కంటెంట్‌కు వెళ్లండి

Jerusalem

753 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: Jerusalem's

31.7700, 35.2300 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Jerusalem ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అతడు యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని యెరూషలేములోని ఇళ్ళన్నిటిని తగలబెట్టాడు. అతడు ప్రతి ప్రాముఖ్య భవనాన్ని తగలబెట్టాడు.

  2. రాజ రక్షక దళాధిపతి క్రింద ఉన్న బబులోను సైన్యమంతా యెరూషలేము చుట్టూ ఉన్న గోడలను పడగొట్టారు.

  3. ఈ ఆరుగురు దావీదుకు హెబ్రోనులో పుట్టినవారు. అక్కడ అతడు ఏడు సంవత్సరాల ఆరు నెలలు పరిపాలించాడు.

  4. యెరూషలేములో అతనికి పుట్టినవారు వీరు: అమ్మీయేలు కుమార్తెయైన బత్షెబకు పుట్టిన షమ్మువ, షోబాబు, నాతాను, సొలొమోను అనే నలుగురు కుమారులు.

  5. యోహానాను అజర్యాకు తండ్రి, సొలొమోను యెరూషలేములో కట్టించిన దేవాలయంలో యాజకునిగా అజర్యా సేవ చేశాడు.

  6. యెహోవా నెబుకద్నెజరుచేత యూదా వారిని, యెరూషలేము వాసులను బందీలుగా పంపించినప్పుడు యెహోజాదాకు బందీగా వెళ్లాడు.

  7. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరాన్ని కట్టించేవరకు, వీరు సమావేశ గుడారం ఎదుట సంగీత సేవ చేశారు. వారికి ఇచ్చిన నియమాల ప్రకారం తమ విధులు నిర్వహించేవారు.

  8. వీరందరు తమ వంశావళి ప్రకారం కుటుంబాలకు పెద్దలు, ప్రముఖులు; వీరు యెరూషలేములో నివసించారు.

  9. షిమ్యా తండ్రియైన మిక్లోతు పుట్టారు. వీరు కూడా యెరూషలేములో తమ బంధువులకు దగ్గరలో నివసించారు.

  10. యూదా, బెన్యామీను, ఎఫ్రాయిం మనష్షే వారిలో యెరూషలేము పట్టణంలో నివసించినవారు:

  11. వీరందరు లేవీయుల కుటుంబ పెద్దలు, తమ వంశం ప్రకారం నాయకులు. వారు యెరూషలేములో నివసించారు.

  12. మిక్లోతు షిమ్యాముకు తండ్రి. వీరు కూడా యెరూషలేములో తమ బంధువులకు దగ్గరలో నివసించారు.

  13. దావీదు ఇశ్రాయేలీయులందరు యెబూసు అని కూడా పిలువబడే యెరూషలేముకు వెళ్లారు. యెబూసీయులు అక్కడ నివసిస్తున్నారు.

  14. దావీదు యెరూషలేములో మరికొందరిని భార్యలుగా చేసుకుని ఇంకా చాలామంది కుమారులకు కుమార్తెలకు తండ్రి అయ్యాడు.

  15. యెరూషలేములో అతనికి పుట్టిన పిల్లల పేర్లు ఇవి: షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను,

  16. యెహోవా మందసాన్ని తాను సిద్ధపరచిన స్థలానికి తీసుకురావడానికి దావీదు ఇశ్రాయేలీయులందరిని యెరూషలేములో సమావేశపరిచాడు.

  17. దావీదు హదదెజెరు సైన్యాధిపతులు ధరించిన బంగారు డాళ్లను తీసుకుని, వాటిని యెరూషలేముకు తెచ్చాడు.

  18. అరామీయులు పారిపోయారని గ్రహించిన అమ్మోనీయులు కూడా యోవాబు సోదరుడైన అబీషై ఎదుట నుండి పారిపోయి పట్టణంలోకి వెళ్లారు. అప్పుడు యోవాబు యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.

  19. వసంతకాలంలో, రాజులు యుద్ధానికి బయలుదేరే కాలంలో, యోవాబు సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. అతడు అమ్మోనీయుల దేశాన్ని నాశనం చేసి రబ్బా పట్టణాన్ని ముట్టడించాడు. అయితే దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు. యోవాబు రబ్బాపై దాడి చేసి దానిని నాశనం చేశాడు.

  20. అక్కడి ప్రజలను బయటకు తీసుకువచ్చి రంపతో, పదునైన ఇనుప పనిముట్లతో, గొడ్డళ్ళతో కఠినమైన పని చేయించాడు. దావీదు అమ్మోనీయుల పట్టణాలన్నిటికి ఈ విధంగా చేశాడు. తర్వాత దావీదు అతని సైన్యమంతా యెరూషలేముకు తిరిగి వచ్చారు.

  21. అయితే రాజు యోవాబుపై తన మాట సాధించుకున్నాడు; కాబట్టి యోవాబు వెళ్లి, ఇశ్రాయేలు దేశమంతా తిరిగి యెరూషలేముకు తిరిగి వచ్చాడు.

  22. దేవుడు యెరూషలేమును నాశనం చేయడానికి ఒక దూతను పంపారు. అయితే ఆ దూత దానిని నాశనం చేస్తున్నప్పుడు, జరిగిన కీడును చూసి యెహోవా మనస్సు కరిగి ప్రజలను నాశనం చేస్తున్న దూతతో, “ఇక చాలు! నీ చేయి వెనుకకు తీసుకో” అని చెప్పారు. ఆ సమయంలో యెహోవా దూత యెబూసీయుడైన ఒర్నాను నూర్పిడి కళ్ళం దగ్గర నిలబడ్డాడు.

  23. దావీదు పైకి చూసినప్పుడు భూమికి ఆకాశానికి మధ్యలో నిలబడి, కత్తి పట్టుకుని దానిని యెరూషలేము మీద చాపి ఉంచిన యెహోవా దూత అతనికి కనిపించాడు. అప్పుడు దావీదు, పెద్దలు గోనెపట్ట కట్టుకుని సాష్టాంగపడ్డారు.

  24. ఎందుకంటే దావీదు, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజలకు నెమ్మది ప్రసాదించి, శాశ్వతంగా యెరూషలేములో నివసించడానికి వచ్చారు కాబట్టి,

  25. దావీదు ఇశ్రాయేలీయుల అధికారులందరిని అనగా, గోత్రాల అధికారులను, రాజు సేవలో ఉన్న సైన్యాల విభాగాల అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజుకు రాజకుమారులకు ఉన్న ఆస్తి మీద, పశువులన్నిటి మీద ఉన్న అధికారులను, రాజపరివారాన్ని, పరాక్రమశాలులను, యుద్ధ వీరులందరిని యెరూషలేములో సమావేశపరిచాడు.