కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కాని ఆయన యూదా గోత్రాన్ని, తాను ప్రేమించిన సీయోను కొండనే ఎన్నుకున్నారు.

  2. ఆయన పరిశుద్ధాలయాన్ని ఆకాశమంత ఎత్తుగా, భూమిలా దృఢంగా శాశ్వతంగా నిర్మించుకున్నారు.

  3. ఆయన తన సేవకుడైన దావీదును ఎన్నుకుని, గొర్రెల దొడ్డి నుండి అతన్ని పిలిపించారు;

  4. గొర్రెలను మేపుతుండగా అతన్ని తీసుకువచ్చి తన ప్రజలైన యాకోబు మీద, తన వారసత్వమైన ఇశ్రాయేలు మీద కాపరిగా నియమించారు.

  5. ఆసాపు కీర్తన. ఓ దేవా, పరదేశులు స్వాస్థ్యాన్ని ఆక్రమించుకున్నారు; అవి మీ పవిత్ర మందిరాన్ని అపవిత్రం చేశారు, యెరూషలేమును పాడు దిబ్బగా చేశారు.

  6. వారు మీ సేవకుల కళేబరాలను ఆకాశపక్షులకు ఆహారంగా, మీ సొంత ప్రజల మాంసాన్ని అడవి మృగాలకు ఆహారంగా వదిలేశారు.

  7. ఎంతకాలం, యెహోవా? మీరు ఎప్పటికీ కోప్పడతారా? ఎంతకాలం మీ రోషం అగ్నిలా మండుతుంది?

  8. మిమ్మల్ని గుర్తించని దేశాల మీద, మీ పేరట మొరపెట్టని, రాజ్యాల మీద, మీ ఉగ్రతను కుమ్మరించండి.

  9. గత తరాల పాపాలను మాకు వ్యతిరేకంగా జ్ఞాపకం చేసుకోకండి; మీ కరుణను త్వరగా మాపై చూపండి, ఎందుకంటే మేము చాలా కష్టాల్లో ఉన్నాము.

  10. దేవా మా రక్షకా, మీ నామ మహిమార్థమై మాకు సాయం చేయండి; మీ నామాన్ని బట్టి మమ్మల్ని విడిపించి మా పాపాలను క్షమించండి.

  11. “వారి దేవుడు ఎక్కడ?” అని ఇతర దేశాలు ఎందుకు అనాలి? మీ సేవకుల రక్తానికి మీరు ప్రతీకారం తీర్చుకుంటారని మా కళ్ళెదుట ఇతర దేశాల వారికి తెలియజేయండి.

  12. ఖైదీల నిట్టూర్పులు మీ ఎదుటకు వచ్చును గాక; మీ బలమైన చేతితో మరణశిక్ష విధించబడిన వారిని కాపాడండి.

  13. ప్రభువా, మా పొరుగువారు మీమీద చూపిన ధిక్కారణకు ప్రతిగా వారి ఒడిలోకి ఏడంతలు తిరిగి చెల్లించండి.

  14. అప్పుడు మీ ప్రజలు, మీరు మేపే గొర్రెలమైన మేము, మిమ్మల్ని నిత్యం స్తుతిస్తాము; తరతరాలకు మీ కీర్తిని ప్రకటిస్తాం.

  15. సంగీత దర్శకునికి. “నిబంధన కలువలు” అనే రాగము మీద పాడదగినది. ఆసాపు కీర్తన. ఇశ్రాయేలు ప్రజల కాపరీ, యోసేపును మందగా నడిపిస్తున్నవాడా, మమ్మల్ని ఆలకించండి. కెరూబుల మధ్య సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడా,

  16. ఎఫ్రాయిం, బెన్యామీను, మనష్షే గోత్రాల ఎదుట ప్రకాశించండి. మీ పరాక్రమాన్ని చూపించండి; వచ్చి మమ్మల్ని రక్షించండి.

  17. ఓ దేవా, మమ్మల్ని తిరిగి రప్పించండి; మేము రక్షింపబడేలా మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి.

  18. సైన్యాల యెహోవా దేవా, ఎంతకాలం మీ ప్రజల ప్రార్థనలకు వ్యతిరేకంగా మీ కోపం మండుతుంది?

  19. సైన్యాలకు అధిపతియైన దేవా, మమ్మల్ని పునరుద్ధరించండి; మేము రక్షింపబడేలా మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి.

  20. మీరు ఈజిప్టు నుండి తెచ్చిన ద్రాక్షతీగను నాటారు; మీరు దేశాలను వెళ్లగొట్టి దాన్ని నాటారు.

  21. దారిని వెళ్లేవారంతా దాని ద్రాక్షలు తెంపేలా దాని కంచెలను మీరెందుకు పడగొట్టారు?

  22. సైన్యాలకు అధిపతియైన దేవా, మా దగ్గరకు తిరిగి రండి! ఆకాశం నుండి ఇటు చూడండి! ఈ ద్రాక్షవల్లిని గమనించండి.

  23. అది మీ కుడి హస్తం నాటిన వేరు, మీ కోసం మీరు పెంచుకొన్న కుమారుడు.

  24. మా ద్రాక్షవల్లి నరకబడి అగ్నితో కాల్చబడింది; మీ గద్దింపుకు మీ ప్రజలు నశిస్తారు.

  25. మీ కుడి వైపున ఉన్న మనుష్యుని మీద, మీ కోసం మీరు పెంచిన మనుష్యకుమారుని మీద మీ హస్తాన్ని ఉంచండి.