కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా మోషేతో ఇలా చెప్పారు,

  2. మోషే ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు చీట్లు వేసి ఈ దేశాన్ని ఒక వారసత్వంగా కేటాయించాలి. తొమ్మిదిన్నర గోత్రాలకు ఇవ్వమని యెహోవా ఆదేశించారు,

  3. యెహోవా మోషేతో అన్నారు,

  4. కనాను దేశంలో ఇశ్రాయేలీయులకు వారసత్వ భూమిని కేటాయించడానికి యెహోవా ఈ పురుషులను నియమించారు.

  5. మోయాబు సమతల మైదానాల్లో, యెరికోకు ఎదురుగా యొర్దాను అవతలి వైపు ఉన్న ప్రాంతంలో యెహోవా మోషేతో అన్నారు,

  6. తర్వాత యెహోవా మోషేతో ఇలా మాట్లాడారు:

  7. మీరు నివసించే, నేను నివసించే భూమిని అపవిత్రం చేయవద్దు, ఎందుకంటే, యెహోవానైన నేను, ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తాను.’ ”

  8. “చీట్లు వేసి ఇశ్రాయేలీయులకు భూమిని వారసత్వంగా ఇవ్వమని యెహోవా మా ప్రభువుకు ఆజ్ఞాపించినప్పుడు మా సహోదరుడు సెలోఫెహాదు భూ వారసత్వాన్ని అతని కుమార్తెలకు ఇమ్మని ఆజ్ఞాపించారు.

  9. అప్పుడు యెహోవా ఆజ్ఞమేరకు మోషే ఇశ్రాయేలీయులను ఆదేశించాడు: “యోసేపు సంతతివారి గోత్రం వారు తెచ్చిన ఫిర్యాదు సరియైనదే.

  10. సెలోఫెహాదు కుమార్తెల గురించి యెహోవా ఇలా ఆజ్ఞాపించారు: వారు తమకు ఇష్టం వచ్చిన వారిని పెళ్ళి చేసుకోవచ్చు, కానీ అది వారి తండ్రి గోత్ర వంశం వారై ఉండాలి.

  11. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం సెలోఫెహాదు కుమార్తెలు చేశారు.

  12. ఇవి మోయాబు సమతల మైదానంలో, యెరికోకు ఎదురుగా యొర్దాను అవతలి వైపు ప్రాంతంలో యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలు, నియమాలు ఇచ్చారు.

  13. నలభైయవ సంవత్సరం, పదకొండవ నెల మొదటి రోజున మోషే ఇశ్రాయేలీయులను ఉద్దేశించి యెహోవా ఆజ్ఞాపించినదంతా వారికి ప్రకటించాడు.

  14. దేవుడైన యెహోవా హోరేబు దగ్గర మనతో ఇలా మాట్లాడారు, “మీరు ఈ పర్వతం దగ్గర చాలా కాలం నుండి ఉన్నారు.

  15. చూడండి, ఈ దేశాన్ని నేను మీకిచ్చాను. కాబట్టి మీరు వెళ్లి యెహోవా మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు, వారి తర్వాత వారి సంతానానికి ఇస్తానని ప్రమాణం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి.”

  16. ఆ సమయంలో నేను మీతో, “నేను ఒంటరిగా మోయలేనంత భారంగా మీరున్నారు.

  17. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింపజేశారు కాబట్టి ఇప్పుడు మీరు ఆకాశ నక్షత్రాల్లా లెక్కించలేనంతగా ఉన్నారు.

  18. మీ పూర్వికుల దేవుడైన యెహోవా మిమ్మల్ని వెయ్యిరెట్లు ఎక్కువ చేసి ఆయన వాగ్దానం చేసినట్లుగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక!

  19. తీర్పు తీర్చడంలో పక్షపాతం చూపించవద్దు; పేదవారైనా గొప్పవారైనా సరే ఒకే రీతిగా వినాలి, తీర్పు దేవునికి సంబంధించింది కాబట్టి ఎవరికి భయపడవద్దు. మీకు పరిష్కరించడానికి కష్టంగా ఉన్న సమస్యను నా దగ్గరకు తీసుకురండి, నేను దానిని వింటాను” అని చెప్పాను.

  20. తర్వాత మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించిన ప్రకారం, హోరేబు నుండి బయలుదేరి మీరు చూసిన భయంకరమైన మహారణ్యం గుండా వచ్చి, అమోరీయుల కొండ ప్రాంతం ద్వారా ప్రయాణించి కాదేషు బర్నియాకు చేరుకున్నాము.

  21. అప్పుడు నేను మీతో, “మన దేవుడైన యెహోవా మనకు ఇస్తున్న అమోరీయుల కొండ ప్రాంతానికి మీరు చేరుకున్నారు.

  22. చూడండి, మీ దేవుడైన యెహోవా మీకు ఈ దేశాన్ని ఇచ్చారు. మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీతో చెప్పినట్లుగా, వెళ్లి దానిని స్వాధీనపరచుకోండి. భయపడకండి; అధైర్యపడకండి” అని చెప్పాను.

  23. వారు ఆ దేశపు పండ్లు కొన్ని మన దగ్గరకు తెచ్చి, “మన దేవుడైన యెహోవా మనకిస్తున్న దేశం మంచిది” అని చెప్పారు.

  24. కాని మీరు వెళ్లడానికి ఇష్టపడలేదు; మీ దేవుడైన యెహోవా ఆజ్ఞకు తిరుగుబాటు చేశారు.

  25. మీ గుడారాల్లో సణుగుతూ, “యెహోవా మనలను ద్వేషించి మనలను నాశనం చేయడానికి అమోరీయుల చేతికి మనలను అప్పగించడానికి ఈజిప్టు నుండి మనలను బయటకు తీసుకువచ్చారు.