కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దహనబలులకు గొర్రెలను నా దగ్గరకు తీసుకురాలేదు, నీ బలులతో నన్ను ఘనపరచలేదు. భోజనార్పణల కోసం నేను నీ మీద భారం మోపలేదు ధూపం వేయమని నిన్ను విసిగించలేదు.

  2. నీవు నా కోసం సువాసనగల లవంగపు చెక్కను డబ్బుతో కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వుతో నన్ను తృప్తిపరచలేదు. కాని నీ పాపాలతో నన్ను విసిగించావు నీ దోషాలతో నేను అలసిపోయేలా చేశావు.

  3. “నేను నేనే నా ఇష్టానుసారంగా నీ పాపాలను తుడిచివేస్తున్నాను, నీ పాపాలను జ్ఞాపకం చేసుకోను.

  4. నాకు గతంలో జరిగింది గుర్తు చేయి మనం కలిసి వాదించుకుందాం; నిన్ను నీవు నీతిమంతునిగా రుజువు చేసుకో.

  5. నీ మూలపురుషుడు పాపం చేశాడు; నీకు బోధించమని నేను పంపినవారు నా మీద తిరుగుబాటు చేశారు.

  6. కాబట్టి నేను నీ మందిరంలోని ప్రధానులను అవమానించాను; నేను యాకోబును నాశనానికి ఇశ్రాయేలును దూషణకు అప్పగించాను.

  7. “అయితే నా సేవకుడవైన యాకోబూ, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలూ, విను.

  8. నిన్ను పుట్టించి, గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేసేవాడైన యెహోవా చెప్పే మాట ఇదే: నా సేవకుడవైన యాకోబూ, నేను ఏర్పరచుకున్న యెషూరూను భయపడకు.

  9. నేను దాహంతో ఉన్న దేశం మీద నీళ్లు, ఎండిన భూమి మీద నీటి ప్రవాహాలను కుమ్మరిస్తాను. నీ సంతానంపై నా ఆత్మను, నీ వారసులపై నా ఆశీర్వాదాలను కుమ్మరిస్తాను.

  10. కొంతమంది, ‘నేను యెహోవా వాడను’ అని అంటారు; ఇతరులు యాకోబు పేరుతో తమను తాము పిలుచుకుంటారు; ఇంకా కొందరు తమ చేతిపై ‘యెహోవా వారము’ అని రాసుకుని ఇశ్రాయేలు పేరును పెట్టుకుంటారు.

  11. “ఇశ్రాయేలీయుల రాజు, విమోచకుడు, సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: నేను మొదటివాడను చివరివాడను; నేను తప్ప ఏ దేవుడు లేడు.

  12. నాలా ఎవరు ఉన్నారు? అతడు ప్రకటించాలి. నేను నా మొదటి ప్రజలను నియమించినప్పటి నుండి ఏమి జరిగిందో, ఇంకా ఏమి జరగబోతుందో అతడు తెలియజేయాలి, నా ముందు ఉంచాలి. అవును ఏమి జరగబోతుందో వారు తెలియజేయాలి.

  13. మీరు బెదరకండి, భయపడకండి. చాలా కాలం క్రితం నేను ఈ విషయం చెప్పి మీకు ప్రకటించలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప, ఆశ్రయ దుర్గమేదీ లేదు. ఉన్నట్లు నేనెరుగను.”

  14. “యాకోబూ, వీటిని గుర్తు చేసుకో, ఎందుకంటే, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు. నేను నిన్ను నిర్మించాను, నీవు నా సేవకుడవు; ఇశ్రాయేలూ, నేను నిన్ను మరచిపోను.

  15. మేఘం విడిపోవునట్లు నీ దోషాలను ఉదయకాలపు మంచు మబ్బు తొలగిపోయేలా నీ పాపాలను, తుడిచివేశాను. నేను నిన్ను విడిపించాను. నా దగ్గరకు తిరిగి రా.”

  16. యెహోవా దీనిని చేశారు కాబట్టి ఆకాశాల్లారా, ఆనందంతో పాడండి; భూమి లోతుల్లారా, బిగ్గరగా అరవండి. పర్వతాల్లారా, అరణ్యమా, నీలో ఉన్న ప్రతి చెట్టు సంగీత నాదం చేయండి. యెహోవా యాకోబును విడిపించారు ఆయన ఇశ్రాయేలులో తన మహిమను చూపిస్తారు.

  17. “నిన్ను గర్భంలో రూపించిన నీ విమోచకుడైన యెహోవా చెప్పే మాట ఇదే: “యెహోవాను నేనే అన్నిటిని సృష్టించాను, నేనే ఆకాశాలను విశాలపరిచాను నేను నేనే భూమికి ఆకారమిచ్చాను.

  18. నా సేవకుని మాటలను స్థిరపరచి నా దూతల ఆలోచనను నెరవేర్చేది నేనే. “యెరూషలేము నివాస స్థలంగా అవుతుందని యూదా పట్టణాలు మరలా కట్టబడతాయని వాటిలో పాడైన స్థలాలను బాగుచేయబడతాయని చెప్పాను.

  19. నేను కోరెషు గురించి, ‘అతడు నా కాపరి, నా ఇష్టాన్నంతటిని నెరవేరుస్తాడు’ అని చెప్పాను. అతడు, ‘యెరూషలేము తిరిగి కట్టబడాలి’ అని ‘మందిరం పునాదులు వేయబడాలి’ అని చెప్తాడు.”

  20. కోరెషు పక్షంగా దేశాలను జయించడానికి రాజులను నిరాయుధులుగా చేయడానికి అతని ఎదుట ద్వారాలు మూయబడకుండా తలుపులు తీయడానికి నేను అతని కుడిచేతిని పట్టుకున్నాను. తన అభిషిక్తుడైన ఈ కోరెషుతో యెహోవా చెప్పే మాట ఇదే:

  21. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనేనని నీవు తెలుసుకునేలా రహస్య స్థలాల్లో ఉంచిన నిధులను దాచబడిన ధనాన్ని నీకిస్తాను.

  22. నా సేవకుడైన యాకోబు కోసం నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు కోసం నేను పేరు పెట్టి నిన్ను పిలిచాను. నీవు నన్ను గుర్తించకపోయినా నీకు గౌరవ బిరుదు ఇచ్చాను.

  23. నేను యెహోవాను, వేరే ఏ దేవుడు లేడు; నేను తప్ప ఏ దేవుడు లేడు. నీవు నన్ను గుర్తించకపోయినా నేను నిన్ను బలపరుస్తాను.

  24. అప్పుడు సూర్యోదయ దిక్కునుండి సూర్యాస్తమయ స్థలం వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని ప్రజలు తెలుసుకుంటారు. యెహోవాను నేనే; నేను తప్ప వేరే ఎవరూ లేడు.

  25. నేను వెలుగును రూపిస్తాను, చీకటిని కలుగజేస్తాను, నేను వృద్ధిని తెస్తాను, విపత్తును కలుగజేస్తాను. యెహోవానైన నేను వీటన్నిటిని చేస్తాను.