God
God ను ప్రస్తావించే వచనాలు
తన ప్రజలకు తీర్పు ఇవ్వడానికి పైన ఉన్న ఆకాశాలను, క్రింద భూమిని పిలుస్తారు.
“బలి అర్పణల వల్ల నాతో నిబంధన చేసుకున్న భక్తులను నా ఎదుట సమావేశపరచండి.”
ఆకాశాలు దేవుని నీతిని ప్రకటిస్తాయి, ఎందుకంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు. సెలా
“నా ప్రజలారా! వినండి. నేను మాట్లాడతాను; ఇశ్రాయేలు, మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాను: నేను దేవుడను, మీ దేవుడను.
మీ బలుల గురించి లేదా ఎప్పుడు నా ఎదుటే ఉండే మీ దహనబలుల గురించి, నేను మీకు వ్యతిరేకంగా ఎటువంటి ఆరోపణలు చేయను.
మీ శాలలోనుండి మీరు తెచ్చే ఎద్దులు నాకవసరం లేదు. మీ దొడ్డిలోని మేకపోతులు నాకవసరం లేదు.
అడవిలో ఉన్న ప్రతి జంతువు నాదే వేయి కొండలపై ఉన్న పశువులు నావే.
పర్వతాల్లో ఉన్న ప్రతి పక్షి నాకు తెలుసు, పొలాల్లో ఉన్న జంతువులు నావే.
నాకు ఆకలిగా ఉంటే నేను మీకు చెప్పను, లోకం నాది, అందులో ఉన్నవన్నీ నావి.
ఎడ్ల మాంసం నేను తింటానా? మేకపోతుల రక్తం త్రాగుతానా?
“దేవునికి కృతజ్ఞతార్పణలు అర్పించాలి మహోన్నతునికి మీ మ్రొక్కుబడులు చెల్లించండి.
ఆపద్దినాన నన్ను పిలువండి; నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీరు నన్ను ఘనపరుస్తారు.”
దుష్టులతో దేవుడు ఇలా అంటున్నారు: “నా న్యాయవిధులు ఉచ్చరించే నా నిబంధనను మీ పెదాల మీదికి తీసుకునే హక్కు మీకెక్కడిది?
నా సూచనను మీరు అసహ్యించుకుంటారు, నా మాటల్ని మీ వెనుకకు పారవేస్తారు.
మీరు ఇవి చేసినప్పుడు నేను మౌనంగా ఉన్నాను, నేను మీలాంటి వాణ్ణే అని మీరనుకున్నారు. కాని నేనిప్పుడు మిమ్మల్ని నిలదీస్తున్నాను, నా ఆరోపణలను మీ ముందు పెడుతున్నాను.
“దేవున్ని మరచే మీరు, కొంచెం ఆలోచించండి, లేకపోతే మిమ్మల్ని ఎవరు విడిపించలేనంతగా చీల్చి ముక్కలు చేస్తాను:
కృతజ్ఞతార్పణలు అర్పించేవారు నన్ను ఘనపరుస్తారు, నిందారహితులకు దేవుని రక్షణ చూపిస్తాను.”
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. దావీదు బత్షెబతో వ్యభిచరించిన తర్వాత నాతాను ప్రవక్త తన దగ్గరకు వచ్చిన సందర్భంలో వ్రాశాడు. ఓ దేవా, మీ మారని ప్రేమను బట్టి నన్ను కరుణించండి; మీ గొప్ప కనికరాన్ని బట్టి, నా పాపాలను తుడిచివేయండి.
కేవలం మీకు, మీకే విరోధంగా నేను పాపం చేశాను, మీ దృష్టికి చెడు చేశాను; మీ తీర్పులో మీరు సరిగ్గా ఉంటారు మీరు తీర్పు తీర్చునప్పుడు న్యాయసమ్మతంగా ఉంటుంది.
మీరు అంతరంగంలో నిజాయితీ కోరతారు; ఆ రహస్య ప్రదేశంలో మీరు నాకు జ్ఞానం బోధించారు.
నన్ను ఆనందాన్ని సంతోషాన్ని విననివ్వండి; మీరు విరిచిన ఎముకలను సంతోషించనివ్వండి.
నా పాపముల నుండి మీ ముఖాన్ని దాచండి నా దోషమంతటిని తుడిచివేయండి.
ఓ దేవా, నాలో శుద్ధహృదయాన్ని సృష్టించండి, నాలో స్థిరమైన ఆత్మను నూతనంగా పుట్టించండి.
మీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకండి, మీ పరిశుద్ధాత్మను నా నుండి తొలగించకండి.
మీ రక్షణానందం నాకు తిరిగి చేకూర్చండి, నన్ను సంరక్షించడానికి నాకు సమ్మతిగల ఆత్మను ఇవ్వండి.