కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నేను దేశాలన్నిటిని సమకూర్చి, యెహోషాపాతు లోయలోకి నడిపిస్తాను. నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులకు వారు చేసిన దానిని బట్టి, అక్కడ వారికి న్యాయ విచారణ జరిగిస్తాను, ఎందుకంటే వారు నా ప్రజలను దేశాల్లో చెదరగొట్టారు నా దేశాన్ని విభజించారు.

  2. వారు నా ప్రజల కోసం చీట్లు వేసి అబ్బాయిలను ఇచ్చి వేశ్యలను తీసుకున్నారు. అమ్మాయిలను అమ్మి ద్రాక్షరసం కొన్నారు.

  3. “తూరూ, సీదోనూ, ఫిలిష్తియా ప్రాంతాలందరూ, నా మీద మీకున్న వ్యతిరేకత ఏంటి? నేను చేసిన దానికి నాకు ప్రతీకారం చేస్తున్నారా? ఒకవేళ మీరు నాకు ప్రతీకారం చేస్తే, మీరు చేసిన దాన్ని త్వరలోనే, చాలా వేగంగా మీ తల మీదికి రప్పిస్తాను.

  4. ఎందుకంటే మీరు నా వెండి బంగారాలను తీసుకెళ్లారు, నా శ్రేష్ఠమైన వస్తువులను మీ గుళ్ళకు తీసుకెళ్లారు.

  5. “చూడండి, మీరు వారిని అమ్మి వేసిన స్థలాల నుండి వారిని రప్పిస్తాను. మీరు చేసిన దాన్ని మీ తల మీదికే రప్పిస్తాను.

  6. నేను మీ కుమారులను, కుమార్తెలను యూదా ప్రజలకు అమ్ముతాను, వారు దూర దేశస్థులైన షెబాయీయులకు వారిని అమ్మివేస్తారు.” యెహోవా చెప్పింది ఇదే.

  7. ప్రతి వైపు ఉన్న అన్ని దేశాల్లారా, త్వరగా రండి, అక్కడ సమకూడండి. యెహోవా, మీ వీరులను తీసుకురండి!

  8. “దేశాలు లేవాలి; అవి యెహోషాపాతు లోయ వైపు వెళ్లాలి నలుదిశల ఉన్న అన్ని దేశాలకు తీర్పు తీర్చడానికి నేను అక్కడ కూర్చుంటాను.

  9. తీర్పు తీర్చే లోయలో ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నారు, ఎందుకంటే తీర్పు తీర్చే లోయలో యెహోవా దినం ఆసన్నమైంది.

  10. యెహోవా సీయోను నుండి గర్జిస్తారు, యెరూషలేములో నుండి ఉరుముతారు; భూమ్యాకాశాలు వణకుతాయి, అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయంగా ఉంటారు, ఇశ్రాయేలు ప్రజలకు దుర్గంగా ఉంటారు.

  11. “అప్పుడు మీ దేవుడైన యెహోవానైన నేను నా పవిత్ర కొండయైన సీయోను మీద నివసిస్తానని మీరు తెలుసుకుంటారు. యెరూషలేము పరిశుద్ధంగా ఉంటుంది; ఇక ఎన్నడు ఇతర దేశాల సైన్యాలు దానిని ఆక్రమించరు.

  12. “ఆ రోజు పర్వతాల నుండి క్రొత్త ద్రాక్షరసం ప్రవహిస్తుంది, కొండల నుండి పాలు ప్రవహిస్తాయి; యూదాలోని వాగులన్నిటిలో నీళ్లు పారతాయి. యెహోవా మందిరంలో నుండి ఒక ఊట ప్రవహిస్తూ, షిత్తీము లోయను తడుపుతుంది.

  13. వారు చిందించిన నిర్దోషుల రక్తాన్ని బట్టి ప్రతీకారం తీసుకోకుండా వారిని వదిలేయాలా? నేను ప్రతీకారం చేస్తాను.”

  14. ఆమోసు ఇలా చెప్పాడు: “యెహోవా సీయోను నుండి గర్జిస్తున్నారు యెరూషలేము నుండి ఉరుముతున్నారు; కాపరుల పచ్చికబయళ్లు ఎండిపోతున్నాయి, కర్మెలు పర్వత శిఖరం వాడిపోతుంది.”

  15. యెహోవా ఇలా చెప్తున్నారు: “దమస్కు చేసిన మూడు పాపాల గురించి, దాని నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే అది గిలాదును ఇనుప పనిముట్లతో నూర్చింది.

  16. నేను హజాయేలు ఇంటి మీదికి అగ్నిని పంపుతాను, అది బెన్-హదదు కోటలను దగ్ధం చేస్తుంది.

  17. దమస్కు ద్వారాన్ని విరగ్గొడతాను; ఆవెను లోయలో ఉన్న రాజును నాశనం చేస్తాను అతడు బేత్-ఏదెనులో రాజదండం పట్టుకున్నవాడు. అరాము ప్రజలు కీరుకు బందీలుగా వెళ్తారు” అని యెహోవా చెప్తున్నారు.

  18. యెహోవా ఇలా చెప్తున్నారు: “గాజా చేసిన మూడు పాపాల గురించి, నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే అది సమాజమంతటిని బందీలుగా తీసుకెళ్లి ఎదోముకు అమ్మివేసింది.

  19. నేను గాజా ప్రాకారాల మీదికి అగ్నిని పంపుతాను, అది దాని కోటలను దగ్ధం చేస్తుంది.

  20. నేను అష్డోదు రాజును నాశనం చేస్తాను, అతడు అష్కెలోనులో రాజదండం పట్టుకున్నవాడు. నేను ఫిలిష్తీయులలో చివరి వారు మరణించే వరకు, నేను ఎక్రోనుకు విరుద్ధంగా నా చేతిని ఉంచుతాను” అని ప్రభువైన యెహోవా చెప్తున్నారు.

  21. యెహోవా ఇలా చెప్తున్నారు: “తూరు చేసిన మూడు పాపాల గురించి, దాని నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే సహోదర ఒప్పందాన్ని పరిగణించకుండా, అది సమాజమంతటిని బందీలుగా ఎదోముకు అమ్మివేసింది.

  22. నేను తూరు ప్రాకారాల మీదికి అగ్నిని పంపుతాను, అది దాని కోటలను దగ్ధం చేస్తుంది.”

  23. యెహోవా చెప్పే మాట ఇదే: “ఎదోము చేసిన మూడు పాపాల గురించి, అతని నాలుగు పాపాల గురించి నేను వారిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే అతడు తన సోదరున్ని ఖడ్గంతో వెంటాడాడు, ఆ దేశ స్త్రీలను చంపేశాడు, అతని కోపం అధికమవుతూ ఉంది, ఎప్పుడూ రగులుతూ ఉంది.

  24. నేను తేమాను మీదికి అగ్నిని పంపుతాను, అది బొస్రాలోని కోటలను దగ్ధం చేస్తుంది.”

  25. యెహోవా ఇలా చెప్తున్నారు: “అమ్మోను చేసిన మూడు పాపాల గురించి, అతని నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే అతడు తన సరిహద్దులను విశాల పరచడానికి, గిలాదులో ఉన్న గర్భిణి స్త్రీల కడుపులను చీల్చాడు.