కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దేవా! వారి నోటి పళ్ళు విరగ్గొట్టండి; యెహోవా! ఈ కొదమ సింహాల కోరలను ఊడదీయండి.

  2. మీ కుండలకు ముండ్లకంపల సెగ తగలకముందే, పచ్చివైనా ఎండినవైనా అంటే చిన్నా పెద్దా తేడా లేకుండ దుష్టులు తుడిచివేయబడతారు.

  3. తర్వాత ప్రజలు అది చూసి, “నీతిమంతులకు తప్పక బహుమానం ఉంటుంది; ఖచ్చితంగా ఈ లోకంలో తీర్పు తీర్చే దేవుడు ఉన్నారు” అంటారు.

  4. సంగీత దర్శకునికి. “నిర్మూలం చేయకు” అనే రాగం మీద పాడదగినది. ఒక మిక్తము. దావీదును చంపడానికి సౌలు పంపినవారు అతని ఇంటి దగ్గర పొంచి ఉన్నప్పుడు వ్రాసినది. దేవా! నా శత్రువుల నుండి నన్ను విడిపించండి; నా మీద దాడి చేసేవారికి వ్యతిరేకంగా నా కోటగా ఉండండి.

  5. నా కోసం వారు ఎలా పొంచి ఉన్నారో చూడండి! యెహోవా, చేయని నేరం గాని పాపం గాని లేకుండానే భయంకరమైన పురుషులు నాపై కుట్ర చేస్తున్నారు.

  6. సైన్యాల యెహోవా దేవా, ఇశ్రాయేలు దేవా! సర్వ దేశాలను శిక్షించడానికి లేవండి; దుష్టులైన దేశద్రోహులకు దయ చూపకండి. సెలా

  7. కాని యెహోవా! మీరు వారిని చూసి నవ్వుతారు; ఆ దేశాలన్నిటిని చూసి, పరిహసిస్తారు.

  8. మీరే నా బలం, మీ కోసమే నేను వేచి ఉంటాను; దేవా, మీరు, నాకు ఎత్తైన కోట,

  9. తన మారని ప్రేమను బట్టి, నా దేవుడు నాతో ఉంటారు. ఆయన నాకు ముందుగా వెళ్తారు నన్ను అపవాదు చేసిన వారిపై నేను సంతోషించేలా చేస్తారు.

  10. కాని వారిని చంపకండి, ప్రభువా మా డాలు, వారు చస్తే నా ప్రజలు మరచిపోతారు. మీ బలముతో వారిని వేర్లతో పెకిలించి వారిని అణచివేయండి.

  11. మీ ఉగ్రతలో వారిని దహించివేయండి, వారు ఇక లేకుండునంతగా వారిని దహించివేయండి. అప్పుడు దేవుడు యాకోబును పరిపాలిస్తున్నారని భూదిగంతాల వరకు తెలియపరచబడుతుంది. సెలా

  12. కానీ నేను మీ బలాన్ని గురించి పాడతాను, ఉదయం మీ ప్రేమను గురించి పాడతాను; ఎందుకంటే మీరు నా కోట, కష్ట సమయాల్లో నా ఆశ్రయము.

  13. మీరు నా బలం, నేను మీకు స్తుతిగానం చేస్తున్నాను; దేవా, మీరు, నా కోట, నన్ను ప్రేమించే నా దేవుడు.

  14. సంగీత దర్శకునికి. “నిబంధన పుష్పం” అనే రాగం మీద పాడదగినది. దావీదు శ్రేష్ఠమైన కీర్తన. దావీదు అరాము నహరయీము వారితోను అరాము సోబా వారితోను యుద్ధము చేయగా యోవాబు ఉప్పు లోయలో పన్నెండువేలమంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు వ్రాసినది. దేవా, మీరు మమ్మల్ని తిరస్కరించారు, మాపై విరుచుకుపడ్డారు; మీరు కోపంగా ఉన్నారు మమ్మల్ని మళ్ళీ బాగుచేయండి!

  15. మీరు దేశాన్ని కంపింపజేసి దానిని చీల్చివేశారు; దాని పగుళ్లను పూడ్చండి, ఎందుకంటే అది కంపిస్తూ ఉంది.

  16. మీరు మీ ప్రజలకు కఠిన సమయాలను చూపించారు; మమ్మల్ని తడబడేలా చేసే మద్యాన్ని మీరు మాకు ఇచ్చారు.

  17. సత్యం నిమిత్తం ఎత్తి పట్టుకోవడానికి మీకు భయపడేవారికి మీరొక జెండాను ఇచ్చారు. సెలా

  18. మీరు ప్రేమించేవారు విడిపించబడేలా, మీ కుడిచేతితో మమ్మల్ని రక్షించి మాకు సాయం చేయండి.

  19. దేవుడు తన పరిశుద్ధాలయం నుండి మాట్లాడిన మాట: “విజయంతో నేను షెకెమును పంచుతాను సుక్కోతు లోయను కొలుస్తాను.

  20. మోయాబు నా కాళ్లు కడుక్కునే పళ్లెం, ఎదోము మీద నా చెప్పు విసిరివేస్తాను, ఫిలిష్తియా గురించి విజయధ్వని చేస్తాను.”

  21. దేవా, ఇప్పుడు మమ్మల్ని విసర్జించింది మీరు కాదా? మా సేనలతో వెళ్లక మానింది మీరు కాదా?

  22. దేవునితో కలిసి మేము విజయం సాధిస్తాం, ఆయన మా శత్రువులను అణగద్రొక్కుతారు.

  23. సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన. ఓ దేవా! నా మనవి వినండి; నా ప్రార్థన ఆలకించండి.

  24. భూదిగంతాలలో నుండి నేను మీకు మొరపెడతాను, నా హృదయం క్రుంగినప్పుడు నేను మొరపెడతాను; నాకన్నా ఎత్తైన కొండ వైపు నన్ను నడిపించండి.

  25. ఎందుకంటే మీరే నాకు ఆశ్రయం, శత్రువులు చేరుకోలేని ఒక బలమైన గోపురము.