God
God ను ప్రస్తావించే వచనాలు
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. ఒక గీతము. మా దేవా, సీయోనులో మీరు స్తుతికి యోగ్యులు; మా మ్రొక్కుబడులు మీకు చెల్లిస్తాము.
మీరు ప్రార్థనకు జవాబు ఇచ్చేవారు, ప్రజలందరు మీ దగ్గరకే వస్తారు.
మేము పాపాల్లో మునిగి ఉన్నప్పుడు, మీరు మా అతిక్రమాలను క్షమించారు.
మీ ఆవరణాల్లో నివసించడానికి మీరు ఎన్నుకుని మీ దగ్గరకు తెచ్చుకున్న వారు ధన్యులు! మీ పరిశుద్ధ మందిరం యొక్క, మీ గృహంలోని ఆశీర్వాదాలతో మేము తృప్తిచెందుతాం.
మీరు భీకరమైన నీతి క్రియలతో మాకు జవాబు ఇస్తారు, దేవా మా రక్షకా, భూదిగంతాలన్నిటికి సుదూర సముద్రాలకు మీరే నిరీక్షణ.
బలమును ఆయుధంగా ధరించుకొని, మీరు మీ మహాశక్తితో పర్వతాలను సృజించారు.
భూదిగంతాలలో నివసించే వారందరు మీ అద్భుతాలకు భయంతో నిండి ఉన్నారు; ఉదయం సాయంత్రాలను మీరు ఆనందంతో కేకలు వేసేలా చేస్తారు.
మీరు భూమిని గమనించి నీరు పోస్తారు; మీరు దానిని సమృద్ధిగా సుసంపన్నం చేస్తారు. ప్రజలకు ధాన్యాన్ని అందించడానికి దేవుని ప్రవాహాలు నీటితో నిండి ఉన్నాయి ఎందుకంటే దానిని మీరు అలా నియమించారు.
మీరు దున్నిన భూమిని వర్షంతో తడిపి, గడ్డలను కరిగించి, గట్లు సమం చేస్తారు. మీరు వానజల్లులతో భూమిని మృదువుగా చేసి, దాని పంటలను ఆశీర్వదిస్తారు.
మీరు మీ దయతో సంవత్సరానికి కిరీటం ధరింపచేస్తారు, మార్గాలు కూడ సమృద్ధితో పొంగిపోతాయి.
సంగీత దర్శకునికి. ఒక కీర్తన. ఒక గీతము. సర్వలోకమా! ఆనందంతో దేవునికి కేకలు వేయండి!
ఆయన నామాన్ని కీర్తించండి ఆయనను స్తుతించి మహిమపరచండి.
దేవునితో ఇలా అనండి, “మీ క్రియలు ఎంత అద్భుతం! మీ శక్తి ఎంతో గొప్పది కాబట్టి మీ శత్రువులు భయంతో మీకు లొంగిపోతారు.
సర్వ లోకం మీకు నమస్కరిస్తుంది; మీకు స్తుతి పాడతారు మీ నామాన్ని స్తుతిస్తారు.” సెలా
దేవుడు ఏం చేశారో వచ్చి చూడండి, మనుషులకు ఆయన చేసిన భీకరమైన క్రియలు చూడండి!
సముద్రాన్ని ఆరిన నేలగా చేశారు, వారు కాలినడకన నది దాటి వెళ్లారు రండి, మనం ఆయనలో ఆనందిస్తాము.
ఆయన తన శక్తితో నిత్యం పరిపాలిస్తారు, ఆయన కళ్లు దేశాలను చూస్తాయి, తిరుగుబాటు చేసేవారు తమను తాము హెచ్చించుకోకూడదు. సెలా
సర్వజనులారా, మన దేవున్ని స్తుతించండి, ఆయనను స్తుతిస్తున్న ధ్వని వినబడును గాక;
దేవా, మీరు మమ్మల్ని పరీక్షించారు; వెండిలా మమ్మల్ని శుద్ధి చేశారు.
మీరు మమ్మల్ని వలలో బంధించారు, మా నడుముల మీద భారాన్ని మోపారు.
మీరు మా తలలపై స్వారీ చేయడానికి ప్రజలను అనుమతించారు; అగ్ని జలాల గుండా మేము వెళ్లాము, అయినా మీరు మమ్మల్ని సమృద్ధిగల స్థలంలోనికి తెచ్చారు.
దహన బలులతో మీ ఆలయానికి వచ్చి నా మ్రొక్కుబడులు మీకు చెల్లిస్తాను.
దేవుడంటే భయం భక్తి ఉన్నవారలారా, మీరంతా రండి వినండి; ఆయన నా కోసం ఏం చేశారో మీకు చెప్తాను.
నేను నా నోటితో ఆయనకు మొరపెట్టాను; ఆయన స్తుతి నా నాలుక మీద ఉంది.
నా హృదయంలో దుష్టత్వం ఉంటే, ప్రభువు నా ప్రార్థన వినేవారు కాదు.