కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ప్రభువైన యెహోవా, నేను వచ్చి మీ గొప్ప కార్యాలను ప్రకటిస్తాను; కేవలం మీ నీతిక్రియలను మాత్రమే నేను ప్రకటిస్తాను.

  2. దేవా! నా యవ్వనం నుండి మీరు నాకు బోధించారు, ఈ రోజు వరకు నేను మీ అద్భుత క్రియలను ప్రకటిస్తున్నాను.

  3. నేను వృద్ధుడనై తల నెరసినప్పటికి, నా దేవా, తర్వాత తరానికి మీ శక్తిని, రాబోయే వారందరికి మీ గొప్ప కార్యాలను ప్రకటించే వరకు నన్ను విడిచిపెట్టకండి.

  4. దేవా, మీ నీతి ఎత్తయిన ఆకాశాలకు ఉన్నతమైనది, మీరు గొప్ప వాటిని చేశారు. దేవా, మీలాంటి వారెవరు?

  5. నా దేవా, మీ నమ్మకత్వాన్ని బట్టి నేను సితారాతో మిమ్మల్ని స్తుతిస్తాను; ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడా, నేను వీణతో మిమ్మల్ని స్తుతిస్తాను.

  6. మీరు విడిపించిన నేను మీకు స్తుతి పాడినప్పుడు నా పెదవులు ఆనందంతో కేకలు వేస్తాయి.

  7. రోజంతా నా నాలుక మీ నీతిక్రియలను గురించి చెప్తుంది, ఎందుకంటే నాకు హాని చేయాలని కోరుకున్నవారు అవమానం పొంది గందరగోళానికి గురి అయ్యారు.

  8. సొలొమోను కీర్తన. ఓ దేవా, రాజుకు మీ న్యాయాన్ని, రాకుమారునికి మీ నీతిని ప్రసాదించండి.

  9. ఆయన మీ ప్రజలకు నీతితో బాధితులకు న్యాయంతో తీర్పు తీర్చును గాక.

  10. ప్రజల్లో బాధపడుతున్నవారిని ఆయన రక్షించును గాక అవసరతలో ఉన్న వారి పిల్లలను రక్షించును గాక; బాధించేవారిని త్రొక్కివేయును గాక.

  11. సూర్యుడు ఉన్నంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం, అన్ని తరాల వరకు వారు ఆయనకు భయపడుదురు గాక.

  12. ఆయన పేరు నిరంతరం ఉండును గాక; అది సూర్యుడు ఉండే వరకు కొనసాగును గాక. అప్పుడు ఆయన ద్వారా అన్ని దేశాలు ఆశీర్వదించబడతాయి, వారు ఆయనను ధన్యుడు అని పిలుస్తారు.

  13. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవునికి స్తుతి, ఆయన మాత్రమే అద్భుతాలు చేస్తారు.

  14. ఆయన మహిమగల నామం సదాకాలం స్తుతింపబడును గాక; భూమంతా ఆయన మహిమతో నింపబడును గాక.

  15. ఆసాపు కీర్తన. ఇశ్రాయేలుకు, శుద్ధ హృదయులకు దేవుడు ఖచ్చితంగా మంచివాడు.

  16. అందువల్ల వారి ప్రజలు వారివైపు తిరుగుతారు వారి మాటలను మంచినీరు త్రాగినట్లు త్రాగుతారు.

  17. “దేవునికి ఎలా తెలుస్తుంది? మహోన్నతునికి ఏదైనా తెలుసా?” అని వారనుకుంటారు.

  18. Until I went into the sanctuary of God; then understood I their end.

  19. ఖచ్చితంగా మీరు వారిని జారే నేలపై ఉంచారు; మీరు వారిని పతనానికి పడవేస్తారు.

  20. ప్రభువా, మీరు లేచినప్పుడు, ఒకరు మేల్కొన్నప్పుడు ఒక కలలో చూసినవి మరచినట్లు; మీరు వారి ఉనికిని తృణీకరిస్తారు.

  21. నేను తెలివిలేని వాడను, అజ్ఞానిని; మీ ఎదుట నేను క్రూరమైన మృగంలా ఉన్నాను.

  22. అయినా నేనెల్లప్పుడు మీతో ఉన్నాను; మీరు నా కుడిచేయి పట్టుకున్నారు.

  23. మీ ఆలోచనచేత నన్ను నడిపిస్తున్నారు, తర్వాత నన్ను పరలోక మహిమలో చేర్చుకుంటారు.

  24. పరలోకంలో మీరు తప్ప నాకెవరున్నారు? మీరు తప్ప ఈ లోకంలో నాకేమి అక్కర్లేదు.

  25. నా శరీరం నా హృదయం నీరసిస్తాయేమో, కాని నిత్యం నా దేవుడు నా హృదయానికి బలం నిత్యం నా స్వాస్థ్యం.