కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఒకప్పుడు దేవుని మందిరానికి ఆరాధికులతో పాటు ఊరేగింపుగా వెళ్తున్నప్పుడు మనం మధురమైన సహవాసం కలిగి ఉన్నాము.

  2. నేను మాత్రం, దేవునికి మొరపెడతాను, యెహోవా నన్ను రక్షిస్తారు.

  3. సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం నేను బాధలో మొరపెడతాను, ఆయన నా స్వరం వింటారు.

  4. పూర్వం నుండి సింహాసనాసీనుడైయున్న మారని దేవుడు, అది విని వారిని అణచివేస్తారు, సెలా వారు మారడానికి ఒప్పుకోరు ఎందుకంటే వారికి దేవుని భయం లేదు.

  5. మీ భారాన్ని యెహోవాపై మోపండి ఆయన మిమ్మల్ని సంరక్షిస్తారు; నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనివ్వరు.

  6. కాని దేవా, మీరు దుష్టులను నాశనకూపంలో పడవేస్తారు; రక్తపిపాసులు మోసగాళ్లు వారి ఆయుష్షులో సగం కూడ జీవించరు. కానీ నేనైతే మిమ్మల్ని నమ్ముకున్నాను.

  7. సంగీత దర్శకునికి. “దూరపు సింధూర వృక్షాల మీద ఉన్న ఒక పావురం” అనే రాగం మీద పాడదగినది. శ్రేష్ఠమైన దావీదు కీర్తన. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది. నా దేవా! నాపై దయ చూపండి, ఎందుకంటే నా శత్రువులు వేగంగా వెంటాడుతున్నారు; రోజంతా వారు తమ దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు.

  8. నా విరోధులు రోజంతా నన్ను వెంటాడుతున్నారు; వారి అహంకారంలో అనేకులు నా మీద దాడి చేస్తున్నారు.

  9. నాకు భయం వేసినప్పుడు, నేను మీయందు నమ్మకం ఉంచుతాను.

  10. దేవునిలో ఆయన వాగ్దానాన్ని కీర్తిస్తాను దేవునిలో నేను నమ్ముతాను భయపడను. మానవమాత్రులు నన్నేమి చేయగలరు?

  11. వారి దుష్టత్వాన్ని బట్టి వారు తప్పించుకోనివ్వకండి; దేవా, మీ కోపంలో వారి దేశాలను కూలద్రోయండి.

  12. నా బాధలను లెక్కించండి; నా కన్నీటిని మీ తిత్తిలో నింపండి అవి మీ గ్రంథంలో వ్రాయబడలేదా?

  13. నేను మీకు మొరపెట్టినప్పుడు నా శత్రువులు వెనుకకు తగ్గుతారు. దాన్ని బట్టి దేవుడు నా పక్షాన ఉన్నాడు అని నేను తెలుసుకుంటాను.

  14. దేవునిలో, ఆయన వాగ్దానాన్ని స్తుతిస్తాను, అవును, యెహోవాయందు, ఆయన వాగ్దానాన్ని కీర్తిస్తాను.

  15. నేను దేవునిలో నమ్ముకున్నాను నేను భయపడను. మనుష్యులు నన్నేమి చేయగలరు?

  16. నా దేవా, నేను మీకు మ్రొక్కుబడులను చెల్లించాల్సి ఉంది; నా కృతజ్ఞత అర్పణలను మీకు చెల్లిస్తాను.

  17. ఎందుకంటే మీరు మరణం నుండి నన్ను విడిపించారు తొట్రిల్లకుండ నా పాదాలను దేవుని ఎదుట నేను జీవపువెలుగులో నడవడానికి శక్తినిచ్చారు.

  18. సంగీత దర్శకునికి. “నాశనం చేయకు” అనే రాగం మీద పాడదగినది. దావీదు శ్రేష్ఠమైన కీర్తన. గుహలో దావీదు సౌలు నుండి పారిపోయినప్పుడు, అతడు రచించినది. నా దేవా, నన్ను కరుణించండి, నన్ను కరుణించండి, ఎందుకంటే నేను మిమ్మల్ని ఆశ్రయించాను. విపత్తు గడిచేవరకు నేను మీ రెక్కల నీడలో ఆశ్రయం పొందుతాను.

  19. నా కార్యం సఫలపరచే, మహోన్నతుడైన దేవునికి మొరపెట్టుకుంటాను.

  20. పరలోకం నుండి సాయం పంపి నన్ను విడిపిస్తారు, నన్ను దిగమ్రింగాలని చూస్తూ నా మీద చాడీలు పలికే వారి బారి నుండి నన్ను తప్పిస్తారు. సెలా దేవుడు తన మారని ప్రేమను, నమ్మకత్వాన్ని పంపుతారు.

  21. దేవా, ఆకాశాలకు పైగా మీరు హెచ్చింపబడాలి. భూమి అంతటి మీద మీ మహిమ ఉండును గాక.

  22. ఓ దేవా, నా హృదయం స్థిరంగా ఉంది, నా హృదయం స్థిరంగా ఉంది; నేను పాడతాను సంగీతం వాయిస్తాను,

  23. ప్రభువా, దేశాల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను జనాంగాల మధ్య మీ గురించి నేను పాడతాను.

  24. ఎందుకంటే మీ మారని ప్రేమ, ఆకాశాలను అంటుతుంది; మీ నమ్మకత్వం మేఘాలంటుతుంది.

  25. దేవా, ఆకాశాలకు పైగా మీరు హెచ్చింపబడాలి. భూమి అంతటి మీద మీ మహిమ ఉండును గాక.