కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. భూమి అంచుల నుండి నేను మిమ్మల్ని తీసుకువచ్చాను, మారుమూల ప్రాంతాల నుండి పిలుచుకున్నాను. నేను అన్నాను, ‘నీవు నా సేవకుడవు’; నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను త్రోసివేయలేదు.

  2. కాబట్టి భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను; దిగులుపడకు, నేను నీ దేవుడను. నేను నిన్ను బలపరచి నీకు సహాయం చేస్తాను; నీతిగల నా కుడిచేతితో నిన్ను ఆదరిస్తాను.

  3. నీ దేవుడనైన యెహోవాను, నేను నీ కుడిచేతిని పట్టుకుని, భయపడకు అని నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాను.

  4. భయపడకు, పురుగులాంటి యాకోబూ! కొద్ది మందిగా ఉన్న ఇశ్రాయేలూ, భయపడకు. నేను నీకు సహాయం చేస్తాను” అని నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా చెప్తున్నారు.

  5. “చూడు, నేను నిన్ను పదునుగా ఉండి, అనేకమైన పళ్ళు కలిగిన క్రొత్త నూర్చే పలకగా చేస్తాను. నీవు పర్వతాలను నూర్చి నలగ్గొడతావు, కొండలను పొట్టులా చేస్తావు.

  6. నీవు వాటిని చెరగగా, గాలికి కొట్టుకుపోతాయి, సుడిగాలి వాటిని చెదరగొడుతుంది. అయితే నీవు యెహోవాలో సంతోషిస్తావు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడతావు.

  7. “పేదవారు, దరిద్రులు నీళ్లు వెదకుతారు కాని వారికి నీరు దొరకక వారి నాలుకలు దాహంతో ఎండిపోతాయి. అయితే, యెహోవానైన నేను వారికి జవాబిస్తాను; ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడిచిపెట్టను.

  8. నేను చెట్లులేని ఎత్తు స్థలాల మీద నదులను ప్రవహింపచేస్తాను, లోయల మధ్యలో ఊటలు ఉబికేలా చేస్తాను. ఎడారిని నీటి మడుగుగా, ఎండిపోయిన నేలను ఊటలుగా చేస్తాను.

  9. నేను ఎడారిలో దేవదారు వృక్షాలు, తుమ్మచెట్లు, గొంజిచెట్లు, ఓలీవ చెట్లు నాటుతాను. అరణ్యంలో సరళ వృక్షాలను, ఈత చెట్లను, నేరేడు చెట్లను కలిపి నాటుతాను.

  10. అప్పుడు ప్రజలు అది చూసి యెహోవా చేయి దీనిని చేసిందని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే దీనిని కలుగజేశారని తెలుసుకుని స్పష్టంగా గ్రహిస్తారు.

  11. “మీ వాదన చెప్పండి” అని యెహోవా అంటున్నారు. “మీ రుజువులు చూపించండి” అని యాకోబు రాజు అంటున్నారు.

  12. “ఉత్తరం వైపు నుండి నేను ఒకడిని రేపుతున్నాను. నా పేరిట ప్రార్థించే వాడొకడు సూర్యోదయ దిక్కునుండి వస్తున్నాడు. కుమ్మరి మట్టిని త్రొక్కినట్లు ఒకడు బురదను త్రొక్కినట్లు అతడు పాలకులను త్రొక్కుతాడు.

  13. ‘చూడండి, వారిక్కడ ఉన్నారు!’ అని మొదట సీయోనుతో చెప్పింది నేనే. యెరూషలేముకు శుభవార్త చెప్పడానికి నేను ఒక దూతను పంపాను.

  14. నేను చూడగా అక్కడ ఎవరూ లేరు, దేవుళ్ళలో సలహా చెప్పడానికి ఎవరూ లేరు, నేను వారిని ప్రశ్నిస్తే జవాబు ఇవ్వడానికి ఎవరూ లేరు.

  15. “ఇదిగో, నేను నిలబెట్టుకునే నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, ఇతని గురించి నేను ఆనందిస్తున్నాను; ఇతనిపై నా ఆత్మను ఉంచుతాను. ఇతడు దేశాలకు న్యాయం జరిగిస్తాడు.

  16. అతడు కేకలు వేయడు, అరవడు, వీధుల్లో ఆయన స్వరం వినబడనీయడు.

  17. నలిగిన రెల్లును అతడు విరువడు, మసకగా వెలుగుతున్న వత్తిని ఆర్పడు. అతడు నమ్మకంగా న్యాయాన్ని చేస్తాడు;

  18. భూమి మీద న్యాయాన్ని స్థాపించే వరకు అతడు అలసిపోడు నిరుత్సాహపడడు. అతని బోధలో ద్వీపాలు నిరీక్షణ కలిగి ఉంటాయి.”

  19. ఆకాశాలను సృష్టించి వాటిని విశాలపరచి, భూమిని దానిలో పుట్టిన సమస్తాన్ని విస్తరింపజేసి, దానిపై ఉన్న ప్రజలకు ఊపిరిని, దానిపై నడిచే వారికి జీవాన్ని ఇస్తున్న దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే:

  20. “యెహోవానైన నేను నీతిలో నిన్ను పిలిచాను; నేను నీ చేయి పట్టుకుంటాను. గుడ్డివారి కళ్లు తెరవడానికి, చెరసాలలోని ఖైదీలను విడిపించడానికి, చీకటి గుహల్లో నివసించేవారిని బయటకు తీసుకురావడానికి, నేను నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా, యూదేతరులకు వెలుగుగా చేస్తాను.

  21. “నేనే యెహోవాను. అదే నా పేరు! నా మహిమను నేను మరొకరికి ఇవ్వను నాకు రావలసిన స్తుతులను విగ్రహాలకు చెందనివ్వను.

  22. చూడండి, గతంలో చెప్పిన సంగతులు జరిగాయి. క్రొత్త సంగతులు నేను తెలియజేస్తున్నాను. అవి జరగకముందే వాటిని మీకు తెలియజేస్తాను.”

  23. సముద్రయానం చేసేవారలారా, సముద్రంలోని సమస్తమా, ద్వీపాల్లారా, వాటిలో నివసించేవారలారా! యెహోవాకు క్రొత్త గీతం పాడండి. భూమి అంచుల నుండి ఆయనను స్తుతించండి.

  24. వారు యెహోవాకు మహిమ చెల్లించి ద్వీపాల్లో ఆయన స్తుతిని ప్రకటించాలి.

  25. యెహోవా శూరునిలా బయలుదేరతారు యోధునిలా ఆయన తన రోషాన్ని రేకెత్తిస్తారు; ఆయన హుంకరిస్తూ యుద్ధ నినాదం చేస్తూ, తన శత్రువుల మీద గెలుస్తారు.