God
God ను ప్రస్తావించే వచనాలు
నేను రబ్బా ప్రాకారాలను తగలబెడతాను, యుద్ధం రోజున యుద్ధ నినాదాల మధ్యలో, తుఫాను రోజున పెనుగాలి వీస్తూ ఉన్నప్పుడు, అగ్ని దాని కోటలను దగ్ధం చేస్తుంది.
దాని రాజు, తన రాజ పరివారంతో పాటు బందీగా వెళ్తాడు” అని యెహోవా చెప్తున్నారు.
యెహోవా చెప్పే మాట ఇదే: “మోయాబు చేసిన మూడు పాపాల గురించి, అతని నాలుగు పాపాల గురించి నేను అతన్ని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే అతడు ఎదోము రాజు ఎముకలను కాల్చి బూడిద చేశాడు.
నేను మోయాబు మీదికి అగ్నిని పంపుతాను, అది కెరీయోతు కోటలను దగ్ధం చేస్తుంది. యుద్ధ నినాదాల మధ్యలో, బూర శబ్దం వినబడినప్పుడు, మోయాబు గొప్ప కలవరంతో అంతరిస్తుంది.
నేను దాని పరిపాలకున్ని నిర్మూలిస్తాను, అతనితో పాటు దాని అధిపతులందరినీ హతం చేస్తాను,” అని యెహోవా చెప్తున్నారు.
యెహోవా చెప్పే మాట ఇదే: “యూదా వారు చేసిన మూడు పాపాల గురించి, వారి నాలుగు పాపాల గురించి నేను వారిని తప్పకుండా శిక్షిస్తాను, ఎందుకంటే వారు యెహోవా ఉపదేశాలను విసర్జించారు, ఆయన శాసనాలను పాటించలేదు, వారి పూర్వికులు అనుసరించిన అబద్ధ దేవుళ్ళను నమ్ముకొని, వారి వల్ల దారి తప్పారు.
నేను యూదా మీదికి అగ్నిని పంపుతాను, అది యెరూషలేము కోటలను దగ్ధం చేస్తుంది.”
యెహోవా చెప్పే మాట ఇదే: “ఇశ్రాయేలు చేసిన మూడు పాపాల గురించి, వారి నాలుగు పాపాల గురించి నేను వారిని తప్పకుండా శిక్షిస్తాను, వారు నిర్దోషులను వెండి కోసం అమ్మారు, బీదలను చెప్పుల కోసం అమ్మారు.
వారు నేల మట్టిని త్రొక్కినట్టు బీదల తలలను త్రొక్కుతున్నారు హింసించబడే వారికి న్యాయం జరగనివ్వలేదు. తండ్రీ, కుమారులు ఒకే స్త్రీ దగ్గరకు వెళ్లారు అలా నా పరిశుద్ధ నామాన్ని అవమానపరిచారు.
“దేవదారు వృక్షమంత ఎత్తుగా, అయినా నేను వారి సింధూర వృక్షమంత బలంగా ఉన్న, అమోరీయులను వారి ఎదుట ఉండకుండా నేను నాశనం చేశాను. నేను పైనున్న వారి ఫలాన్ని, క్రిందున్న వారి వేరును నాశనం చేశాను.
అమోరీయుల దేశాన్ని మీరు స్వాధీనపరచుకోవాలని, నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చి, నలభై సంవత్సరాలు అరణ్యంలో నడిపించాను.
“అంతేకాక నేను మీ సంతానం నుండి ప్రవక్తలను, మీ యవకులలో నుండి నాజీరులను లేవనెత్తాను. ఇశ్రాయేలీయులారా! ఇది నిజం కాదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
“కాబట్టి ధాన్యపు మోపులతో నిండిన బండి నేలను అణగద్రొక్కినట్టు, ఇప్పుడు నేను మిమ్మల్ని అణగద్రొక్కుతాను.
ఆ రోజున ధైర్యవంతులైన వీరులు కూడా దిగంబరులై పారిపోతారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
ఇశ్రాయేలీయులారా! యెహోవా ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన కుటుంబమంతటి గురించి నేను పలికిన ఈ మాట వినండి:
“భూలోకంలోని కుటుంబాలన్నిటి నుండి మిమ్మల్ని మాత్రమే ఎన్నుకున్నాను. కాబట్టి మీరు చేసిన పాపాలన్నిటిని బట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తాను.”
పట్టణంలో బూరధ్వని వినబడితే, ప్రజలు వణకరా? పట్టణంలో విపత్తు వచ్చినప్పుడు అది యెహోవా పంపింది కాదా?
తన సేవకులైన ప్రవక్తలకు తన ప్రణాళికను తెలియజేయకుండా ప్రభువైన యెహోవా ఏదీ చేయరు.
సింహం గర్జించింది, భయపడని వారెవరు? ప్రభువైన యెహోవా చెప్పారు దానిని ప్రవచించకుండ ఉన్నవారెవరు?
“సరియైనది ఎలా చేయాలో వారికి తెలియదు,” అని యెహోవా చెప్తున్నారు, “వారు తమ కోటలలో తాము కొల్లగొట్టిన దోపుడుసొమ్మును దాచుకుంటారు.”
కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “శత్రువు నీ ప్రాంతంలో చొరబడతాడు, మీ దుర్గాలను పడగొడతాడు, మీ కోటలను దోచుకుంటాడు.”
యెహోవా చెప్పే మాట ఇదే: “గొర్రెల కాపరి సింహం నోటి నుండి విడిపించేటప్పుడు, దాని రెండు కాళ్లను గాని లేదా చెవి ముక్కను గాని విడిపించినట్లుగా, సమరయలో మంచాల మీద పట్టు దిండ్లమీద కూర్చుని ఉన్న, ఇశ్రాయేలీయులు రక్షించబడతారు.”
“దీనిని విని, యాకోబు వారసులకు వ్యతిరేకంగా తెలియజేయండి” అని ప్రభువు, సైన్యాల యెహోవా దేవుడు చెప్తున్నారు.
“ఇశ్రాయేలు పాపాలను శిక్షించే రోజున బేతేలులోని బలిపీఠాలను నేను నాశనం చేస్తాను; ఆ బలిపీఠపు కొమ్మలు విరగ్గొట్టబడి నేలరాలుతాయి.
చలికాలపు విడిది భవనాన్ని, ఎండకాలపు విడిది భవనాన్ని పడగొడతాను; ఏనుగు దంతంతో అలంకరించబడ్డ భవనాలు నాశనమవుతాయి గొప్ప భవనాలు నిర్మూలించబడతాయి,” అని యెహోవా చెప్తున్నారు.