కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “పులియని రొట్టెల పండుగ మీరు జరుపుకోవాలి, ఎందుకంటే ఈ రోజునే నేను మీ విభాగాలను ఈజిప్టులో నుండి బయటకు తీసుకువచ్చాను. ఈ రోజును మీరు రాబోయే తరాలకు ఒక నిత్య కట్టుబాటుగా జరుపుకోవాలి.

  2. యెహోవా ఈజిప్టువారిని హతం చేయడానికి దేశమంతా సంచరిస్తూ, ద్వారబంధపు పైకమ్మికి రెండు నిలువు కమ్మీలకు పూయబడిన రక్తాన్ని చూసి ఆయన ఆ ద్వారాన్ని దాటి వెళ్తారు. సంహారకుడు మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని చంపడానికి ఆయన అనుమతించడు.

  3. యెహోవా వాగ్దానం చేసినట్లుగా ఆయన మీకు ఇస్తానన్న దేశంలోనికి మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీనిని ఆచరించాలి.

  4. మీరు వారితో, ‘ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఈజిప్టువారిని చంపుతున్నప్పుడు ఈజిప్టులో ఉన్న ఇశ్రాయేలీయుల ఇళ్ళను ఆయన ఏమీ చేయకుండా దాటి వెళ్లారు’ అని చెప్పాలి.” అప్పుడు ప్రజలు తలలు వంచి ఆరాధించారు.

  5. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించిన విధంగానే ఇశ్రాయేలీయులు చేశారు.

  6. అర్థరాత్రి సమయంలో సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదటి సంతానం మొదలుకొని చెరసాలలోని ఖైదీ యొక్క మొదటి సంతానం వరకు ఈజిప్టులోని మొదటి సంతానమంతటిని పశువుల మొదటి సంతానాన్ని యెహోవా హతం చేశారు.

  7. ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, “లేవండి! మీరు ఇశ్రాయేలు ప్రజలు వెంటనే బయలుదేరి నా ప్రజలను వదిలి వెళ్లిపొండి! మీరు కోరినట్లే వెళ్లి యెహోవాను ఆరాధించండి.

  8. యెహోవా ఈజిప్టువారికి ఇశ్రాయేలీయుల పట్ల దయ పుట్టించారు కాబట్టి వారు తమను అడిగి వాటన్నిటిని వారికి ఇచ్చారు. ఆ విధంగా వారు ఈజిప్టువారిని దోచుకున్నారు.

  9. సరిగ్గా 430 సంవత్సరాలు గడిచిన రోజునే యెహోవా సేనలన్ని ఈజిప్టు దేశం నుండి బయలుదేరి వెళ్లిపోయాయి.

  10. ఈజిప్టు నుండి బయటకు తీసుకురావడానికి ఆ రాత్రి యెహోవా మెళకువగా ఉన్నందున, ప్రతి సంవత్సరం ఈ రాత్రి ఇశ్రాయేలీయులందరు రాబోయే తరాల కోసం ప్రభువును గౌరవించడానికి మెలకువగా ఉండాలి.

  11. యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు, “పస్కాను ఆచరించడానికి పాటించవలసిన నియమాలు ఇవే: “విదేశీయులెవరు దీనిని తినకూడదు.

  12. “మీ మధ్య నివసించే విదేశీయులు యెహోవా పస్కాను ఆచరించాలనుకుంటే అతని ఇంట్లోని మగవారందరు సున్నతి పొందాలి. అప్పుడు వారు దేశంలో పుట్టినవారిలా దానిలో పాల్గొనవచ్చు. సున్నతి పొందని మగవారు దీనిని తినకూడదు.

  13. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించిన ప్రకారమే ఇశ్రాయేలీయులందరు చేశారు.

  14. అదే రోజు యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి విభజనల ప్రకారం ఈజిప్టు నుండి బయటకు రప్పించారు.

  15. యెహోవా మోషేతో ఇలా చెప్పారు,

  16. “ప్రతీ మొదటి మగ సంతానాన్ని నాకు ప్రతిష్ఠించండి. ఇశ్రాయేలీయుల మనుష్యుల్లోనైనా పశువుల్లోనైనా ప్రతి గర్భం యొక్క మొదటి సంతానం నాదే.”

  17. అప్పుడు మోషే ప్రజలతో ఇలా అన్నాడు, “మీరు బానిసలుగా ఉన్న ఈజిప్టు నుండి మీరు బయటకు వచ్చిన ఈ రోజును మీరు స్మారకోత్సవంగా జరుపుకోండి, ఎందుకంటే యెహోవా తన బలమైన హస్తంతో దాని నుండి మిమ్మల్ని బయటకు రప్పించారు. పులిసిన దేన్ని తినకూడదు.

  18. యెహోవా కనానీయుల హిత్తీయుల అమోరీయుల హివ్వీయుల యెబూసీయుల దేశం మీకు ఇస్తానని మీ పూర్వికులకు ప్రమాణం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని రప్పించినప్పుడు ఈ నెలలో మీరు ఈ సేవలు జరిగించాలి.

  19. ఏడు రోజులు మీరు పులియని రొట్టెలు తినాలి, ఏడవ రోజున యెహోవాకు పండుగ చేయాలి.

  20. ఆ రోజున, ‘నేను ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దానిని బట్టి నేను ఇది చేస్తున్నాను’ అని నీ కుమారునితో చెప్పాలి.

  21. యెహోవా తన బలమైన హస్తంతో మిమ్మల్ని ఈజిప్టులో నుండి బయటకు రప్పించారు కాబట్టి యెహోవా ధర్మశాస్త్రం మీ నోటిలో ఉండేలా ఈ సంస్కారం మీ చేతి మీద ఒక గుర్తుగా మీ నుదుటి మీద ఒక జ్ఞాపకంగా ఉంటుంది.

  22. ప్రతి సంవత్సరం నిర్ణయ కాలంలో మీరు ఈ సంస్కారాన్ని ఆచరించాలి.

  23. “యెహోవా మీకు మీ పూర్వికులకు ప్రమాణంతో వాగ్దానం చేసిన ప్రకారం కనాను దేశంలోనికి మిమ్మల్ని తీసుకువచ్చి దానిని మీకు ఇచ్చిన తర్వాత,

  24. ప్రతి గర్భం యొక్క మొదటి సంతానాన్ని మీరు యెహోవాకు వేరుగా ఉంచాలి. మీ పశువుల మొదటి మగపిల్లలు యెహోవాకు చెందుతాయి.

  25. “భవిష్యత్తులో మీ కుమారుడు, ‘దీని అర్థమేంటి?’ అని మిమ్మల్ని అడిగినప్పుడు, మీరు వానితో ఇలా చెప్పాలి, ‘బలమైన హస్తంతో యెహోవా బానిస దేశమైన ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు రప్పించారు.