God
God ను ప్రస్తావించే వచనాలు
ఈ రోజే నేను ఆకాశం క్రింద ఉన్న అన్ని దేశాలకు మీరంటే భయాన్ని, వణుకుని కలిగించడం మొదలుపెడతాను. వారు మీ గురించి సమాచారాన్ని విని వణుకుతారు; మీ కారణంగా వారు కలవరపడతారు.”
శేయీరులో నివసించే ఏశావు సంతతివారు ఆరులో మోయాబీయులు మాకు చేసినట్టే మా దేవుడైన యెహోవా మాకు ఇస్తున్న దేశానికి వెళ్లడానికి కాలినడకన యొర్దాను దాటి వెళ్లనివ్వండి” అని తెలియజేశాను.
అయితే హెష్బోను రాజైన సీహోను మనం అతని దేశం గుండా వెళ్లడానికి అనుమతించలేదు. ఎందుకంటే ఇప్పుడు జరిగినట్లుగా అతన్ని మీ చేతికి అప్పగించడానికి మీ దేవుడైన యెహోవా అతని మనస్సు కఠినపరచి అతని హృదయాన్ని మొండిగా మార్చారు.
అప్పుడు యెహోవా నాతో అన్నారు, “చూడండి, నేను సీహోనును, అతని దేశాన్ని మీకు అప్పగించడం మొదలుపెట్టాను. అతని దేశాన్ని జయించి స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టండి.”
మన దేవుడైన యెహోవా అతన్ని మనకు అప్పగించారు కాబట్టి అతన్ని, అతని కుమారులను, అతని సైన్యమంతటిని మనం హతం చేశాము.
అర్నోను వాగు ఒడ్డున ఉన్న అరోయేరు నుండి, ఆ వాగు దగ్గర ఉన్న పట్టణం మొదలుపెట్టి గిలాదు వరకు మనలను మించి బలం కలిగిన పట్టణం ఒకటి కూడా లేదు. మన దేవుడైన యెహోవా వాటన్నిటిని మనకు అప్పగించారు.
అయితే మన దేవుడైన యెహోవా ఆజ్ఞ ప్రకారం అమ్మోనీయుల దేశాన్ని కాని యబ్బోకు వాగు లోయలోని ఏ ప్రాంతాన్ని కాని కొండల్లో ఉన్న పట్టణాలను కాని మీరు ఆక్రమించలేదు.
యెహోవా నాతో, “అతనికి భయపడకండి, ఎందుకంటే అతన్ని, అతని సైన్యమంతటిని, అతని దేశాన్ని మీ చేతికి అప్పగించాను. హెష్బోనును పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు అతనికి చేయండి” అని అన్నారు.
కాబట్టి మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును, అతని సైన్యమంతటిని మన చేతికి అప్పగించారు. వారిలో ఎవరిని మిగల్చకుండా అందరిని హతం చేశాము.
ఆ సమయంలో నేను యొర్దాను తూర్పున నివసిస్తున్న గోత్రాలకు మీకు ఇలా ఆజ్ఞాపించాను: “మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోవడానికి మీకు ఈ దేశాన్ని ఇచ్చారు. అయితే మీలో ధృడమైనవారు, యుద్ధానికి సిద్ధపడినవారు ఇతర ఇశ్రాయేలీయులకు ముందుగా నది దాటాలి.
Until the LORD have given rest unto your brethren, as well as unto you, and until they also possess the land which the LORD your God hath given them beyond Jordan: and then shall ye return every man unto his possession, which I have given you.
ఆ సమయంలో నేను యెహోషువకు ఆజ్ఞాపించాను: “నీవు నీ కళ్లారా దేవుడైన యెహోవా ఈ ఇద్దరు రాజులకు చేసిందంతా చూశావు. నీవు వెళ్లబోయే చోటులో ఉన్న అన్ని రాజ్యాలకు యెహోవా అలాగే చేస్తారు.
వారికి నీవు భయపడకు; నీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తారు.”
ఆ సమయంలో నేను యెహోవాను బ్రతిమాలుకున్నాను:
“ప్రభువైన యెహోవా, మీ గొప్పతనాన్ని, మీ బలమైన చేతిని మీ సేవకునికి చూపించడం మొదలుపెట్టారు. ఆకాశంలో గాని భూమిమీదగాని మీరు చేసే పనులు, అద్భుతకార్యాలు చేయగల దేవుడెవరున్నారు?
నేను వెళ్లి యొర్దాను అవతల ఉన్న మంచి దేశాన్ని, మంచి కొండ ప్రాంతాన్ని, లెబానోనును చూడనివ్వండి.”
అయితే మీ కారణంగా యెహోవా నా మీద కోప్పడి, నా మొర వినలేదు. యెహోవా నాతో అన్నారు, “ఇక చాలు, ఈ విషయమై నాతో ఇక మాట్లాడవద్దు.
ఇప్పుడు, ఇశ్రాయేలూ, నేను మీకు బోధించే శాసనాలు చట్టాలను వినండి. మీరు జీవించి, మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలోకి వెళ్లి స్వాధీనం చేసుకోవడానికి వాటిని అనుసరించండి.
నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేన్ని కలుపకూడదు, దాని నుండి దేన్ని తీసివేయకూడదు, కాని నేను మీకు ఇస్తున్న మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించండి.
బయల్-పెయోరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కళ్లారా చూశారు. బయల్-పెయోరును వెంబడించిన వారందరిని మీ దేవుడైన యెహోవా మీ మధ్యలో ఉండకుండా నాశనం చేశారు,
కాని మీ దేవుడైన యెహోవాను నమ్మకంగా పట్టుకుని ఉన్న మీరందరు ఈ రోజు వరకు బ్రతికి ఉన్నారు.
చూడండి, నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు పాటించవలసిన శాసనాలను చట్టాలను నేను మీకు బోధించాను.
మనం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్పప్రజలకు వారి దేవుళ్ళు సమీపంగా ఉంటారు?
హోరేబు దగ్గర మీ దేవుడైన యెహోవా ఎదుట మీరు నిలబడినప్పుడు ఆయన నాతో, “వారు ఆ దేశంలో జీవించినంత వరకు నాకు భయపడడం నేర్చుకొని, వాటిని తమ పిల్లలకు నేర్పేలా వారు నా మాటలు వినడానికి ప్రజలందర్ని సమకూర్చు” అని చెప్పిన రోజును జ్ఞాపకం ఉంచుకోండి.
యెహోవా ఆ అగ్నిలో నుండి మీతో మాట్లాడారు. మీరు మాటల శబ్దం విన్నారు కాని ఏ రూపాన్ని మీరు చూడలేదు; స్వరం మాత్రమే వినిపించింది.