God
God ను ప్రస్తావించే వచనాలు
అనుదినం మన భారాలు భరించే మన రక్షకుడైన దేవునికి, ప్రభువునకు స్తుతి కలుగును గాక. సెలా
మన దేవుడు రక్షించే దేవుడు; ప్రభువైన యెహోవా నుండి మరణ విడుదల కలుగుతుంది.
దేవుడు ఖచ్చితంగా తన శత్రువుల తలలను చితకగొడతారు, అపరాధ మార్గాలను ప్రేమించేవారి నడినెత్తులను చితకగొడతారు.
ప్రభువు అంటున్నారు, “బాషానులో నుండి మిమ్మల్ని రప్పిస్తాను; సముద్రం లోతుల్లో నుండి మిమ్మల్ని తెస్తాను.”
దేవా! మీ ఊరేగింపు కనబడుతుంది, పరిశుద్ధాలయం లోనికి వస్తున్న నా రాజైన దేవుని యొక్క ఊరేగింపు.
మహా సమాజాలలో దేవుని స్తుతించండి; ఇశ్రాయేలు సమాజంలో యెహోవాను స్తుతించండి.
దేవా, మీ శక్తిని రమ్మని పిలువండి; ఇంతకుముందు మీరు చేసినట్టుగా, మా దేవా, మీ బలాన్ని మాకు చూపండి,
యెరూషలేములో ఉన్న మీ దేవాలయాన్ని బట్టి రాజులు మీకు కానుకలు తెస్తారు.
దేవా! రెల్లు మధ్యలో ఉండే మృగాన్ని, అడవి జంతువుల లాంటి దేశాల మధ్యలో ఉన్న ఎడ్ల గుంపును గద్దించండి. అవి తగ్గించబడి వెండి కడ్డీలను పన్నుగా తెచ్చును గాక యుద్ధాలంటే ఇష్టపడే దేశాలను చెదరగొట్టండి.
ఈజిప్టు నుండి రాయబారులు వస్తారు. కూషు తనను తాను దేవునికి సమర్పించుకుంటుంది.
భూలోక రాజ్యాల్లారా, దేవునికి పాడండి, ప్రభువుకు స్తుతి పాడండి. సెలా
అనాది కాలం నుండి మహా ఆకాశాల్లో స్వారీ చేసే, తన స్వరంతో ఉరిమే ఆయనను కీర్తించండి.
దేవుని శక్తిని ప్రకటించండి, ఆయన ప్రభావం ఇశ్రాయేలుపై ఉన్నది, ఆయన శక్తి అంతరిక్షంలో ఉంది.
దేవా, మీరు మీ పరిశుద్ధాలయంలో భీకరులు; ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలకు బల ప్రభావాన్ని ఇస్తారు. దేవునికే స్తుతి కలుగును గాక!
సంగీత దర్శకునికి. “కలువ పువ్వులు” అనే రాగము మీద పాడదగినది. దావీదు కీర్తన. దేవా, నన్ను రక్షించండి, నీళ్లు నా మెడ వరకు పొంగి వచ్చాయి.
సాయం కోసం అరిచి అలసిపోయాను; నా గొంతు ఆరిపోయింది. నా దేవుని కోసం చూస్తూ, నా కళ్లు క్షీణిస్తున్నాయి.
దేవా! నా బుద్ధిహీనత మీకు తెలుసు; నా అపరాధాలు మీ నుండి దాచబడలేదు.
సైన్యాల అధిపతియైన యెహోవా, మీలో నిరీక్షణ ఉంచినవారు నా వలన అవమానానికి గురికావద్దు; ఇశ్రాయేలు దేవా, మిమ్మల్ని వెదకేవారు నా వలన సిగ్గుపడకూడదు.
మీ కోసం నేను నిందల పాలయ్యాను, సిగ్గు నా ముఖాన్ని కప్పేసింది.
మీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను దహించి వేస్తుంది, మిమ్మల్ని అవమానపరచే వారి అవమానాలు నా మీద పడును గాక.
అయితే యెహోవా, ఇది మీ దయ చూపే సమయమని నేను మీకు ప్రార్థిస్తున్నాను. దేవా, మీ గొప్ప ప్రేమతో, మీ నమ్మకమైన రక్షణతో నాకు జవాబు ఇవ్వండి.
యెహోవా, మీ ప్రేమలోని మంచితనంతో నాకు జవాబు ఇవ్వండి; మీ గొప్ప కనికరాన్ని బట్టి నా వైపు తిరగండి.
మీ సేవకుని నుండి మీ ముఖాన్ని దాచకండి; నేను ఇబ్బందిలో ఉన్నాను, నాకు త్వరగా జవాబివ్వండి.
నన్ను ఎలా హేళన చేశారో, అవమానపరిచారో, సిగ్గుపరిచారో మీకు తెలుసు; నా శత్రువులంతా మీ ఎదుటే ఉన్నారు.
మీ ఉగ్రతను వారి మీద కుమ్మరించండి; మీ కోపాగ్ని వారిని తాకనివ్వండి.