circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
ఈ కాలపు వచనాలు
- గలతీయులకు 3:29సుమారు క్రీ.శ. 58
మీరు క్రీస్తుకు చెందినవారైతే, మీరు అబ్రాహాము సంతానంగా ఉండి వాగ్దాన ప్రకారం వారసులు.
- గలతీయులకు 4:1సుమారు క్రీ.శ. 58
అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వారసుడు బాలునిగా ఉన్నంత వరకు అతడు ఆస్తి అంతటికి యజమాని అయినప్పటికీ అతడు దాసుని కన్నా గొప్పవాడు కాడు.
- గలతీయులకు 4:2సుమారు క్రీ.శ. 58
తన తండ్రి నిర్ణయించిన సమయం వచ్చేవరకు వారసుడు సంరక్షకులు నిర్వాహకుల ఆధీనంలో ఉంటాడు.
- గలతీయులకు 4:3సుమారు క్రీ.శ. 58
అలాగే మనం తగిన వయస్సు వచ్చేవరకు ఈ లోకానికి సంబంధించిన మూల నియమాల క్రింద బానిసలుగా ఉన్నాము.
- గలతీయులకు 4:4సుమారు క్రీ.శ. 58
అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారున్ని పంపారు; ఆయన ఒక స్త్రీకి జన్మించి, మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్ర ఆధీనంలో ఉన్నవారిని విడిపించాలని ఆయన ధర్మశాస్త్రానికి లోబడినవాడయ్యారు.
- గలతీయులకు 4:5సుమారు క్రీ.శ. 58
To redeem them that were under the law, that we might receive the adoption of sons.
- గలతీయులకు 4:6సుమారు క్రీ.శ. 58
మీరు ఆయన కుమారులు కాబట్టి, “అబ్బా, తండ్రీ” అని మొరపెట్టే తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి పంపారు.
- గలతీయులకు 4:7సుమారు క్రీ.శ. 58
కాబట్టి ఇకపై మీరు దాసులు కారు, కానీ దేవుని పిల్లలు; మీరు ఆయన పిల్లలు కాబట్టి దేవుడు మిమ్మల్ని వారసులుగా చేశారు.
- గలతీయులకు 4:8సుమారు క్రీ.శ. 58
గతంలో, మీరు దేవుని ఎరుగక ముందు, మీరు స్వాభావికంగా దేవుళ్ళు కాని వారికి బానిసలై ఉన్నారు.
- గలతీయులకు 4:9సుమారు క్రీ.శ. 58
కాని ఇప్పుడు మీరు దేవున్ని తెలుసుకున్నారు, దేవుడు మిమ్మల్ని ఎరిగి ఉన్నారు. అలాంటప్పుడు మీరు మళ్ళీ వెనుకకు ఆ బలహీనమైన దిక్కుమాలిన సిద్ధాంతాల వైపు ఎందుకు తిరుగుతున్నారు? మీరు మళ్ళీ వాటికి బానిసలవ్వాలని కోరుకుంటున్నారా?
- గలతీయులకు 4:10సుమారు క్రీ.శ. 58
మీరు ప్రత్యేకమైన రోజులను, నెలలను, పండుగలను, సంవత్సరాలను ఆచరిస్తున్నారు గదా!
- గలతీయులకు 4:11సుమారు క్రీ.శ. 58
నేను మీ కోసం పడిన కష్టమంతా వృధా అవుతుందేమో అని భయపడుతున్నాను.
- గలతీయులకు 4:12సుమారు క్రీ.శ. 58
సహోదరీ సహోదరులారా, నేను మీలా మారినట్లే మీరూ నాలా మారాలని మిమ్మల్ని వేడుకొంటున్నాను. మీరు నా పట్ల ఏ తప్పు చేయలేదు.
- గలతీయులకు 4:13సుమారు క్రీ.శ. 58
నాకు అనారోగ్యంగా ఉన్నా నేను మొదటిగా మీకు సువార్త ప్రకటించానని మీకు తెలుసు.
- గలతీయులకు 4:14సుమారు క్రీ.శ. 58
నా అనారోగ్యం మీకు ఇబ్బందిని కలిగించినప్పటికీ, మీరు నన్ను తిరస్కరించలేదు అలక్ష్యం చేయలేదు. నిజానికి, మీరు నన్ను దేవుని దూతలా, నేనే యేసు క్రీస్తును అయినట్టు చేర్చుకున్నారు.
- గలతీయులకు 4:15సుమారు క్రీ.శ. 58
అయితే నా వలన మీరు పొందిన దీవెన ఇప్పుడేమైపోయింది? మీరు మీ కళ్లను కూడా పెరికివేసి నాకు ఇచ్చేవారని, నేను మీ గురించి సాక్ష్యమివ్వగలను.
- గలతీయులకు 4:16సుమారు క్రీ.శ. 58
అయితే ఇప్పుడు మీకు సత్యాన్ని చెప్పి నేను మీకు శత్రువునయ్యానా?
- గలతీయులకు 4:17సుమారు క్రీ.శ. 58
ఆ ప్రజలు మిమ్మల్ని గెలవాలని ఆసక్తి కలిగి ఉన్నారు, కాని అది మీ మేలుకోసం కాదు. మీరు వారి పట్ల ఆసక్తిని చూపించాలని, వారు మా నుండి మిమ్మల్ని వేరు చేయాలనుకుంటున్నారు.
- గలతీయులకు 4:18సుమారు క్రీ.శ. 58
నేను మీతో ఉన్నప్పుడే కాకుండా ఎప్పుడూ మంచి ఉద్దేశాలలో ఆసక్తి కలిగి ఉండడం మంచిదే.
- గలతీయులకు 4:19సుమారు క్రీ.శ. 58
నా ప్రియ పిల్లలారా, మీలో క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు నేను మరలా ప్రసవ వేదన పడుతున్నాను.
- గలతీయులకు 4:20సుమారు క్రీ.శ. 58
నేను మీ గురించి కలవరపడుతున్నాను. ఇప్పుడు నేను మీతో ఉండి మరో విధంగా మాట్లాడగలిగితే ఎంత బాగుండేది!
- గలతీయులకు 4:21సుమారు క్రీ.శ. 58
ఒక్క మాట చెప్పండి, ధర్మశాస్త్రానికే లోబడి ఉండాలనుకునే మీకు ధర్మశాస్త్రం ఏమి చెప్తుందో తెలియదా?
- గలతీయులకు 4:22సుమారు క్రీ.శ. 58
వ్రాయబడి ఉన్న ప్రకారం, అబ్రాహాముకు ఇద్దరు కుమారులు, ఒకడు దాసియైన స్త్రీ వలన, మరొకడు స్వతంత్రురాలైన స్త్రీ వలన పుట్టారు.
- గలతీయులకు 4:23సుమారు క్రీ.శ. 58
దాసియైన స్త్రీ వలన పుట్టిన కుమారుడు శరీరానుసారంగా పుట్టాడు, స్వతంత్రురాలైన స్త్రీ వలన పుట్టిన కుమారుడు దైవిక వాగ్దాన ఫలితంగా పుట్టాడు.
- గలతీయులకు 4:24సుమారు క్రీ.శ. 58
ఈ విషయాలను ఉపమానరీతిగా చెప్పవచ్చు. ఈ స్త్రీలు రెండు నిబంధనలను సూచిస్తున్నారు. ఒక నిబంధన సీనాయి పర్వతం దగ్గరిది, ఇది హాగరు: బానిసలుగా ఉండడానికి పిల్లలను కంటుంది.