కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అందువల్ల ఆయన వారి రోజులను నిష్ఫలంగా వారి సంవత్సరాలు భయంలో ముగిసిపోయేలా చేశారు.

  2. దేవుడు వారిని చంపినప్పుడల్లా వారు ఆయనను వెదికారు; వారు మరలా ఆసక్తిగా ఆయన వైపు తిరిగారు.

  3. దేవుడు తమకు కొండ అని, సర్వోన్నతుడైన దేవుడు తమ విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకున్నారు.

  4. అయితే వారు ఆయనను నోటితో పొగడుతూ తమ నాలుకలతో ఆయనకు అబద్ధాలు చెప్పారు;

  5. వారి హృదయాలు దేవుని పట్ల విధేయతగా లేవు, వారు ఆయన నిబంధన పట్ల నమ్మకంగా లేరు.

  6. అయినా దేవుడు దయ చూపించి; వారి పాపాలను క్షమించారు వారిని నాశనం చేయలేదు. మాటిమాటికి ఆయన తన కోపాన్ని అదుపు చేసుకున్నారు ఆయన పూర్తి ఉగ్రతను రేపలేదు.

  7. వారు కేవలం శరీరులే అని, విసరి వెళ్లి మరలి రాని గాలి లాంటి వారని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు.

  8. అరణ్యంలో వారు ఆయన మీద అనేకసార్లు తిరుగుబాటు చేశారు, ఎడారిలో ఆయన హృదయాన్ని దుఃఖపెట్టారు.

  9. పదే పదే వారు దేవున్ని పరీక్షించారు; వారు ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని బాధపెట్టారు.

  10. వారు ఆయన శక్తిని గాని, శత్రువుల నుండి వారిని విడిపించిన దినాన్ని కాని,

  11. ఆయన ఈజిప్టులో చేసిన సూచకక్రియలను, సోయను ప్రాంతంలో అద్భుతక్రియలు చూపించిన దినాన్ని వారు జ్ఞాపకం ఉంచుకోలేదు.

  12. నాశనం కలుగచేసే దూతల సేనను పంపినట్లు ఆయన వారి మీదికి తన కోపాన్ని తన ఉగ్రతను, ఆగ్రహాన్ని క్రోధాన్ని పంపారు.

  13. ఆయన తన కోపానికి మార్గాన్ని సిద్ధపరచారు; ఆయన వారిని మరణం నుండి తప్పించకుండ, వారి ప్రాణాలను తెగుళ్ళకు అప్పగించారు.

  14. అయితే ఆయన తన ప్రజలను గొర్రెల మందలా బయటకు తెచ్చారు; గొర్రెలను నడిపించినట్లు అరణ్యం గుండా ఆయన వారిని నడిపించారు.

  15. ఆయన వారిని క్షేమంగా నడిపించారు, కాబట్టి వారు భయం లేకుండ ఉన్నారు; సముద్రంలో వారి శత్రువులను ముంచివేశారు.

  16. ఆయన వారిని తన పవిత్ర దేశ సరిహద్దుకు, ఆయన కుడి హస్తం సంపాదించిన కొండ ప్రదేశానికి తీసుకువచ్చారు.

  17. కాని వారు దేవున్ని పరీక్షించారు మహోన్నతుని మీద తిరగబడ్డారు; వారు ఆయన శాసనాలను పాటించలేదు.

  18. వారి క్షేత్రాలతో దేవునికి కోపం తెప్పించారు; వారు విగ్రహాలను పెట్టుకుని ఆయనకు రోషం పుట్టించారు.

  19. దేవుడు వారి కేకలు విన్నప్పుడు, ఆయన ఆగ్రహించారు; ఆయన ఇశ్రాయేలును పూర్తిగా త్రోసివేశారు.

  20. షిలోహు ప్రత్యక్ష గుడారాన్ని, మనుష్యుల మధ్య ఆయన వేసుకున్న గుడారాన్ని విడిచిపెట్టారు.

  21. ఆయన తన బలానికి సూచనగా ఉన్న మందసాన్ని బందీఖానాకు, తన వైభవాన్ని శత్రువుల చేతికి అప్పగించారు.

  22. ఆయన తన ప్రజలను ఖడ్గానికి అప్పగించారు; ఆయన తన వారసత్వం మీద ఆగ్రహించారు.

  23. అప్పుడు నిద్ర నుండి లేచినవానిలా, ద్రాక్షారస మత్తు నుండి మేల్కొన్న యోధునిలా దేవుడు మేల్కొన్నారు.

  24. ఆయన తన శత్రువుల మీద ప్రతి దాడి చేశారు; వారికి నిత్య అవమానాన్ని కలిగించారు.

  25. అప్పుడు ఆయన యోసేపు గుడారాలను నిరాకరించారు, ఆయన ఎఫ్రాయిం గోత్రాన్ని ఏర్పరచుకోలేదు;