కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సైన్యాల యెహోవా మనతో ఉన్నారు; యాకోబు దేవుడు మనకు కోట. సెలా

  2. రండి యెహోవా చేసిన క్రియలను చూడండి, లోకంలో నాశనాన్ని ఆయన ఎలా తెస్తారో చూడండి.

  3. ఆ కొన నుండి ఈ కొనదాకా భూమి మీద యుద్ధాలు జరగకుండా ఆయనే ఆపివేస్తారు. విల్లును విరుస్తారు, ఈటెను ముక్కలు చేస్తారు; రథాలను అగ్నితో కాల్చేస్తారు.

  4. “ఊరకుండండి, నేనే దేవున్ని అని తెలుసుకోండి; దేశాల్లో నేను హెచ్చింపబడతాను, భూమి మీద నేను హెచ్చింపబడతాను.”

  5. సైన్యాల యెహోవా మనతో ఉన్నారు; యాకోబు దేవుడు మనకు కోట. సెలా

  6. సంగీత దర్శకునికి. కోరహు కుమారుల కీర్తన. సర్వ దేశాల్లారా, చప్పట్లు కొట్టండి; దేవునికి ఆనందంతో కేకలు వేయండి.

  7. మహోన్నతుడైన యెహోవా భయంకరుడు, భూమి అంతటికి ఆయన గొప్ప రాజు.

  8. మన వారసత్వాన్ని మన కోసం ఏర్పాటు చేశారు. అది తాను ప్రేమించిన యాకోబు గర్వకారణము. సెలా

  9. దేవుడు జయధ్వనుల మధ్య ఆరోహణమయ్యారు, యెహోవా బూరధ్వనుల మధ్య ఆరోహణమయ్యారు.

  10. దేవునికి స్తుతి గానాలు చేయండి, స్తుతులు పాడండి; మన రాజుకు స్తుతి గానాలు చేయండి, స్తుతులు పాడండి.

  11. దేవుడు భూమి అంతటికి రాజు; ఆయనకు స్తుతికీర్తన పాడండి.

  12. దేవుడు దేశాలను పరిపాలిస్తున్నారు; దేవుడు తన పవిత్ర సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు.

  13. దేశాల అధిపతులు సమకూడతారు అబ్రాహాము దేవుని ప్రజలుగా సమకూడతారు భూమి మీద డాళ్లు దేవునికి చెందినవి; ఆయన గొప్పగా హెచ్చింపబడ్డారు.

  14. ఒక గీతము. కోరహు కుమారుల కీర్తన. మన దేవుని పట్టణంలో ఆయన పరిశుద్ధ పర్వతం మీద యెహోవా గొప్పవాడు, అధిక స్తోత్రార్హుడు.

  15. దేవుడు ఆమె కోటలలో ఉన్నారు; ఆయనే దానికి కోట అని చూపించారు.

  16. మనం విన్నదే, మనం చూశాం; సైన్యాల యెహోవా పట్టణంలో, మన దేవుని పట్టణంలో, దేవుడు దాన్ని నిత్యం సుస్థిరంగా ఉండేలా చేస్తారు. సెలా

  17. దేవా! మీ మందిరం మధ్యలో మీ మారని ప్రేమను మేము ధ్యానిస్తాము.

  18. ఓ దేవా, మీ పేరులా, మీ స్తుతి భూదిగంతాలకు చేరుతుంది; మీ కుడిచేయి నీతితో నిండి ఉంది.

  19. మీ తీర్పులను బట్టి సీయోను పర్వతం ఆనందిస్తుంది యూదా పట్టణాలు సంతోషంగా ఉన్నాయి.

  20. ఈ దేవుడు ఎప్పటికీ మన దేవుడు; ఆయన చివరి వరకు నడిపిస్తారు.

  21. ఎవరు మరొకరి ప్రాణాన్ని విడిపించలేరు వారి కోసం దేవునికి క్రయధనం చెల్లించలేరు.

  22. కానీ దేవుడు పాతాళం నుండి నన్ను విడిపిస్తారు; ఆయన తప్పకుండ నన్ను తన దగ్గరకు తీసుకెళ్తారు. సెలా

  23. ఆసాపు కీర్తన. దేవుడైన యెహోవా, బలాఢ్యుడు, భూమితో మాట్లాడతారు, సూర్యోదయం నుండి అస్తమించే చోటు వరకు వారందరిని పిలుస్తారు.

  24. సౌందర్యంలో పరిపూర్ణమైన, సీయోను నుండి, దేవుడు ప్రకాశిస్తారు.

  25. మన దేవుడు వస్తారు మౌనంగా ఉండరు; ఆయన ముందు మ్రింగివేసే అగ్ని ఉంది ఆయన చుట్టూ బలమైన తుఫాను చెలరేగుతుంది.