God
God ను ప్రస్తావించే వచనాలు
అప్పుడు అతిక్రమం చేసేవారికి మీ మార్గాలను బోధిస్తాను, తద్వార పాపులు మీ దగ్గరకు తిరిగి వస్తారు.
మీరు దేవుడు, నా రక్షకుడు, ఓ దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపించండి, నా నాలుక మీ నీతిని గురించి పాడుతుంది.
ప్రభువా, నా పెదవులను తెరవండి, నా నోరు మీ స్తుతిని ప్రకటిస్తుంది.
మీరు బలులను బట్టి ఆనందించరు, లేకపోతే నేను తెచ్చేవాన్ని; మీరు దహనబలులను ఇష్టపడరు.
విరిగిన ఆత్మ దేవునికి ఇష్టమైన బలి; పశ్చాత్తాపంతో విరిగిన హృదయాన్ని దేవా, మీరు నిరాకరించరు.
మీ దయతో సీయోనుకు మంచి చేయండి; యెరూషలేము గోడలు కట్టించండి.
అప్పుడు మీరు నీతిమంతుల బలులలో, దహన బలులలో, సర్వాంగ హోమములలో ఆనందిస్తారు; అప్పుడు మీ బలిపీఠం మీద ఎద్దులు అర్పించబడతాయి.
సంగీత దర్శకునికి. దావీదు ధ్యానకీర్తన. ఎదోమీయుడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి–దావీదు అహీమెలెకు ఇంటికి వెళ్లాడని అతనితో చెప్పినప్పుడు దావీదు ఈ కీర్తన రచించాడు. బలాఢ్యుడా, చేసిన కీడు గురించి ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నావు? దేవుని దృష్టిలో అవమానకరమైన నీవు, రోజంతా ఎందుకు ప్రగల్భాలు పలుకుతావు?
ఖచ్చితంగా దేవుడు నిన్ను నిత్యనాశనానికి గురి చేస్తారు: ఆయన నిన్ను మీ గుడారంలో నుండి పెరికివేస్తారు; సజీవుల దేశంలో నుండి నిన్ను పెరికివేస్తారు. సెలా
“ఇతన్ని చూడండి, దేవున్ని తన బలమైన కోటగా చేసుకోకుండ తనకున్న సంపదలను నమ్ముకుని ఇతరులను నాశనం చేస్తూ బలపడ్డాడు!”
కానీ నేను దేవుని నివాసంలో పచ్చని ఒలీవ చెట్టులా ఉన్నాను; నేను ఎల్లప్పుడు, మారని దేవుని ప్రేమను నమ్ముతాను.
మీరు చేసిందానికి నేను ఎల్లప్పుడు మీ భక్తుల ఎదుట మిమ్మల్ని స్తుతిస్తాను. మీ నామం ఉత్తమమైనది, కాబట్టి నేను మీ నామంలో నిరీక్షణ కలిగి ఉన్నాను.
సంగీత దర్శకునికి. మహలతు అనే రాగం మీద పాడదగినది. దావీదు ధ్యానకీర్తన. “దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారు. వారు అవినీతిపరులు, వారి మార్గాలు నీచమైనవి; మంచి చేసేవారు ఒక్కరు లేరు.
అర్థం చేసుకునేవారు, దేవున్ని వెదకేవారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు పరలోకం నుండి మనుష్యులందరిని పరిశీలించి చూస్తున్నారు
కీడుచేసే వీరందరికి ఏమీ తెలీదా? వారు రొట్టె తింటున్నట్లు నా ప్రజలను మ్రింగివేస్తున్నారు; వారు ఎన్నడు దేవునికి మొరపెట్టరు.
అయితే భయపడడానికి ఏమిలేని దగ్గర, వారు, భయంతో మునిగిపోయి ఉన్నారు. మీమీద దాడి చేసిన వారి ఎముకలను దేవుడు చెదరగొట్టారు; దేవుడు వారిని తృణీకరించారు, కాబట్టి మీరు వారిని సిగ్గుపడేలా చేశారు.
సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ వస్తుంది! దేవుడు తన ప్రజలను తిరిగి రప్పించినప్పుడు, యాకోబు సంతోషించును గాక! ఇశ్రాయేలు ఆనందంగా ఉండును గాక!
సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. దావీదు ధ్యానకీర్తన. జీఫీయులు వచ్చి–దావీదు మాలో దాగి ఉండడం లేదా? అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించినది. ఓ దేవా, మీ నామమును బట్టి నన్ను రక్షించండి; మీ బలాన్నిబట్టి శిక్షా విముక్తిని చేయండి.
ఓ దేవా! నా ప్రార్థన వినండి; నా నోటి మాటలను ఆలకించండి.
అపరిచితులు నాపై దాడి చేస్తున్నారు; దయలేని మనుష్యులు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు వారు దేవుడంటే గౌరవం లేని మనుష్యులు. సెలా
ఖచ్చితంగా దేవుడే నాకు సహాయం; ప్రభువే నన్ను సంరక్షించేవారు.
యెహోవా, నేను మీకు స్వేచ్ఛార్పణలు అర్పిస్తాను; మీ నామాన్ని స్తుతిస్తాను, ఎందుకంటే అది మంచిది.
మీరు ఇబ్బందులన్నిటి నుండి నన్ను విడిపించారు, నా కళ్లు నా శత్రువుల మీదికి విజయోత్సాహంతో చూశాయి.
సంగీత దర్శకునికి.తంతివాద్యాలతో పాడదగినది. దావీదు ధ్యానకీర్తన. ఓ దేవా! నా ప్రార్థన ఆలకించండి, నా విజ్ఞప్తిని విస్మరించకండి;
నాకు పట్టణంలో హింస, గొడవలు కనబడుతున్నాయి, ప్రభువా, దుష్టులను గందరగోళానికి గురి చేయండి, వారి మాటలను తారుమారు చేయండి.