కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆయన మీకు తన నిబంధనను ప్రకటించారు, అనగా మీరు పాటించాలని పది ఆజ్ఞలు మీకు ఆజ్ఞాపించి, వాటిని రెండు రాతి పలకలమీద వ్రాశారు.

  2. మీరు యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు అనుసరించాల్సిన శాసనాలను చట్టాలను మీకు నేర్పించమని యెహోవా నాకు ఆదేశించారు.

  3. అయితే చాలా జాగ్రతగా ఉండండి! హోరేబులో యెహోవా అగ్ని మధ్యలో నుండి మీతో మాట్లాడిన రోజున మీరు ఏ రూపాన్ని చూడలేదు.

  4. మీరు ఆకాశం వైపు కళ్ళెత్తి ఆకాశ సైన్యాలైన సూర్యచంద్ర నక్షత్రాలను చూసిన వాటిచే ఆకర్షించబడి, మీ దేవుడైన యెహోవా ఆకాశం క్రింద సమస్త దేశాల కోసం పంచి ఇచ్చిన వాటికి నమస్కరించి వాటికి సేవచేయకుండ మీరు జాగ్రత్తపడండి.

  5. మీరైతే, యెహోవా మిమ్మల్ని పట్టుకుని నేడు మీరున్నట్లుగా ఆయన వారసత్వ ప్రజలుగా ఉండడానికి ఇనుప కొలిమిలో నుండి, ఈజిప్టు నుండి, మిమ్మల్ని బయటకు తీసుకువచ్చారు.

  6. మీ కారణంగా యెహోవా నా మీద కోప్పడి నేను ఈ యొర్దాను దాటకూడదని, మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న మంచి దేశంలో ప్రవేశించకూడదని ఆయన ప్రమాణము చేశారు.

  7. మీ దేవుడైన యెహోవా మీతో చేసిన నిబంధనను మరచిపోకుండా జాగ్రత్తపడండి; మీ దేవుడైన యెహోవా నిషేధించిన వాటి యొక్క ఎలాంటి రూపంలోను మీ కోసం విగ్రహాన్ని చేసుకోకండి.

  8. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా దహించు అగ్ని, ఆయన రోషం గల దేవుడు.

  9. మీకు పిల్లలు మనవళ్లు కలిగి, ఆ దేశంలో చాలా కాలం నివసించిన తర్వాత, మీరు అప్పుడు చెడిపోయి ఏ రూపంలోనైనా విగ్రహాన్ని చేసుకుని మీ దేవుడైన యెహోవా కళ్ళెదుట చెడు చేసి ఆయనకు కోపం పుట్టిస్తే,

  10. యెహోవా జనాంగాల మధ్యలో మిమ్మల్ని చెదరగొడతారు, యెహోవా మిమ్మల్ని తోలివేసే దేశాల మధ్యలో మీలో కొద్దిమంది మాత్రమే మిగులుతారు.

  11. అయితే అక్కడినుండి మీరు మీ దేవుడైన యెహోవాను వెదికితే, మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో వెదికినప్పుడు ఆయన మీకు దొరుకుతారు.

  12. మీరు దుఃఖంలో ఉన్నప్పుడు, ఈ సంగతులన్ని మీకు జరిగిన తర్వాత, అప్పుడు చివరి రోజుల్లో మీరు మీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వింటారు.

  13. మీ దేవుడైన యెహోవా జాలిగల దేవుడు; కాబట్టి ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు, మిమ్మల్ని నాశనం చేయడు, ఆయన మీ పూర్వికులతో ప్రమాణం ద్వార నిశ్చయం చేసిన నిబంధనను మరచిపోరు.

  14. దేవుడు భూమి మీద నరుని సృజించిన రోజు నుండి, మీకంటే ముందు ఉన్న గత కాలం గురించి అడగండి; ఆకాశం యొక్క ఒక చివరి నుండి మరో చివరి వరకు అడగండి. ఇలాంటి గొప్ప కార్యం ఎప్పుడైనా జరిగిందా? లేదా అటువంటి దాని గురించి ఎప్పుడైనా విన్నారా?

  15. అగ్ని మధ్యలో నుండి మాట్లాడిన దేవుని స్వరాన్ని మీరు విన్నట్లు మరి ఏ ప్రజలైనా విని బ్రతికారా?

  16. మీ దేవుడైన యెహోవా ఈజిప్టులో మీ కళ్ళెదుట మీ కోసం శోధనలతో, సూచకక్రియలతో, అద్భుతాలతో, యుద్ధంతో, బలమైన హస్తంతో, చాచిన చేతితో మహా భయంకరమైన కార్యాలతో సమస్త కార్యాలను చేసినట్లు ఏ దేవుడైన తన కోసం ఒక దేశం నుండి మరొక దేశాన్ని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడా?

  17. యెహోవాయే దేవుడని ఆయన తప్ప మరి ఎవరు లేరని మీరు తెలుసుకునేలా ఇవన్నీ మీకు చూపబడ్డాయి.

  18. మిమ్మల్ని క్రమపరచడానికి ఆకాశం నుండి తన స్వరాన్ని మీకు వినిపించారు. భూమి మీద మీకు తన గొప్ప అగ్నిని చూపించారు, ఆ అగ్ని మధ్యలో నుండి ఆయన మాటలు మీరు విన్నారు.

  19. ఆయన మీ పూర్వికులను ప్రేమించి వారి సంతతిని ఎంపిక చేసుకున్నారు కాబట్టి, మీకంటే బలమైన గొప్ప దేశాలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టి, వారి దేశంలోనికి మిమ్మల్ని తీసుకువచ్చి, ఈ రోజు ఇస్తున్నట్లుగా వారి దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి ఆయన తన సన్నిధితో, తన మహాబలంతో మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించారు.

  20. కాబట్టి పైనున్న పరలోకంలో గాని, క్రిందున్న భూమిమీద గాని, యెహోవాయే దేవుడని, మరొక దేవుడు లేడని ఈ రోజే మీరు గుర్తించి, మీ హృదయాల్లో జ్ఞాపకం ఉంచుకోండి.

  21. మీకు, మీ తర్వాత మీ సంతతివారికి క్షేమం కలగడానికి యెహోవా శాశ్వతంగా మీకు ఇస్తున్న దేశంలో మీరు అధిక కాలం జీవించేలా ఈ రోజు నేను మీకు ఇస్తున్న శాసనాలను ఆజ్ఞలను పాటించండి.

  22. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశారు.

  23. యెహోవా ఈ నిబంధన చేసింది మన పూర్వికులతో కాదు, మనతో, ఈ రోజు సజీవంగా ఉన్న మనందరితో చేశారు.

  24. ఆ పర్వతం మీద అగ్నిలో నుండి యెహోవా మీతో ముఖాముఖిగా మాట్లాడారు.

  25. అయితే మీరు ఆ అగ్నికి భయపడి పర్వతం ఎక్కలేదు కాబట్టి యెహోవా మాట మీకు తెలియజేయడానికి నేను యెహోవాకు మీకు మధ్యలో నిలబడ్డాను. ఆయన ఇలా అన్నారు: