కంటెంట్‌కు వెళ్లండి

Nahor

10 వచనాలు · 18 కుటుంబ సభ్యులు

Nahor ను ప్రస్తావించే వచనాలు

  1. తెరహు 70 సంవత్సరాల వయసులో ఉండగా అతనికి అబ్రాము, నాహోరు, హారాను పుట్టారు.

  2. ఇది తెరహు కుటుంబ వంశావళి. తెరహుకు అబ్రాము, నాహోరు, హారాను పుట్టారు. హారానుకు లోతు పుట్టాడు.

  3. అబ్రాము, నాహోరు ఇద్దరు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అబ్రాము భార్యపేరు శారాయి, నాహోరు భార్యపేరు మిల్కా; ఈమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె.

  4. కొంతకాలం తర్వాత, అబ్రాహాముకు ఇలా చెప్పబడింది, “మిల్కా కూడా తల్లి అయ్యింది; నీ సోదరుడు నాహోరుకు ఆమె జన్మనిచ్చిన కుమారులు:

  5. బెతూయేలు రిబ్కాకు తండ్రి అయ్యాడు.

  6. అతడు ప్రార్థన ముగించకముందే రిబ్కా కడవ భుజంపై పెట్టుకుని వచ్చింది. ఆమె అబ్రాహాము సోదరుడు నాహోరు యొక్క భార్యయైన మిల్కా దంపతులకు పుట్టిన బెతూయేలు కుమార్తె.

  7. అందుకు ఆమె, “నేను మిల్కా నాహోరులకు పుట్టిన బెతూయేలు కుమార్తెను” అని జవాబిచ్చింది.

  8. “అప్పుడు నేను, ‘నీవు ఎవరి కుమార్తెవు?’ అని అడిగాను. “అందుకు ఆమె, ‘మిల్కా నాహోరులకు పుట్టిన బెతూయేలు కుమార్తెను’ అని చెప్పింది. “అప్పుడు నేను ఆమెకు ముక్కు పుడకను, చేతులకు కడియాలు ఇచ్చి,

  9. అతడు, “నాహోరు మనవడు, లాబాను మీకు తెలుసా?” అని వారిని అడిగాడు. వారు, “అవును, తెలుసు” అని చెప్పారు.

  10. అబ్రాహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీర్చును గాక” అని అన్నాడు. కాబట్టి యాకోబు తన తండ్రి ఇస్సాకు భయపడే దేవుని నామంలో ప్రమాణం చేశాడు.