు నిలబడి ఉన్నారు. వారు తమకు దేవుడు ఇచ్చిన తంతి వాయిద్యాలను పట్టుకుని ఉన్నారు.

  2. ప్రకటన 15:3సుమారు క్రీ.శ. 96

    వారు దేవుని సేవకుడైన మోషే పాట, వధించబడిన గొర్రెపిల్ల పాడిన పాట పాడుతూ, “మా ప్రభువైన సర్వశక్తిగల దేవా! నీవు చేసిన క్రియలు గొప్పవి, ఆశ్చర్యకరమైనవి! సకల రాజ్యాలకు రాజా! నీ మార్గాలు యథార్థంగా న్యాయంగా ఉన్నాయి!

  3. ప్రకటన 15:4సుమారు క్రీ.శ. 96

    ఓ ప్రభువా! నీవు ఒక్కడివే పరిశుద్ధుడవు, కాబట్టి నీకు భయపడని వారు ఎవరు? నీ పేరును ఘనపరచకుండా ఎవరు ఉండగలరు? నీ నీతి క్రియలు తెలియజేయబడ్డాయి, కాబట్టి భూజనులందరు నీ ఎదుటకు వచ్చి ఆరాధిస్తారు,” అని దేవుని స్తుతించారు.

  4. ప్రకటన 15:5సుమారు క్రీ.శ. 96

    దీని తర్వాత నేను చూస్తూ ఉండగా, పరలోక దేవాలయం అనగా సాక్షి గుడారం తెరవబడింది.

  5. ప్రకటన 15:6సుమారు క్రీ.శ. 96

    ఆ పరలోక దేవాలయం నుండి ఏడుగురు దేవదూతలు ఏడు తెగుళ్ళు తీసుకువచ్చారు. వారు ప్రకాశిస్తున్న తెల్లని వస్త్రాలను ధరించి తమ రొమ్ముకు బంగారు దట్టీని కట్టుకుని ఉన్నారు.

  6. ప్రకటన 15:7సుమారు క్రీ.శ. 96

    అప్పుడు నాలుగు ప్రాణులలోని ఒక ప్రాణి నిరంతరం జీవించే దేవుని ఉగ్రతతో నింపబడిన ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దేవదూతలకు ఇచ్చాడు.

  7. ప్రకటన 15:8సుమారు క్రీ.శ. 96

    అప్పుడు దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చే పొగతో ఆ దేవాలయమంతా నిండిపోయి ఆ ఏడుగురు దేవదూతలు ఆ ఏడు తెగుళ్ళను కుమ్మరించే వరకు ఆ దేవాలయంలోనికి ఎవరు ప్రవేశించలేకపోయారు.

  8. ప్రకటన 16:1సుమారు క్రీ.శ. 96

    అప్పుడు దేవాలయంలో నుండి ఒక పెద్ద స్వరం ఏడుగురు దేవదూతలతో, “మీరు వెళ్లి దేవుని ఉగ్రత గల ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించండి” అని బిగ్గరగా చెప్పడం విన్నాను.

  9. ప్రకటన 16:2సుమారు క్రీ.శ. 96

    మొదటి దేవదూత వెళ్లి భూమి మీద తన పాత్రను కుమ్మరించాడు. అప్పుడు ఆ మృగం యొక్క ముద్రగలవారికి, దాని విగ్రహాన్ని పూజించేవారికి భయంకరమైన నొప్పి కలిగించే అసహ్యమైన కురుపులు పుట్టాయి.

  10. ప్రకటన 16:3సుమారు క్రీ.శ. 96

    రెండవ దేవదూత సముద్రం మీద తన పాత్రను కుమ్మరించిన వెంటనే సముద్రపు నీరు చనిపోయినవారి రక్తంలా మారింది; దానిలోని ప్రతి ప్రాణి చనిపోయింది.

  11. ప్రకటన 16:4సుమారు క్రీ.శ. 96

    మూడవ దేవదూత తన పాత్రను నదులు, నీటి ఊటల మీద కుమ్మరించినప్పుడు అవి రక్తంగా మారాయి.

  12. ప్రకటన 16:5సుమారు క్రీ.శ. 96

    అప్పుడు జలాల మీద అధికారం కలిగిన దేవదూత ఇలా చెప్పడం విన్నాను, “ఓ పరిశుద్ధుడా! నీవు ఉన్నవాడవు, ఉండిన వాడవు, ఈ తీర్పు తీర్చడానికి నీవు న్యాయవంతుడవు.

  13. ప్రకటన 16:6సుమారు క్రీ.శ. 96

    వారు నీ పరిశుద్ధ ప్రజల రక్తాన్ని నీ ప్రవక్తల రక్తాన్ని కార్చారు కాబట్టి, వారికి తగినట్లే వారికి రక్తాన్ని త్రాగించావు.”

  14. ప్రకటన 16:7సుమారు క్రీ.శ. 96

    అప్పుడు బలిపీఠం ఈ విధంగా బదులిచ్చింది: “అవును, ఓ సర్వశక్తిమంతుడా ప్రభువైన దేవా, నీ తీర్పులు సత్యమైనవి న్యాయమైనవి.”

  15. ప్రకటన 16:8సుమారు క్రీ.శ. 96

    నాలుగవ దేవదూత సూర్యుని మీద తన పాత్రను కుమ్మరించినప్పుడు అగ్నితో ప్రజలను కాల్చడానికి సూర్యునికి అనుమతి ఇవ్వబడింది.

  16. ప్రకటన 16:9సుమారు క్రీ.శ. 96

    ప్రజలు ఆ భయంకరమైన వేడికి కాలిపోయి ఈ తెగుళ్ళపై అధికారం కలిగిన దేవుని నామాన్ని దూషించారే తప్ప పశ్చాత్తాపపడి ఆయనను మహిమపరచలేదు.

  17. ప్రకటన 16:10సుమారు క్రీ.శ. 96

    అయిదవ దేవదూత తన పాత్రను ఆ మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరించినప్పుడు దాని రాజ్యమంతా చీకటి కమ్మింది. ప్రజలు ఆ వేదనను తట్టుకోలేక తమ నాలుకలను కొరుక్కున్నారు.

  18. ప్రకటన 16:11సుమారు క్రీ.శ. 96

    వారికి కలిగిన వేదనకు, కురుపులకు వారు పరలోక దేవుని దూషించారు కానీ తాము చేసిన వాటి గురించి పశ్చాత్తాపపడలేదు.

  19. ప్రకటన 16:12సుమారు క్రీ.శ. 96

    ఆరో దేవదూత యూఫ్రటీసు అనే మహా నది మీద తన పాత్రను కుమ్మరించినప్పుడు, తూర్పు నుండి రాజులు వచ్చేలా మార్గం సిద్ధపరచడానికి ఆ నది పూర్తిగా ఎండిపోయింది.

  20. ప్రకటన 16:13సుమారు క్రీ.శ. 96

    తర్వాత కప్పలను పోలిన మూడు అపవిత్రాత్మలు నాకు కనబడ్డాయి; అవి ఘటసర్పం నోటి నుండి, మృగం నోటి నుండి అబద్ధ ప్రవక్త నోటి నుండి బయటకు వచ్చాయి.

  21. ప్రకటన 16:14సుమారు క్రీ.శ. 96

    అవి సూచకక్రియలను చేసే దయ్యపు ఆత్మలు. సర్వశక్తిమంతుడైన దేవుని మహాదినాన యుద్ధం చేయడానికి భూలోకమంతటిలో ఉన్న రాజులను పోగుచేయడానికి అవి వారి దగ్గరకు వెళ్లాయి.

  22. ప్రకటన 16:15సుమారు క్రీ.శ. 96

    “ఇదిగో! నేను దొంగలా వస్తాను! దిగంబరులుగా ఉండి సిగ్గుపడేవారిగా ఉండకుండా, మెలకువగా ఉండి వస్త్రం ధరించుకొని సిద్ధపడి ఉన్నవారు ధన్యులు!”

  23. ప్రకటన 16:16సుమారు క్రీ.శ. 96

    ఆ అపవిత్రాత్మలు రాజులనందరిని హెబ్రీ భాషలో “హర్మగిద్దోను” అని పిలువబడే స్థలంలో పోగుచేశాయి.

  24. ప్రకటన 16:17సుమారు క్రీ.శ. 96

    ఏడవ దేవదూత గాలిలో తన పాత్రను కుమ్మరించినప్పుడు, దేవాలయంలోని సింహాసనం నుండి ఒక స్వరం బిగ్గరగా, “ఇక సమాప్తం అయింది!” అని చెప్పింది.

  25. ప్రకటన 16:18సుమారు క్రీ.శ. 96

    అప్పుడు మెరుపుల వెలుగులు, ధ్వనులు, ఉరుములు, భయంకరమైన భూకంపం వచ్చాయి. మానవులు భూమి మీద జీవిస్తున్నప్పటి నుండి ఇలాంటి భూకంపం కలుగలేదు. అది చాలా భయంకరమైన భూకంపము.