కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “చాలా కాలం నేను మౌనంగా ఉన్నాను, నేను నిశ్శబ్దంగా ఉంటూ నన్ను నేను అణచుకున్నాను. కాని ఇప్పుడు ప్రసవవేదన పడే స్త్రీలా నేను కేకలువేస్తూ, రొప్పుతూ, ఊపిరి పీల్చుకుంటున్నాను.

  2. పర్వతాలను, కొండలను పాడుచేస్తాను. వాటి వృక్ష సంపద అంతటిని ఎండిపోయేలా చేస్తాను; నదులను ద్వీపాలుగా చేస్తాను మడుగులను ఆరిపోయేలా చేస్తాను.

  3. గ్రుడ్డివారిని వారికి తెలియని దారుల్లో తీసుకెళ్తాను, తెలియని మార్గాల్లో నేను వారిని నడిపిస్తాను. వారి ఎదుట చీకటిని వెలుగుగా, వంకర దారులను చక్కగా చేస్తాను. నేను ఈ కార్యాలు చేస్తాను; నేను వారిని విడిచిపెట్టను.

  4. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపిన దూత కాకుండా మరి ఎవడు చెవిటివాడు? నాతో నిబంధన ఉన్నవాని కన్నా ఎవడు గ్రుడ్డివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు?

  5. యెహోవా తన నీతిని బట్టి తన ధర్మశాస్త్రాన్ని గొప్పగా, మహిమగలదిగా చేయడానికి ఇష్టపడ్డారు.

  6. యాకోబును దోపుడు సొమ్ముగా అప్పగించింది, ఇశ్రాయేలును దోపిడి చేసేవారికి అప్పగించింది ఎవరు? యెహోవా కాదా, మేము ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు కాదా? వారు ఆయన మార్గాలను అనుసరించలేదు ఆయన ధర్మశాస్త్రానికి లోబడలేదు.

  7. కాబట్టి ఆయన వారిమీద తన కోపాగ్నిని యుద్ధ వినాశనాన్నీ కుమ్మరించారు. అది వారి చుట్టూ మంటలతో చుట్టుకుంది, అయినా వారు గ్రహించలేదు; అది వారిని కాల్చింది, కాని వారు దాన్ని పట్టించుకోలేదు.

  8. అయితే యాకోబూ, నిన్ను సృజించిన యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను రూపించినవాడు ఇలా చెప్తున్నారు: “భయపడకు నేను నిన్ను విడిపించాను. పేరు పెట్టి నిన్ను పిలిచాను; నీవు నా వాడవు.

  9. నీవు నీళ్లను దాటుతున్నప్పుడు నేను నీతో ఉంటాను; నీవు నదులను దాటుతున్నప్పుడు అవి నిన్ను ముంచవు. నీవు అగ్ని గుండా నడుస్తున్నప్పుడు నీవు కాలిపోవు. మంటలు నిన్ను కాల్చవు.

  10. యెహోవానైన నేను నీకు దేవుడను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నీ రక్షకుడిని. నీ క్రయధనంగా ఈజిప్టును ఇచ్చాను, నీకు బదులుగా కూషు సెబాలను ఇచ్చాను.

  11. నీవు నా దృష్టిలో విలువైనవాడవు, ఘనుడవు కాబట్టి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు బదులుగా మనుష్యులను అప్పగిస్తాను నీ ప్రాణానికి బదులుగా దేశాలను అప్పగిస్తాను.

  12. భయపడకు, నేను నీతో ఉన్నాను; తూర్పు నుండి నీ సంతానాన్ని తీసుకువస్తాను, పడమటి నుండి నిన్ను సమకూరుస్తాను.

  13. ‘వారిని అప్పగించు’ అని ఉత్తరదిక్కుకు, ‘వారిని ఆపవద్దు’ అని దక్షిణ దిక్కుకు చెప్తాను. దూరం నుండి నా కుమారులను భూమి అంచుల నుండి నా కుమార్తెలను తీసుకురండి.

  14. నా పేరుపెట్టబడిన వారందరిని, నా మహిమ కోసం నేను సృష్టించిన వారిని, నేను రూపించి కలుగజేసిన వారిని తీసుకురండి.”

  15. “మీరు నా సాక్షులు” అని యెహోవా చెప్తున్నారు, “నేను ఏర్పరచుకున్న నా సేవకుడవు, తద్వారా నీవు నన్ను తెలుసుకొని, నన్ను నమ్మి, నేనే ఆయననని నీవు గ్రహిస్తావు. నాకు ముందుగా ఏ దేవుడు లేడు. నా తర్వాత ఏ దేవుడు ఉండడు.

  16. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.

  17. బయలుపరిచింది రక్షించింది ప్రకటించింది నేనే మీ మధ్య ఉన్నది నేనే, ఏ ఇతర దేవుడో కాదు. నేనే దేవుడను మీరు నా సాక్షులు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  18. “అవును, పూర్వ రోజులనుండి ఉన్నవాడను నేనే. నా చేతిలో నుండి ఎవరు విడిపించలేరు. నేను చేసే పనిని తిప్పగలవారు ఎవరు?” అని యెహోవా చెప్తున్నారు.

  19. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మీ విమోచకుడైన యెహోవా చెప్పే మాట ఇదే: “మీ కోసం నేను బబులోనుకు సైన్యాన్ని పంపి బబులోనీయులందరూ వేటిని బట్టి గర్వించేవారో వారిని ఆ ఓడలలో పారిపోయేలా చేస్తాను.

  20. యెహోవానైన నేనే మీకు పరిశుద్ధ దేవుడను. ఇశ్రాయేలును సృజించిన నేనే మీకు రాజును.”

  21. యెహోవా ఇలా అంటున్నారు: సముద్రంలో మార్గాన్ని ఏర్పరచినవాడు, గొప్ప జలాల్లో దారిని కలుగజేసినవాడు,

  22. చూడండి, నేను ఒక క్రొత్త పని చేస్తున్నాను! ఇప్పుడే అది మొలకెత్తుతుంది; మీరు దానిని గ్రహించలేదా? నేను అరణ్యంలో దారి కలుగజేస్తున్నాను, ఎడారిలో నదులు ప్రవహించేలా చేస్తున్నాను.

  23. నేను ఏర్పరచుకున్న నా ప్రజలు త్రాగడానికి అరణ్యంలో నీళ్లు ఇస్తున్నాను ఎడారిలో నదులు ప్రవహించేలా చేస్తున్నాను కాబట్టి అడవి జంతువులు, నక్కలు నిప్పుకోళ్లు నన్ను ఘనపరుస్తాయి.

  24. వారు నా కోసం నేను నిర్మించుకున్న ప్రజలు, వారు నా సుత్తిని ప్రకటిస్తారు.

  25. “అయినా యాకోబూ, నీవు నాకు మొరపెట్టలేదు. ఇశ్రాయేలూ, నా గురించి నీవు విసిగిపోయావు.