కంటెంట్‌కు వెళ్లండి

Abraham

277 వచనాలు · 14 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Abram

Abraham ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు అబ్రాహాము సాష్టాంగపడ్డాడు; అతడు తన హృదయంలో నవ్వుకుంటూ, “నూరు సంవత్సరాలు నిండిన మనుష్యునికి కుమారుడు పుడతాడా? తొంభై సంవత్సరాలు నిండిన శారా బిడ్డను కంటుందా?” అని అనుకున్నాడు.

  2. అబ్రాహాము దేవునితో, “మీ ఆశీర్వాదం క్రింద ఇష్మాయేలు జీవిస్తే చాలు!” అని అన్నాడు.

  3. దేవుడు అబ్రాహాముతో మాట్లాడిన తర్వాత, పైకి వెళ్లిపోయారు.

  4. ఆ రోజే అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును, ఇంట్లో పుట్టిన లేదా డబ్బుతో కొనబడిన మగవారికందరికి దేవుడు చెప్పినట్టు సున్నతి చేయించాడు.

  5. అబ్రాహాము సున్నతి పొందినప్పుడు అతని వయస్సు తొంభై తొమ్మిది సంవత్సరాలు,

  6. అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలు, ఇద్దరు అదే రోజు సున్నతి పొందారు.

  7. కాబట్టి అబ్రాహాము శారా గుడారంలోకి త్వరపడి వెళ్లి, “త్వరగా మూడు మానికెలు నాణ్యమైన పిండి తెచ్చి, బాగా పిసికి రొట్టెలు చేయి” అని చెప్పాడు.

  8. తర్వాత అబ్రాహాము పశువుల మంద దగ్గరకు పరుగెత్తి వెళ్లి, లేగదూడను తెచ్చి తన పనివానికి ఇచ్చాడు, ఆ పనివాడు త్వరగా దానిని వండి పెట్టాడు.

  9. అబ్రాహాము శారా అప్పటికే చాలా వృద్ధులు, శారా పిల్లలు కనే వయస్సు దాటిపోయింది.

  10. అప్పుడు యెహోవా అబ్రాహాముతో, “శారా ఎందుకలా నవ్వుకుంది, ‘ముసలిదాన్ని నేను కనగలనా అని ఎందుకు అనుకుంది?’

  11. ఆ మనుష్యులు వెళ్లడానికి లేచి సొదొమ, గొమొర్రాల వైపు చూశారు, అబ్రాహాము వారిని పంపించడానికి వారితో పాటు వెళ్లాడు.

  12. అప్పుడు యెహోవా ఇలా అన్నారు, “నేను చేయబోతున్న దానిని అబ్రాహాముకు చెప్పకుండ ఎలా దాచగలను?

  13. అబ్రాహాము ఖచ్చితంగా గొప్ప శక్తిగల దేశం అవుతాడు, అతని ద్వారా భూమి మీద ఉన్న సర్వ దేశాలు దీవించబడతాయి.

  14. ఎందుకంటే నేను అతన్ని ఎంచుకున్నాను, అతడు తన పిల్లలను తన తర్వాత తన ఇంటివారిని యెహోవా మార్గంలో నీతి న్యాయాలు జరిగిస్తూ జీవించేలా నడిపిస్తాడు, తద్వారా యెహోవా అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జరిగిస్తారు.”

  15. ఆ మనుష్యులు అక్కడినుండి సొదొమ వైపు వెళ్లారు, అయితే అబ్రాహాము యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు.

  16. అప్పుడు అబ్రాహాము ఆయనను సమీపించి, “దుష్టులతో పాటు నీతిమంతులను నిర్మూలం చేస్తారా?

  17. అబ్రాహాము మరలా మాట్లాడాడు: “నేను ధూళిని బూడిదను, అయినాసరే నేను ప్రారంభించాను కాబట్టి నేను ప్రభువుతో ఇంకా మాట్లాడతాను.

  18. యెహోవా అబ్రాహాముతో సంభాషణ ముగించిన తర్వాత, ఆయన వెళ్లిపోయారు, అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్లాడు.

  19. మర్నాడు వేకువజామున అబ్రాహాము లేచి అంతకుముందు యెహోవా ఎదుట తాను నిలిచిన స్థలానికి వెళ్లాడు.

  20. దేవుడు మైదానంలోని పట్టణాలను నాశనం చేసినప్పుడు, ఆయన అబ్రాహామును జ్ఞాపకం చేసుకున్నారు, లోతును, తాను నివసించిన ఆ పట్టణాలను పడగొట్టిన విపత్తు నుండి అతన్ని తప్పించారు.

  21. అబ్రాహాము అక్కడినుండి దక్షిణాదికి ప్రయాణం చేసి కాదేషుకు, షూరుకు మధ్య నివాసం ఉన్నాడు. కొంతకాలం గెరారులో ఉన్నాడు.

  22. అక్కడ అబ్రాహాము తన భార్య శారాను గురించి, “ఈమె నా చెల్లెలు” అని చెప్పాడు. అప్పుడు గెరారు రాజైన అబీమెలెకు శారాను తన రాజభవనం లోనికి రప్పించుకున్నాడు.

  23. అప్పుడు అబీమెలెకు అబ్రాహామును పిలిపించి, “నీవు మాకు చేసింది ఏంటి? నీ పట్ల నేను ఏ తప్పు చేశానని ఇంత గొప్ప అపరాధం నాపైన, నా రాజ్యం పైన తెచ్చావు? నీవు నా పట్ల చేసినవి ఎవరు చేయకూడనివి” అని అన్నాడు.

  24. అబీమెలెకు, “నీవు ఇలా చేయడానికి కారణమేంటి?” అని అబ్రాహామును అడిగాడు.

  25. అందుకు అబ్రాహాము అన్నాడు, “ఈ స్థలంలో దేవుని భయం లేదు, ‘నా భార్యను బట్టి వారు నన్ను చంపేస్తారు’ అని నాలో నేను అనుకున్నాను.