కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారు నన్ను గాని, తండ్రిని గాని తెలుసుకోలేదు కాబట్టి వారు ఇలాంటి పనులను చేస్తారు.

  2. ఇప్పుడు నేను నన్ను పంపినవాని దగ్గరకు వెళ్తున్నాను. అయినా, ‘నీవు ఎక్కడికి వెళ్తున్నావు?’ అని మీలో ఎవ్వరూ నన్ను అడగడం లేదు.

  3. Of righteousness, because I go to my Father, and ye see me no more;

  4. నా తండ్రికి ఉన్నవన్నీ నావే. అందుకే ఆత్మ నా నుండి వినే వాటినే మీకు తెలియజేస్తాడని నేను చెప్పాను.”

  5. యేసు ఇంకా చెప్తూ, “ఇంకా కొద్ది సమయం తర్వాత మీరు నన్ను చూడరు, ఆ తర్వాత మరికొద్ది సమయానికి మీరు నన్ను చూస్తారు.”

  6. అప్పుడు ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు, “ఆయన చెప్తున్న, ‘నేను నా తండ్రి దగ్గరకు వెళ్తున్నాను’ కాబట్టి ‘కొద్ది కాలం మీరు నన్ను చూడరు. ఆ తర్వాత కొంతకాలానికి మీరు నన్ను చూస్తారు’ అనే మాటలకు అర్థం ఏమైయుంటుంది?” అని చెప్పుకొన్నారు.

  7. ఆ రోజు మీరు ఇక నన్ను దేని గురించి అడగరు. మీరు నా పేరట నా తండ్రిని ఏమి అడిగినా అది మీకు ఇస్తారని నేను మీతో చెప్పేది నిజం.

  8. “ఇంతవరకు నేను మీతో ఉపమానాలతో చెప్పాను. కానీ ఒక సమయం వస్తుంది అప్పుడు నా తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియజేస్తాను.

  9. ఆ రోజు మీరు నా పేరిట అడుగుతారు. అయితే మీ కోసం నేను తండ్రిని అడుగుతానని చెప్పడం లేదు.

  10. ఎందుకంటే మీరు నన్ను ప్రేమించి, నేను దేవుని దగ్గరి నుండి వచ్చానని నమ్మారు కాబట్టి తండ్రి తానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.

  11. నేను తండ్రి దగ్గరి నుండి బయలుదేరి ఈ లోకానికి వచ్చాను; ఇప్పుడు నేను లోకాన్ని విడిచి తండ్రి దగ్గరకు తిరిగి వెళ్తున్నాను” అన్నారు.

  12. నీకు అన్ని సంగతులు తెలుసని, ఎవరు నిన్ను ప్రశ్నించే అవసరం లేదని మేము గ్రహిస్తున్నాము. దీనిని బట్టి నీవు దేవుని నుండి వచ్చావని మేము నమ్ముతున్నాం” అన్నారు.

  13. “ఒక సమయం రాబోతుంది, అది ఇప్పటికే వచ్చేసింది అప్పుడు మీలో ప్రతి ఒక్కరు నన్ను ఒంటరిగా విడిచి, ఎవరి ఇంటికి వారు చెదరిపోతారు. అయినాసరే నేను ఒంటరి వానిని కాను, ఎందుకంటే నా తండ్రి నాతో ఉన్నాడు.

  14. యేసు ఈ మాటలు చెప్పిన తర్వాత ఆకాశం వైపు చూస్తూ ఇలా ప్రార్థించారు: “తండ్రీ, సమయం వచ్చింది. నీ కుమారుడు నిన్ను మహిమపరిచేలా నీ కుమారుని మహిమపరచు.

  15. నీవు నీ కుమారునికి అప్పగించిన వారందరికి నిత్యజీవం అనుగ్రహించడానికి ప్రజలందరి మీద ఆయనకు అధికారం ఇచ్చావు.

  16. నీవు మాత్రమే నిజ దేవుడవని, యేసు క్రీస్తు నీవు పంపినవాడని వారు తెలుసుకోవడమే నిత్యజీవం.

  17. నీవు నాకు ఇచ్చిన పనిని పూర్తి చేసి భూమి మీద నిన్ను మహిమపరిచాను.

  18. తండ్రీ, ఈ లోక ఆరంభానికి ముందు నీతో నాకు ఉండిన మహిమతో ఇప్పుడు నన్ను నీ సన్నిధిలో మహిమపరచు.

  19. “ఈ లోకంలో నుండి నీవు నాకు ఇచ్చిన వారికి నేను నిన్ను తెలియపరిచాను. వారు నీవారు; నీవు వారిని నాకు ఇచ్చావు వారు నీ వాక్యాన్ని పాటించారు.

  20. ఇప్పుడు వారు నీవు నాకు ఇచ్చినవన్ని నీ దగ్గర నుండే వచ్చాయని తెలుసుకున్నారు.

  21. ఎందుకంటే నీవు నాకు ఇచ్చిన మాటలను నేను వారికి ఇచ్చాను. వారు వాటిని అంగీకరించి నిజంగా నేను నీ దగ్గర నుండి వచ్చానని వారు తెలుసుకుని నీవు నన్ను పంపావని నమ్మారు.

  22. నేను వారి కోసం ప్రార్థిస్తున్నాను. నేను లోకం కోసం ప్రార్థన చేయడం లేదు, కాని నీవు నాకు ఇచ్చినవారు నీవారు కాబట్టి వారి కోసం ప్రార్థిస్తున్నాను.

  23. నాకు ఉన్నవన్నీ నీవి, నీకు ఉన్నవన్నీ నావి. వారి ద్వారా నాకు మహిమ కలిగింది.

  24. నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను, కాబట్టి లోకంలో ఇక ఉండను. కాని వారైతే ఇంకా లోకంలోనే ఉన్నారు. పరిశుద్ధ తండ్రీ, నీ పేరిట అనగా నీవు నాకిచ్చిన పేరిట వారిని కాపాడు. అప్పుడు మనం ఏకమై ఉన్నట్లు వారు ఏకమై ఉంటారు.

  25. నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు ఇచ్చిన పేరిట వారిని రక్షించి భద్రంగా ఉంచాను. లేఖనాలు నెరవేరేలా నాశనానికి దిగజారిన ఒక్కడు తప్ప మరి ఎవరు తప్పిపోలేదు.