కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కాని దేవుడు నిశ్చయంగా ఆలకించారు నా ప్రార్థన విన్నారు.

  2. నా ప్రార్థనను త్రోసివేయని తన మారని ప్రేమను నా నుండి తొలగించని, దేవునికి స్తుతి కలుగును గాక!

  3. ప్రధాన గాయకునికి. తంతివాద్యాలతో పాడదగినది. ఒక కీర్తన. ఒక గీతము. దేవుడు మామీద దయచూపి దీవించును గాక, ఆయన ముఖం మాపై ప్రకాశించును గాక. సెలా

  4. తద్వార భూమి మీద మీ మార్గాలు దేశాలన్నిటికి మీ రక్షణ తెలుస్తాయి,

  5. దేవా, జనాంగాలు మిమ్మల్ని స్తుతించును గాక; సర్వ జనులు మిమ్మల్ని స్తుతించుదురు గాక.

  6. దేశాలు సంతోషించి ఆనంద గానం చేయుదురు గాక, ఎందుకంటే మీరు జనులను న్యాయంగా పరిపాలిస్తారు భూమి మీద దేశాలను పాలిస్తారు. సెలా

  7. దేవా, జనాంగాలు మిమ్మల్ని స్తుతించును గాక; సర్వ జనులు మిమ్మల్ని స్తుతించుదురు గాక.

  8. భూమి దాని పంటను ఇస్తుంది; దేవుడు, మా దేవుడు, మమ్మల్ని దీవిస్తారు.

  9. అవును, దేవుడు మనల్ని దీవించును గాక, తద్వార భూదిగంతాలలో ఉన్న ప్రజలంతా ఆయనకు భయపడుదురు గాక.

  10. సంగీత దర్శకునికి. దావీదు కీర్తన గీతము. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురు గాక; ఆయన విరోధులు ఆయన ఎదుట నుండి పారిపోవుదురు గాక.

  11. మీరు వారిని పొగలా ఊదివేయండి; మైనం అగ్నికి కరిగి పోయినట్టు దుష్టులు దేవుని ఎదుట నశించెదరు గాక.

  12. కాని నీతిమంతులు సంతోషించి దేవుని ఎదుట ఆనందించుదురు గాక వారు సంతోషంగా ఆనందంగా ఉందురు గాక.

  13. దేవునికి పాడండి, ఆయన నామాన్ని బట్టి స్తుతి పాడండి, మేఘాల మీద స్వారీ చేసే ఆయనను కీర్తించండి; ఆయన పేరు యెహోవా; ఆయన ఎదుట ఆనందించండి.

  14. తన పరిశుద్ధ నివాసంలో ఉన్న దేవుడు, తండ్రిలేనివారికి తండ్రి, విధవరాండ్రకు సంరక్షుడు.

  15. దేవుడు ఒంటరిగా ఉన్నవారిని కుటుంబాలలో ఉంచుతారు, బందీలను విడిపించి వారికి ఆనందాన్ని అనుగ్రహిస్తారు; కాని తిరుగుబాటుదారులు ఎండిన భూమిలో నివసిస్తారు.

  16. దేవా! మీ ప్రజలకు ముందుగా మీరు వెళ్లారు, అరణ్యం గుండా మీరు నడిచారు. సెలా

  17. సీనాయి యొక్క ఏకైక దేవుని ముందు, ఇశ్రాయేలు దేవుని ముందు, భూమి కంపించింది, ఆకాశాలు వాన కురిపించాయి.

  18. దేవా, మీరు స్వచ్ఛందంగా సమృద్ధి వర్షాన్ని ఇచ్చారు; నీరసించిన మీ వారసత్వాన్ని మీరు ఉత్తేజపరచారు.

  19. మీ జనులు అందులో స్థిరపడ్డారు, దేవా, మీ దయతో పేదలకు అవసరమైనవి ఇచ్చారు.

  20. ప్రభువు తన మాటను చాటించారు, స్త్రీలు శుభవార్తను ప్రకటిస్తారు:

  21. సర్వశక్తిమంతుడు ఈ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను కొండమీద మంచు కురిసినట్లు కనిపించింది.

  22. దేవుని పర్వతమా, పర్వత శిఖరమా, బాషాను పర్వతమా, కఠినమైన పర్వతమా,

  23. కఠినమైన పర్వతమా, దేవుడు పరిపాలించడానికి ఎన్నుకున్న పర్వతం వైపు ఎల్లకాలమూ యెహోవా నివసించే స్థలం వైపు ఎందుకు అసూయతో చూస్తావు?

  24. దేవుని రథాలు వేలాది కొలది కోట్ల కొలదిగా ఉన్నాయి; వాటి మధ్యలో, ప్రభువు సీనాయి పర్వతం నుండి తన పరిశుద్ధాలయానికి వచ్చి ఉన్నారు.

  25. యెహోవా దేవా, మీరు నిత్యం పాలించడానికి పైకి ఆరోహణమైనప్పుడు, మీరు అనేకమందిని చెరపట్టి తీసుకెళ్లారు; మీరు మనుష్యుల నుండి ఈవులు స్వీకరించారు, తిరుగుబాటుదారుల నుండి కూడా స్వీకరించారు.