కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీరు గాయం చేసిన వారిని వారు హింసిస్తారు మీరు బాధపెట్టిన వారి బాధ గురించి మాట్లాడతారు.

  2. నేరం మీద నేరం వారిపై మోపండి; మీ నీతిలో వారిని పాలు పంచుకోనివ్వకండి.

  3. కాని నా మట్టుకైతే నేను బాధించబడి వేదనలో ఉన్నాను, దేవా! మీ రక్షణ నన్ను కాపాడును గాక.

  4. నేను పాడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తాను. కృతజ్ఞత చెల్లించి ఆయనను కీర్తిస్తాను.

  5. ఎద్దును, కొమ్ములు డెక్కలు కలిగిన కోడెను అర్పించడం కంటే, ఆయనను స్తుతించడం యెహోవాకు ఇష్టము.

  6. దీనులు చూసి ఆనందిస్తారు; దేవున్ని వెదికేవారి హృదయాలు తిరిగి బ్రతుకును గాక.

  7. అవసరత ఉన్నవారి మొర యెహోవా వింటారు, బందీగా ఉన్న తన ప్రజలను ఆయన అలక్ష్యం చేయరు.

  8. ఆకాశం భూమి ఆయనను స్తుతించును గాక, సముద్రాలు వాటిలో ఉండే జలచరాలన్నీ ఆయనను స్తుతించును గాక.

  9. ఎందుకంటే దేవుడు సీయోనును రక్షిస్తారు, యూదా పట్టణాలను తిరిగి కడతారు. అప్పుడు ప్రజలు అక్కడ నివసించి దానిని స్వాధీనం చేసుకుంటారు.

  10. దేవుని సేవకుల సంతానం ఆ భూమిని వారసత్వంగా పొందుతారు. ఆయన నామాన్ని ప్రేమించేవారు అక్కడ నివసిస్తారు.

  11. సంగీత దర్శకునికి. దావీదు అభ్యర్థన కీర్తన. దేవా, నన్ను రక్షించడానికి త్వరపడండి; యెహోవా, నాకు సాయం చేయడానికి, త్వరగా రండి.

  12. అయితే మిమ్మల్ని వెదికేవారంతా మీలో ఆనందించి సంతోషించాలి; మీ రక్షణను ప్రేమించేవారు ఎల్లప్పుడు, “యెహోవా గొప్పవాడు!” అని అనాలి.

  13. కాని నా మట్టుకైతే, నేను దీనుడను అవసరతలో ఉన్నవాడను; దేవా! నా దగ్గరకు త్వరగా రండి, మీరే నా సహాయం, నా విమోచకుడు; యెహోవా, ఆలస్యం చేయకండి.

  14. యెహోవా, నేను మీలో ఆశ్రయం పొందాను; నన్ను ఎప్పటికీ సిగ్గుపడనీయకండి.

  15. మీ నీతిని బట్టి నన్ను రక్షించి విడిపించండి; నా వైపు చెవి ఉంచి నన్ను రక్షించండి.

  16. నేను ఎల్లప్పుడూ వెళ్లగలిగే, నా ఆశ్రయదుర్గంగా ఉండండి; మీరు నా కొండ నా కోట కాబట్టి, నన్ను రక్షించేందుకు ఆజ్ఞ ఇవ్వండి.

  17. నా దేవా, దుష్టుల చేతి నుండి, చెడ్డవారు, క్రూరుల పట్టు నుండి నన్ను విడిపించండి.

  18. ప్రభువైన యెహోవా, మీరే నా నిరీక్షణ, నా యవ్వనం నుండి మీరే నా ధైర్యం.

  19. పుట్టినప్పటి నుండి నేను మీమీద ఆధారపడ్డాను; నన్ను తల్లి గర్భం నుండి బయటకు తెచ్చింది మీరే. నేను నిత్యం మిమ్మల్ని స్తుతిస్తాను.

  20. అనేకులకు నేనొక సూచనగా ఉన్నాను; మీరే నాకు బలమైన ఆశ్రయం.

  21. నా నోరు మీ స్తుతితో నిండి ఉంది; నేను రోజంతా మీ వైభవాన్ని ప్రకటిస్తాను.

  22. “దేవుడు అతన్ని విడిచిపెట్టారు; అతన్ని విడిపించడానికి ఒక్కరు లేరు, అతన్ని వెంటాడి పట్టుకోండి” అని వారంటారు.

  23. నా దేవా, నాకు దూరంగా ఉండకండి; దేవా, సాయం చేయడానికి త్వరగా రండి.

  24. నా మట్టుకైతే, నేనెల్లప్పుడు నిరీక్షణ కలిగి ఉంటాను; నేను ఇంకా ఎక్కువగా మిమ్మల్ని స్తుతిస్తాను.

  25. రోజంతా నా నోరు మీ నీతిక్రియలను గురించి, రక్షణక్రియలను గురించి చెప్తుంది. అవి నా గ్రహింపుకు అందనివి.