కంటెంట్‌కు వెళ్లండి

Joab

120 వచనాలు · 3 కుటుంబ సభ్యులు

Joab ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దావీదు తన సైన్యాన్ని మూడు భాగాలు చేసి ఒక భాగాన్ని యోవాబు ఆధీనంలో, మరొక భాగాన్ని యోవాబు సోదరుడు, సెరూయా కుమారుడైన అబీషై ఆధీనంలో, ఇంకొక భాగాన్ని గిత్తీయుడైన ఇత్తయి ఆధీనంలో ఉంచాడు. రాజు తన సేనలను పంపుతూ వారితో, “నేనే స్వయంగా మీతో వస్తున్నా” అని చెప్పాడు.

  2. రాజు యోవాబు, అబీషై, ఇత్తయిలను, “నన్ను బట్టి యువకుడైన అబ్షాలోముపై దయ చూపించండి” అని ఆదేశించాడు. అబ్షాలోము గురించి రాజు దళాధిపతులందరికి ఆజ్ఞ ఇవ్వడం సైన్యమంతా విన్నారు.

  3. అది చూసిన ఒకడు యోవాబు దగ్గరకు వెళ్లి, “అబ్షాలోము సింధూర వృక్షానికి వ్రేలాడుతూ ఉండడం నేను చూశాను” అని చెప్పాడు.

  4. యోవాబు ఆ విషయం చెప్పిన వానితో, “ఏంటి! నీవతన్ని చూశావా? మరి వెంటనే అతన్ని నేలమీద పడేలా ఎందుకు కొట్టలేదు? నీవలా చేసి ఉంటే పది షెకెళ్ళ వెండిని ఒక యోధుల నడికట్టును నీకు ఇచ్చి ఉండేవాన్ని” అన్నాడు.

  5. కాని అతడు యోవాబుతో, “నా చేతిలో వెయ్యి షెకెళ్ళ వెండి పెట్టినా, రాజు కుమారునిపై నేను చేయి వేయను. యువకుడైన అబ్షాలోముకు ఎవరూ హాని చేయకుండా కాపాడమని మాకందరికి వినిపించేలా రాజు నీకు, అబీషైకి, ఇత్తయికి ఆజ్ఞ ఇచ్చాడు.

  6. అందుకు యోవాబు, “నీవు చేసే వరకు నేను ఇలా ఎదురుచూస్తూ ఉండను” అని చెప్పి, మూడు ఈటెలు పట్టుకుని వెళ్లి, ఇంకా ప్రాణాలతో ఆ సింధూర వృక్షానికి వ్రేలాడుతున్న అబ్షాలోము గుండెల్లోకి దిగేలా కొట్టాడు.

  7. అలాగే యోవాబు ఆయుధాలు మోసేవారు పదిమంది అబ్షాలోమును చుట్టుముట్టి, అతన్ని కొట్టి చంపారు.

  8. తర్వాత ఇశ్రాయేలీయులను వెంటాడటం ఆపమని యోవాబు బూరధ్వని చేయగానే, సైన్యం తరమడం ఆపి తిరిగి వచ్చింది.

  9. అందుకు యోవాబు, “ఈ వార్తను ఈ రోజు నీవు మోసుకెళ్లవద్దు ఎందుకంటే తన కుమారుడు చనిపోవడం రాజుకు శుభవార్త కాదు కదా! నీవు మరోసారి నా దూతగా వార్తను మోసుకెళ్దువులే” అని అతనితో చెప్పాడు.

  10. తర్వాత యోవాబు కూషీయున్ని పిలిచి, “నీవు వెళ్లి, నీవు చూసిన దానిని రాజుకు చెప్పు” అని చెప్పాడు. ఆ కూషీయుడు యోవాబుకు నమస్కారం చేసి పరిగెత్తుకొని వెళ్లాడు.

  11. అయితే సాదోకు కుమారుడైన అహిమయస్సు యోవాబును, “ఏమైనా కానివ్వండి, నేను కూషీయుని వెంట పరుగెడతాను; నన్ను వెళ్లనివ్వండి” అని మరోసారి వేడుకున్నాడు. కాని యోవాబు, “నా కుమారుడా, నీవెందుకు వెళ్లాలనుకుంటున్నావు? నీకు బహుమతిని తెచ్చే వార్తేమి నీ దగ్గర లేదు” అన్నాడు.

  12. అందుకు రాజు, “యువకుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు. అందుకు అహిమయస్సు, “యోవాబు మీ సేవకుడనైన నన్ను, రాజు సేవకున్ని పంపుతున్నప్పుడు చాలా గందరగోళంగా ఉన్నట్లు నేను చూశాను, అయితే అది ఏంటి అనేది నాకు తెలియదు” అని జవాబిచ్చాడు.

  13. “రాజు అబ్షాలోము గురించి ఏడుస్తూ దుఃఖిస్తున్నాడు” అని ఎవరో యోవాబుకు చెప్పారు.

  14. యోవాబు రాజభవనానికి వెళ్లి, “ఈ రోజు మీరు మీ ప్రాణాలను మీ కుమారుల కుమార్తెల ప్రాణాలను మీ భార్యల, ఉంపుడుగత్తెల ప్రాణాలను రక్షించిన మీ సైన్యమంతటిని అవమానపరిచారు.

  15. తర్వాత అమాశాతో, ‘నీవు నాకు రక్త సంబంధివి కదా! యోవాబు స్థానంలో నిన్ను నా సేనాధిపతిగా నేను చేయకపోతే దేవుడు నన్ను తీవ్రంగా శిక్షిస్తాడు’ అని చెప్పండి” అన్నాడు.

  16. కాబట్టి యోవాబు మనుష్యులు కెరేతీయులు పెలేతీయులు యుద్ధ వీరులందరు అబీషై నాయకత్వంలో యెరూషలేము నుండి బయలుదేరి బిక్రి కుమారుడైన షేబను వెంటాడటానికి వెళ్లారు.

  17. వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు చేరుకున్నపుడు, అమాశా వారిని కలుసుకోడానికి అక్కడికి వచ్చాడు. యోవాబు యుద్ధ వస్త్రాలు ధరించాడు దానిపైన ఉన్న నడికట్టుకు వ్రేలాడుతున్న ఒరలో కత్తి ఉంది. అతడు ముందుకు అడుగు వేసినప్పుడు ఒరలో నుండి కత్తి జారిపడింది.

  18. యోవాబు, “నా సోదరుడా! క్షేమమా?” అని అమాశాను అడిగి అతన్ని ముద్దు పెట్టుకుంటున్నట్లు కుడిచేతితో అతని గడ్డం పట్టుకున్నాడు.

  19. యోవాబు ఎడమ చేతిలో ఉన్న కత్తిని అమాశా చూడలేదు కాబట్టి అజాగ్రత్తగా ఉన్నాడు. యోవాబు కత్తి తీసి అతని కడుపులో పొడవగానే అమాశా ప్రేగులు బయటకు వచ్చి నేల మీద పడి అక్కడే అతడు చనిపోయాడు. అప్పుడు యోవాబు అతని తమ్ముడైన అబీషైలు బిక్రి కుమారుడైన షేబను వెంటాడుతూ వెళ్లారు.

  20. యోవాబు మనుష్యుల్లో ఒకడు అమాశా మృతదేహం దగ్గర నిలబడి, “యోవాబును ఇష్టపడేవారు, దావీదు వైపు ఉన్నవారందరు యోవాబును వెంబడించండి” అన్నాడు.

  21. అమాశా శవాన్ని దారిలో నుండి తీసిన తర్వాత అందరు బిక్రి కుమారుడైన షేబను వెంటాడడానికి యోవాబు వెంట వెళ్లారు.

  22. యోవాబుతో ఉన్న సైన్యమంత వచ్చి, ఆబేల్-బేత్-మయకాలో షేబను ముట్టడించి పట్టణ గోడలకు ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టారు. యోవాబు సైన్యమంతా గోడ పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే,

  23. ఆ పట్టణంలో ఉన్న ఒక తెలివైన స్త్రీ బిగ్గరగా, “వినండి! వినండి! నేను యోవాబుతో మాట్లాడాలి. అతన్ని ఇక్కడకు రమ్మనండి” అని చెప్పింది.

  24. యోవాబు ఆమె దగ్గరకు వెళ్లగా ఆమె, “యోవాబు నీవేనా?” అని అడిగింది. అతడు, “నేనే” అన్నాడు. ఆమె, “నీ సేవకురాలు నీతో చెప్పేది వినండి” అని అన్నది. అతడు, “చెప్పు వింటాను” అన్నాడు.

  25. అందుకు యోవాబు, “నేను నాశనం చేయాలని నిర్మూలం చేయాలని అనుకోవడం లేదు.