కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉంది అందులో సుగంధద్రవ్యాలు కలిపిన పొంగుతున్న ద్రాక్షరసం ఉంది; ఆయన దాన్ని బయటకు కుమ్మరిస్తారు, భూమిలోని దుష్టులందరు మడ్డితో సహా దాన్ని త్రాగివేస్తారు.

  2. నేనైతే నిత్యం ప్రకటిస్తాను; యాకోబు దేవునికి నేను స్తుతి పాడతాను.

  3. సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. ఒక ఆసాపు కీర్తన. ఒక గీతము. యూదాలో దేవుడు ప్రఖ్యాతి గాంచారు; ఇశ్రాయేలులో ఆయన నామం గొప్పది.

  4. షాలేములో ఆయన గుడారం ఉంది. సీయోనులో ఆయన నివాసస్థలం ఉంది.

  5. అక్కడ ఆయన మెరుస్తున్న బాణాలు, డాళ్లు, ఖడ్గాలు, యుద్ధ ఆయుధాలు విరిచివేశారు. సెలా

  6. యాకోబు దేవా! మీరు గద్దిస్తే గుర్రం రథం మరణ నిద్రలో పడి ఉంటాయి.

  7. మీ ఒక్కరికే భయపడాలి. మీరు కోప్పడినప్పుడు మీ ఎదుట ఎవరు నిలవగలరు?

  8. ఎందుకంటే దేవా, దేశంలో అణగారిన వారినందరిని రక్షించడానికి, తీర్పు తీర్చడానికి మీరు లేచారు. సెలా

  9. మనుష్యుల మీది మీ ఉగ్రత మీకు స్తుతి కలిగిస్తుంది, మీ ఉగ్రత నుండి తప్పించుకున్న వారిని మీరు ఆయుధంగా ధరించుకుంటారు.

  10. దేవుడైన యెహోవాకు మ్రొక్కుబడులు చేసి వాటిని చెల్లించండి; పొరుగు దేశాలన్నీ భయపడదగినవానికి బహుమతులు తెచ్చుదురు గాక.

  11. పాలకుల పొగరును ఆయన అణచివేస్తారు; భూరాజులు ఆయనను చూసి భయపడాలి.

  12. సంగీత దర్శకుడైన యెదూతూనుకు. ఒక ఆసాపు కీర్తన. నేను సహాయం కోసం దేవునికి మొరపెట్టాను; ఆయన వింటాడని నేను దేవునికి మొరపెట్టాను.

  13. నేను బాధలో ఉన్నప్పుడు నేను ప్రభువును ఆశ్రయించాను; అలసిపోకుండా రాత్రంతా నేను చేతులు చాచాను, నాకు ఆదరణ కలుగలేదు.

  14. దేవా, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దుఃఖించాను; నేను ధ్యానిస్తున్నప్పుడు నా ఆత్మ సొమ్మసిల్లింది. సెలా

  15. “ప్రభువు నన్ను శాశ్వతంగా తృణీకరిస్తారా? ఆయన ఎప్పటికీ తన దయను చూపించరా?

  16. ఆయన మారని ప్రేమ శాశ్వతంగా పోయినట్లేనా? ఆయన వాగ్దానం ఎప్పటికీ నెరవేరదా?

  17. దేవుడు కరుణించడం మరచిపోయారా? ఆయన తన కోపంలో కనికరాన్ని చూపకుండ ఉంటారా?” సెలా

  18. అప్పుడు నేను ఇలా అనుకున్నాను, “ఇది నా విధి: మహోన్నతుడు నాకు వ్యతిరేకంగా చేయి ఎత్తారు.

  19. యెహోవా కార్యాలను గుర్తు చేసుకుంటాను; అవును, చాలా కాలంనాటి మీ అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను.

  20. మీ కార్యాలన్నిటిని నేను తలంచుకుంటాను, మీ గొప్ప క్రియలన్నిటిని నేను ధ్యానిస్తాను.”

  21. దేవా, మీ మార్గాలు పరిశుద్ధమైనవి. మన దేవునిలాంటి గొప్ప దేవుడెవరున్నారు?

  22. మీరు అద్భుతాలు చేసే దేవుడు; మీరు ప్రజలమధ్య మీ శక్తిని చూపిస్తారు.

  23. మీ శక్తివంతమైన చేతితో యాకోబు, యోసేపు సంతతివారైన మీ ప్రజలను విమోచించారు. సెలా

  24. దేవా, జలాలు మిమ్మల్ని చూశాయి, జలాలు మిమ్మల్ని చూసి త్రుళ్ళిపడ్డాయి; అగాధాలు వణికిపోయాయి.

  25. మేఘాలు వర్షించాయి. ఆకాశాలు ఉరుములతో ప్రతిధ్వనించాయి. మీ బాణాలు అన్నివైపులా తళుక్కుమన్నాయి.